బిఆర్ఎస్ లోకి వచ్చారు..రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్ లకు వస్తాయి..
బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్..
తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ జాయినింగ్ సందర్భంగా…
(హైదరాబాద్, నవంబర్ 3),: ఈటెల రాజేందర్ కన్నా పెద్ద మనిషి కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీలోకి వచ్చారు,రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్ లకు వస్తాయని.. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం గజ్వేల్ నియోజక వర్గంలో ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ హోస్ లో మాజీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్.. సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల తరువాత ముదిరాజ్ లతో సమావేశం అవుతనని, 119 సీట్లల్లో 112 మాత్రమే మన లెక్కలోకి వస్తాయి అన్నారు. తమాషాకి అభ్యర్థులను పెట్టద్దు నిలబడితే గెలవాలి,వృత్తి పరంగా ముదిరాజ్ లకు న్యాయం జరిగిందన్నారు. గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారు .ముదిరాజ్ ల నుండి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు అవ్వాలని, ఈసారి రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఇతర నామినేటెడ్, మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, జడ్పి, మున్సిపల్ చైర్మన్, స్థానిక సంస్థల పదవుల్లో ముదిరాజ్ లకు పెద్ద పీట వేస్తాం అని స్పష్టం చేశారు.
ఈటెల ఎవరిని ఎదగనివ్వలేదు, బండ ప్రకాష్ ని తీసుకొచ్చి ఎంపీ, ఎమ్మెల్సీ, కౌన్సిల్ వైస్ చైర్మన్ పదవులు ఇచ్చాము. ఎన్నికల తరువాత ఎంతో అనుభవం ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ఆ ధ్వర్యంలో..ముదిరాజ్ కుల పెద్దలను కూర్చోబెట్టు కొని వారి ప్రధాన సమస్యల పరిష్కారంపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు.
కాసాని జ్ఞానేశ్వర్ ఏడాది కిందటే బీఆర్ఎస్ లోకి రావాల్సి ఉండే..ఆలస్యమైనా రాజకీయంగా ఎంతో అనుభవజ్ఞులైన ఆయన రావడం మాకు శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ శంభిపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేతలు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
కాసాని జ్ఞానేశ్వర్ తో పాటు బిఆర్ఎస్ లో చేరిన టిడిపి నాయకులు..
టిడిపి తెలంగాణ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తో పాటు టిడిపి జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్,టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారి వెంకటేష్ ముదిరాజ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ముప్పిడి గోపాల్, టీటీడీపీ రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర కార్యనిర్వహాక కార్యదర్శులు ప్రకాష్ ముదిరాజ్ , భిక్షపతి ముదిరాజ్, పుట్టి రాజు ముదిరాజ్, జగదీష్ యాదవ్, కార్యదర్శి మన్నే రాజు, సపన్ దేవ్ ముదిరాజ్, టిడిపి మహేశ్వరం ఇంచార్జ్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్, కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ కనకయ్య ముదిరాజ్, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ కరాటే రాజు ముదిరాజ్, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రతాప్, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు చంద్రహాస్, నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రధాన కార్యదర్శి దూసరి వెంకటేష్, తదితరులు బీఆర్ఎస్ లో చేరారు.