ఏ.పి మారిటైమ్ బోర్డు నిధులు రూ. 1200 స్వాహ చేసిన జగన్ రెడ్డి

Spread the love

• మారిటైమ్ బోర్డులో చిల్లిగవ్వ మిగల్చాని జగన్ సర్కార్
• మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణానికి టెండర్లు వేసేందుకు కూడ ఏ సంస్ద ముందుకు రాని పరిస్దితి
• మారిటైమ్ బోర్డు సోమ్ము దోచుకున్నారు కాబట్టి చెల్లింపులు జరగవనే ఎవరూ కనీసం టెండర్లకు ముందుకు రావడం లేదు
• నేడు మారిటైమ్ బోర్డు దివాళ తీశాక ఇక నూతన పోర్టులైనా రామాయపట్నం, మచిలీపట్నం, బాననపాడు పోర్టులు ప్రజలు మరచిపోవాల్సిందేనా?
• మారిటైమ్ యాక్టు 2019 సెక్షన్ 92 (2) ప్రకారం ప్రతి సంవత్సరం మారిటైమ్ బోర్డు అడిట్ రిపోర్టు శాసన సభ ముందు ఉంచాలి.రెండెళ్ళుగా సభ ముందుకు రాని రిపోర్టు
• మారిటైమ్ యాక్ట్ – 2019 ప్రకారం సెక్షన్ 26 ప్రకారం మారిటైమ్ ఆదాయం పోర్టుల అభివృద్ది కోసం వినియోగించాలనే నిబంధన బుట్ట దాఖలు చేశారు
• పోర్టుల నుండి వివిధ రుపాలలో ఏటా మారిటైమ్ బోర్డుకు సుమారు రూ. 250 కోట్లు ఆదాయం వస్తున్నా మాట వాస్తవం కదా?
• నేడు రాష్ట్రంలో ఈ.పి.సి విధానంలో మచిలిపట్నం, భావనపాడు, రామయపట్నం పొర్టులు నిర్మించలంటే కనీసంగా రూ. 10 వేల కోట్లు మారిటైమ్ బోర్డుకు అవసరం.
• ఈ రోజు ఈ.పి.సి విధానంలో పోర్టు పనులు మెదలు పెట్టాలి అంటే కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ గా మారిటైమ్ బోర్డు ప్రాజెక్టుల వ్యయంలో సుమారు పది శాతం( రూ. 1000 కోట్లు) చెల్లించాలి
• ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ సర్వీస్ కార్పోరేషన్ (ఏ.పి.ఎస్.ఎఫ్.స్) కార్పోరేషన్లో వివిధ కార్పోరేషన్ మిగులు నిధులు మాత్రమే తీసుకుంటాం అని జీవో నెం. 17 స్పష్టంగా పేర్కోన్నారు
• మారిటైమ్ బోర్డు పోర్టు నిర్మాణాల కోసం వెచ్చించవలసిన సోమ్మును మిగులు నిధుగా (సర్ ప్లస్ ఫండ్ గా) ఎలా పరిగణిస్తారు?
• మంత్రి పేర్ని నాని సినిమా బ్లాక్ టికెట్లు వ్యవహరం పక్కనబెట్టి మచిలిపట్నం పోర్టు మీద దృష్టి పెట్టు..సినిమా టికెట్ల మీద కాదు…మచిలిపట్నం పోర్టు పై ప్రెస్ మీట్ పెట్టు పేర్నినాని
– జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రెస్ మీట్

పోర్టుల కేంద్రంగా జగన్ రెడ్డి చేస్తున్నా అక్రమాలు, అవినీతికి సంబందించి ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచాం. గంగవరం పోర్టు కేంద్రంగా జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన భారీ స్కామ్ ని బయటపెట్టాం. మంచి లాభాల్లో ఉన్న గంగవరం పోర్టు లో 10.4 శాతం ఉన్న ప్రభుత్వ వాటాను అవసరం లేకున్నా కమీషన్లకు కక్కుర్తి పడి కేవలం రూ. 645 కోట్లకు తెగనమ్మారు. సీనియర్ ఐఏయస్ అధికారులు సభ్యులుగా ఉన్న ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ కమీటీ సిపార్సులు కూడా పక్కన పెట్టి తెగనమ్మారు.

ఓపెన్ బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా ప్రభుత్వ వాటాను అమ్మితే రాష్ట్రానికి లాభదాయంగా ఉంటుందని ఈ కమిటీ చెప్పినా దాన్ని పక్కన పెట్టి వాళ్లకు కావాల్సి వారితో లీగల్ ఓపియన్ పేరుతో రెకమెండేషన్స్ రాయించుకుని పోర్టుని తెగనమ్మారు. దీని సంబంధించి వైసీపీ ప్రభుత్వ అవినీతిని జీవోలు, ఆధారాలతో సహా బయపెట్ట్టి దీనికి సమాధానం చెప్పాలని మేం సవాల్ చేసి 72 గంటలు అవుతున్నా.. తేలుకుట్టిన దొంగల్లా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి సమాధానం చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు?

మేం అడిగిన దానికి సమాధానం చెప్పలేక దొంగల ముఠా ముఖం దాచుకుని తిరుగుతున్నారంటే వాళ్ల దొంగ పనులు ప్రజలకు అర్దమైంది. పోర్టులను అడ్డుపెట్టుకుని వైసీపీ చేస్తున్న అవినీతిలో ముఖ్యమంత్రి నుంచి అందుకు సంబందించిన ప్రతి ఒక్కర్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాం. వాళ్లు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నారంటే నేరాన్ని అంగీకరించినట్టే.

వైసీపీ ప్రభుత్వం స్టేట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కార్పోరేషన్ పేరుతో నిధులు దిగమింగడానికి బోగస్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఇప్పటికే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటి నుంచి రూ. 450 కోట్లు లాక్కుని యూనివర్సీటిని నిర్వీర్యం చేసింది. నేడు అదే విధంగా ఏపీ మారిటైమ్ బోర్టు వద్ద ఉన్న రూ. 1200 కోట్లను

కూడా కొల్లగొట్టి బోర్డును దివాళ తీయించింది నిజాం కదా జగన్ రెడ్డి? పోర్టుల అబివృద్దికే వినియోగించవలసిన మారిటైమ్ బోర్డు నిధులు రూ. 1200 కోట్లు దిగమింగారు, లేదని జగన్ రెడ్డి సమాధానం చెప్పగలరా? నాడు చంద్రబాబు నాయుడు ముందు చూపుతో పోర్టుల అభివృద్ది కోసం మారిటైమ్ బోర్టుని ఏర్పాటు చేశారు.

కానీ నేడు జగన్ రెడ్డి దానిలో ఉన్న డబ్బులు దిగమింగుతున్నారు. మారిటైమ్ బోర్డుకు వచ్చిన ఆదాయం పోర్టుల అభివృద్ది కార్యక్రమాలకే వినియోగించాలని ఏపీమారిటైమ్ బోర్డు యాక్ట్ సెక్షన్ 26 లో స్పష్టంగా ఉంది. కానీ జగన్ రెడ్డి ఆ డబ్బుల్ని తన అవినీతికి హారతి కర్పూరం లా వెలిగించుకుంటున్నారు. మారిటైం బోర్డుకు ప్రతి ఏడాదికి కాకినాడ డీప్ వాటర్ పోర్టు స్దూల ఆదాయంలో తన 22 శాతం వాటకు గాను రూ. 100 నుంచి 120 కోట్లు ఆదాయం, కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి ఏటా రూ. 30 నుంచి 40 కోట్లు, గంగవరం పోర్టులో రెవిన్యూ షేర్ 2.1 శాతం క్రింద రూ. 40 కోట్లు, కృష్టపట్నం పోర్టు 2.6 శాతం రెవిన్యూ షేర్ క్రింద రూ. 50 నుంచి 60 కోట్లు వస్తుంది.

వీటన్నిటి ద్వారా ఏడాదికి సుమారు రూ. 250 కోట్ల ఆదాయం మారిటైమ్ బోర్డుకు రావాటం వాస్తవం కాదా జగన్ రెడ్డి? ఆ విధంగా గత రెండున్నర సంవత్సరాల కాలంలో సూమారు రూ. 600 కోట్ల రూపాయలు మారిటైమ్ బోర్డు ఖాతకు చేరినవి. దీనికి అదనంగా ఈ మధ్య కాలంలో గంగవరం పోర్టులోని తన వాటాను తెగనమ్మగా వచ్చిన రూ. 645 కోట్లు కూడా మారిటైమ్ బొర్డు ఖాతాకు చేరినవి కదా? ఇప్పడు మొత్తంగా నేటి వరకు మారిటైమ్ బోర్డు ఖాతలో ఉన్న రూ. 1200 కోట్లు కాజేసి మారిటైమ్ బోర్డు దివాళ తీసే పరిస్తితి తెచ్చి పోర్టుల అభివృద్దిని అటకెక్కించారు.

ఏపీ స్టేట్ పైనాసెస్ సర్వీసెస్ కార్పోరేషన్ ద్వారా వివిధ శాఖలు, కార్పోరేషన్లు, బోర్టుల ద్వారా మిగులు నిధులు మాత్రమే తీసుకుంటామని జీవో నెం 17లో స్పష్టంగా చెప్పారు.కానీ మారిటైమ్ బోర్డు వద్ద ఉన్న నిధులు మిగులు ఎలా అవుతాయి? అవి రాష్ట్రంలోనని వివిధ పోర్టుల నిర్మాణాల కోసం వినియోగించవల్సిన నిధులు కదా? దీనికి ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ వెంకటరెడ్డి, సంబందిత అధికారులు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి.

గతంలో టీడీపీ ప్రభుత్వం కృష్టపట్నం, గంగవరం పోర్టులో పీపీపీ (పబ్లిక్ ప్రవేట్ పార్టనర్ షిఫ్) విధానంలో అభివృద్ది చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆ విధానంలో పెట్టుబడి మొత్తం ప్రైవేట్ భాగ్యస్వామ్యం నుండి వస్తుంది. కానీ నేడు దాన్ని పక్కన పెట్టి ఈపీసీ మోడల్ తెచ్చారు. దీనిలో మొత్తం ప్రభుత్వమే ‎ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. గతంలో భావనపాడు, బందరు పోర్టుకు టీడీపీ ప్రభుత్వం పీపీపీ విధానంలో ఖరారు చేసిన టెండర్లు రద్దు చేసి ఈపీసీ విధానం తెచ్చారు. ఈపీసీ విధానంలో మూడు పోర్టులు నిర్మాణం చేయాలంటే సూమారు ‎రూ. 10 వేల కోట్లు కావాలి.

కానీ నేడు మారిటైమ్ బోర్డు నిధులన్ని స్వాహ చేశాక అన్ని నిధులు ఎక్కడ నుంచి తీసుకువస్తారు? ఈసీపీ విధానంలో టెండరు దక్కించుకొన్న సంస్ద పనులు ప్రారంభించాలంటే మోబలైజేషన్ అడ్వాన్సుగా కనీసంగా 10 శాతం నిధులు చెల్లించాలి అందుకు గాను సూమారు రూ. 1000 కోట్లు తక్షణమే మారిటైమ్ బోర్డు వెచ్చించాలి. నేడు మారిటైమ్ బోర్డు అకౌంట్ సున్నా చేయడంతో ఆ చెల్లింపులు ఏ విధంగా చేస్తారు. ఈ పరిస్దితులలో రామాయపట్నం, మచిలీపట్నం, బాననపాడు పోర్టులను ప్రజలు మరచిపోవాల్సిందనా? వైసీపీ ప్రభుత్వ వైఖరితోనే బందరు పోర్టు, భావనపాడుపోర్టులకు టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు? దీనికి కారణం మారిటైమ్ బోర్డును దివాళ తీయించారు కాబట్టే.

టెండర్లు గడువును ఎన్ని సార్లు పొడిగించినా ఒక్కరు కూడా టెండర్ వేసేందుకు ముందుకు రావటం లేదు. మారిటైమ్ యాక్టు 2019 సెక్షన్ 92(2) ప్రకారం ప్రతి సంవత్సరం మారిటైమ్ బోర్డు అడిట్ రిపోర్టు శాసన సభ ముందు ఉంచాలి. కానీ రెండు సంవత్సరాలుగా శాసన సభ ముందుకు మారిటైమ్ ఆడిట్ రిపోర్టు ఉంచలేదు? మీరు బోర్డు డబ్బులు దోచుకుంటున్నారు కాబట్టే సభ ముందుకు అడిట్ రిపోర్టు పెట్టలేని దిక్కుమాలిని స్దితిలో ప్రభుత్వం ఉంది. తక్షణమే ఏపి మారిటైమ్ బోర్డు అడిట్ రిపోర్టు ప్రజల ముందు ఉంచాలి. అన్ని పోర్టుల ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో ప్రజలకు చెప్పాలి. పోర్టుల సొమ్ము దిగమింగి పోర్టులను అభవృద్ది చేస్తామని చెప్పటం సిగ్గుచేటు. పిషింగ్ ‍హార్బర్లలో వివిధ పనులు చేసిన గుత్తేదారులకు రూ. 70 కోట్లు బిల్లులు పెండింగులో పెట్టిన మాట వాస్తవం కదా?

కనీసం ఫిషింగ్ హర్బర్లు కూడా సక్రమంగా నిర్మించలేని మీరు ఇంకా పోర్టులు ఏం కడతారు? మారిటైమ్ బోర్డు దివాళా అంశంపై రాష్ట్ర ప్రజలకు తక్షణమే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మంత్రి పేర్ని నానికి ఎంతసేపు సినిమా టికెట్లు బ్లాక్ లో ఎలా అమ్మాలి? ఎవర్నీ బ్లాక్ మెయిల్ చేయాలి అన్న దాని మీద ఉన్న శ్రద్ద బందరు పోర్టుపై లేకపోవటం స్ధానిక శాసనసభ్యుడిగా సిగ్గుపడాలి. నాడు చంద్రబాబు నాయుడు, కొల్లు రవీంద్రలు కృషితో బందరు పోర్టుకు శంకుస్దాపన చేసి పనులకు శ్రీకారం చుడితే వైసీపీ ప్రభుత్వం తన అవినీతికి పోర్టును గాలికొదిలింది.

పేర్ని నాని బ్లాక్ టికెట్ వ్యావహారం పక్కన పెట్టి బందరు పోర్టుపై ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వానికి దమ్ముంటే ‎మారిటైమ్ బోర్డు నిధులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. వైసీపీ అవినీతిని ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా ప్రజల్లో ఎండగడుతూనే ఉంటామని పట్టాభిరాం అన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే ‎మారిటైమ్ బోర్డు నిధులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. వైసీపీ అవినీతిని ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా ప్రజల్లో ఎండగడుతూనే ఉంటామని పట్టాభిరాం అన్నారు.

Leave a Reply