Suryaa.co.in

Andhra Pradesh

పశువుల కన్నా,మృగాల కన్నా హీనంగా ప్రవర్తించారు గుంటూరు వైసిపి రౌడీ మూకలు

మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య

కంచికచర్ల : శుక్రవారం కంచికచర్ల టౌన్ అంబేద్కర్ కాలనీకి చెందిన కాండ్రు శ్యాం కుమార్ పై గుంటూరుకు చెందిన హరీష్ రెడ్డి మరియు వారి అనుచరులు చేసిన దానిని ఖండిస్తూ శ్యాం కుమార్ ను నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు మరియు తెదేపా శ్రేణులతో కలిసి పరామర్శించిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య .. పరామర్శిస్తున్న సమయంలో శ్యాం కుమార్ స్పృహ కోల్పోవడంతో హుటాహుటిన కంచికచర్ల టౌన్ కృష్ణమోహన్ హాస్పిటల్ కు తరలించి వైద్య సేవల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించిన తంగిరాల సౌమ్య . అనంతరం శ్యామ్ కుమార్ కు న్యాయం చేయాలంటూ చెవిటికల్లు సెంటర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద బిఎస్పీ మరియు అమరావతి పరిరక్షణ దళిత జేఏసీ నేతలతో కలిసి ధర్నాలో పాల్గొన్న తంగిరాల సౌమ్య.

వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో దళితులపై దాడులు పేట్రేగిపోతున్నాయి. దాదాపుగా ఈ నాలుగున్నర ఏళ్లలో రాష్ట్రంలో 86 మంది దళితులు ఊచకోత కోయబడ్డారు.దళితులపై జరుగుతున్న దాడులకు ఈ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న దళిత మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు. కంచికచర్ల ఒక దళితుడు శ్యామ్ పై దాడి జరిగితే కనీస స్పందన లేదు.

శ్యామ్ కు సంబంధం లేని వివాదంలోకి గుంటూరు కు చెందిన ఓకే సామాజిక (రెడ్డి) వర్గ ఆరుగురు యువకులు. ప్రధాన నిందితుడు హరీష్ రెడ్డి కారులో అతి దారుణంగా ఎక్కించుకొని గుంటూరు వరకు తీసుకొని వెళుతూ దారి మధ్యలో చిత్రహింసలకు గురి చేశారు..వారి దెబ్బలకు తాళం లేక శ్యామ్ మంచినీరు అడిగితే ఆరుగురు రౌడీ మూకలు అతనిపై మూత్రం పోశారు. దళితులంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతటి చిన్న చూపా?

అంబేద్కర్ రాజ్యాంగమా లేదా ఇది రాజారెడ్డి రాజ్యాంగమా దళితులపై ఇంతటి దారుణాలా?హరీష్ రెడ్డి మృగం కంటే దారుణంగా ప్రవర్తించవు నువ్వు. మంత్రి ఆదిమూలపు సురేష్, స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మొండితోక సోదరుల అండ చూసుకొని హరీష్ రెడ్డి దళిత యువకుడు శ్యామ్ పై ఇంతటి దారుణానికి తెగబడ్డాడు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్యామును విచారణ నిమిత్తం పోలీసులు బయటకు తీసుకొని వెళ్లి అతనిని వెళ్లి పోవాల్సిందిగా తెలియజేసి… శ్యామ్ తప్పించుకొని పోయారు అని పోలీసులు ఎలా అంటున్నారు?నిందితులను తప్పించడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి వారిపై కిడ్నాప్, హత్యాయత్నం,ఎస్సీ ఎస్టీ కేసులను నమోదు చేయాలి.శ్యాం కుమార్ కు వెంటనే మెరుగైన వైద్యం అందించేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE