Suryaa.co.in

Telangana

కాంతం..నాలుక చీరేస్తాం

– మేము తలచుకుంటే కాంతం ఎక్కడా తిరగలేడు
– బీఆర్ఎస్ నేతలు తుంగబాలు ,బొమ్మెర రామమూర్తి ,రవినాయక్

హైదరాబాద్: రేవంత్ రెడ్డి మెప్పు కోసం ,పదవుల కోసం కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం కేసీఆర్ ,కే టీ ఆర్ ల మీద ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎపుడూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడే గజ్జెల కాంతం తాగి వాగుతున్నాడు. ప్రజాసంఘాల జే ఏ సీ చైర్మన్ గా ఉన్నపుడు దందాలు ,వసూళ్లే లక్ష్యంగా పని చేశారు.

రాజకీయంగా ఏదైనా ఉంటే చర్చ చేయాలి ,వ్యక్తిగత విమర్శలు మానాలి. గతం లో బీ ఆర్ ఎస్ లో పని చేసిన అనే విషయం కాంతం మరచిపోవద్దు. మేము తలచుకుంటే కాంతం ఎక్కడా తిరగలేడు. నోరు జాగ్రత్తగా వాడకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి .కాంతం తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి ,క్షమాపణ చెప్పాలి.

కేసీఆర్ కాలి గోటికి సరిపోని వెధవలు కేసీఆర్ ,కే టీ ఆర్ ల మీద మాట్లాడుతున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నేతపై అవాకులు చవాకులా ? నాలుక సరిగా చేసుకో గజ్జెల కాంతం. ఆధారాలతో మాట్లాడు కాంతం ,నువ్వు మాట్లాడింది అసలే అర్థం కాదు. గొప్ప నాయకుల మీద మాట్లాడితే గొప్పోడివి కావు
అసభ్యంగా మాట్లాడితే కాంతం నాలుక చీరేస్తాం. అనుచిత వ్యాఖ్యలు వెనక్కు తీసుకోక పోతే మా వైఖరి తీవ్రంగా ఉంటుంది. కాంగ్రెస్ లో కాంతం కు ఎవడు పదవి ఇచ్చాడో అర్థం కాలేదు. దళిత నేత ముసుగు లో ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకోవద్దు. మేము కూడా దళితులమే. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఎవ్వరూ కేసీఆర్ పై అనుచితంగా మాట్లాడినా ఊరుకునేది లేదు.

LEAVE A RESPONSE