– అప్పులపై బీజేపీ నేత లంకా దినకర్ వ్యంగ్యాస్త్రాలు
క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పండి జగన్‌రెడ్డి గారూ.. APCRDA రద్దు ని రద్దు చేశాక AMRDA 9/12/2021 నాటికి రద్దు అయినట్టు కదా? మరి అమరావతి భూములు అమ్మకం ద్వారా అప్పు తీరుస్తామని AMRDA ద్వార 2,994.46 కోట్లు 9/12/2021న సంతకాలతో అప్పు ఎలా చేస్తారు?అప్పు కోసం రాష్ట్ర ప్రభుత్వ మార్జిన్ మనీ 765.58 కోట్లు ఇప్పటి వరకు అమరావతి లో పూర్తి చేసిన కొన్ని కట్టడాలు, మరి అమరావతి లో ఏంలేదు స్మశానం అన్నారు కదా?
ప్రభుత్వ మార్జిన్ మనీ 765.58 కోట్ల రూపాయలు APCRDA పరిధి క్రింద సృష్టించ బడినప్పుడు, ప్రస్తుతం లేని AMRDA క్రింద ఎలా చూపుతున్నారు? APCRDA రద్దు ని రద్దు చేసింది అమరావతి భూములు భవిష్యత్తు లో అమ్మి, ఇప్పుడు చేసే అప్పులు తీర్చేందుకు మాత్రమేనా ? ఏమైనా మన జగనన్న అదృష్టవంతుడు. చంపేద్దాం అనుకున్న అమరావతి నుండి కూడా తైలం తీస్తున్నాడు.