-చింతా శశిధర్ ది మీరు రోజూ నిందించే ఆ సామాజిక వర్గం కాదా?
-మీ వ్యాపార సామ్రాజ్యం లో పార్టనర్స్ ఆ సామాజిక వర్గం కాదా
-టీడీపీ ఒక సామాజిక వర్గ పార్టీ కాదు
(మంజరి )
పొట్టోడిని, పొడుగోడు కొడితే, పొడుగోడు ని పోశమ్మ కొడతది అని తెలంగాణ లో ఒక సామెత
ఉంది. నీ దగ్గర సీఐడీ ఉందని, రామోజీరావు గారి మీదకు వదిలావు. ఈరోజు సీబీఐ నీ కుటుంబ సభ్యుల దాకా వచ్చింది. ఖర్మ ఎవరినీ వదిలి పెట్టదంటే అదే. ఆ విషయం మీరు గుర్తించాలి. తెల్లారి లేస్తే ఒక కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడటం, ఆ నలుగురూ పెత్తందారీ వర్గం అనటం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. దుష్ట చతుష్టయం అని ప్రతీ మీటింగ్ లో కార్నర్ చేయటం అంత శోభ ని ఇవ్వదు. మీరు నిజంగా ఆ కులాన్ని ద్వేషిస్తే, ఆ కులం వారితో వ్యాపార సంబంధాలు నడిపే మాట ఏంటని ఎవరైనా ప్రశ్నిస్తే మీ దగ్గర సమాధానం ఉందా? మీ వ్యాపార సామ్రాజ్యం లో పార్టనర్స్ ఆ సామాజిక వర్గం కాదా యువర్ ఆనర్?
అంతెందుకు ఈరోజు మీరు ఆపద లో ఉండి, మైసూర్ నుండి స్పెషల్ ఫ్లైట్ లో పిలిపించు కొన్న విజయ కుమార్ ని దగ్గరుండి మీ ప్యాలెస్ కు తీసుకు వచ్చిన చింతా శశిధర్ ది మీరు రోజూ నిందించే ఆ సామాజిక వర్గం కాదా? మరెందుకండీ, వారిని ఒక బూచి లాగా చూపి, హేట్ రెడ్ క్రియేట్ చేయటం. దానివల్ల టీడీపీ ని నష్ట పరుస్తున్నామనే ఫీలింగా? అలా భావిస్తే మీరు పప్పు లో కాలేసినట్లే. నలభై సంవత్సరాలుగా టీడీపీ మీద కంటిన్యూ గా బురద చల్లుతూనే ఉన్నారు. ఐనా ఆ పార్టీ అప్రతిహతం గా కొనసాగుతున్న విధానం చూస్తే ఎవరైనా అబ్బుర పడాల్సిందే.
ఎందువల్ల అంటే, అది ఒక సామాజిక వర్గ పార్టీ కాదు కనుక. నిజానికి ఆ సామాజిక వర్గ ప్రజలు మీతోనే ఎక్కువ మంది ట్రావెల్ అవుతున్నారు. ఆ సూక్ష్మాన్ని మీరు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది మీకు. ఐననూ క్యాబినెట్ లో ఒక్క బెర్త్ కూడా ఇవ్వలేదు మీరు. ఇవ్వక పోయినా చింతించుట లేదు ఎవరూ కూడా. అది ఆ సామాజిక వర్గ ఔన్నత్యం. ఇకమీదట ఐనా బూచి లా చూపే ప్రయత్నాలు ఆపి, అందరినీ ఒకేలా చూడటం మీ కనీస బాధ్యత కనుక, తగు చర్యలు చేపట్టాల్సినదిగా పౌర సమాజం కోరిక.