Home » రేవ్ పార్టీలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కారు?

రేవ్ పార్టీలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కారు?

కాకాని పేరుతో స్టిక్కర్
నాకేం సంబంధం లేదన్న మంత్రి కాకాణి
మరి ఆ స్టిక్కర్ ఎలా వచ్చింది?

ఆంధ్ర-కర్నాటకలో సంచలనం సృష్టిస్తున్న రేవ్‌పార్టీ కేసు కొత్త మలుపు తిరిగింది. రేవ్‌పార్టీ తర్వాత బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్న కార్లలో, ఏపీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డికి చెందిన కారు వెలుగుచూడటం సంచలనం సృష్టిస్తోంది. కారుపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి పేరుతో, స్టిక్కర్ కూడా ఉండటం మరిన్ని అనుమానాలకు తెరలేపుతున్నాయి. అయితే మంత్రి మాత్రం ఆ కారుతో తనకెలాంటి సంబంధం లేదంటున్నారు.

‘ఆ కారుతో నాకెలాంటి సంబంధం లేదు. కారుమీద ఏ స్టిక్కర్ ఉందో నాకు తెలియదు. నాపేరు మీద స్టిక్కర్ ఉందని ఎవరో ఫోన్ చేసిచెబితే తెలిసింది. నాకు సంబంధం లేని ఘటన గురించి నేను స్పందించను’ అన్నారు. నిజంగా మంత్రి కాకాణికి ఆ కారుతో సంబంధం లేకపోతే.. ఆయన పేరుతో స్టిక్కర్ ఎలా వచ్చింది? ఆయన సిఫార్సు చేయకుండానే శాసనసభా కార్యాలయం మరొకరికి స్టిక్కర్ ఇస్తుందా? మంత్రి అనుమతి లేకుండానే కారుపై ఆయన పేరుతో స్టిక్కర్ వస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply