Suryaa.co.in

Telangana

మంత్రి ఎర్రబెల్లి నామినేషన్ ఖర్చులకు డబ్బులు ఇచ్చిన గూడూరు కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలు

పాలకుర్తి నియోజకవర్గ బి అర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నామినేషన్ ఖర్చులకు పాలకుర్తి మండలం, గూడూరు కుట్టు శిక్షణ తీసుకొని వస్త్రాలు కుట్టి సంపాదించి 11 వేల రూపాయలు శిక్షణ తీసుకున్న మహిళలు జమ చేసి ఇచ్చారు. ప్రభుత్వ పేదరిక నిర్మూలన సంస్థ, ఎర్రబెల్లి ట్రస్టు అధ్వర్యంలో గత కొద్ది రోజులుగా ఉచిత శిక్షణ కొనసాగుతున్నది.

కాగా, శిక్షణ తీసుకున్న మహిళలు తమ కృతజ్ఞతను చాటుకుంటూ, చందాల రూపంలో వేసుకొని ఆ మొత్తాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు శుక్రవారం అందచేశారు. తమ పూర్తి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి వారికి ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A RESPONSE