Suryaa.co.in

National

కశ్మీర్‌-కన్యాకుమారి.. పొడవైన జాతీయ రహదారి – ఎన్‌హెచ్‌-44

– ఉత్తర-దక్షిణ భారతాన్ని కలిపే రహదారి
– మొత్తం పొడవు 4112 కిలోమీటర్లు
తెలంగాణలో 492 కి.మీ
– ఏపీలో 260 కి.మీ
– భారత మ్యాప్‌పై నిలువు గీత గీసిన తరహాలో జాతీయ రహదారి
( తులసీరావ్‌)

ఎన్‌హెచ్‌-44 దేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారి ఇది. ఉత్తర-దక్షిణ భారతాన్ని కలిపే రహదారిగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది..కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో మొదలై.. పంజాబ్‌ , హరియాణా , దేశ రాజధాని దిల్లీ , ఉత్తరప్రదేశ్‌ , రాజస్థాన్‌ , మధ్యప్రదేశ్‌ , మహారాష్ట్ర , తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌ , కర్ణాటక ) మీదుగా ప్రయాణిస్తూ తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ముగుస్తుంది.
ఈ జాతీయ రహదారి మొత్తం పొడవు 4112 కిలోమీటర్లు. మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 492 కి.మీ, ఏపీలో 260 కి.మీ మేర ఎన్‌హెచ్‌-44 ఉంది. తొలుత ఇది ఒకే జాతీయ రహదారి కాదు. ఎన్‌హెచ్‌-1ఎ, ఎన్‌హెచ్‌-1, ఎన్‌హెచ్‌-2, ఎన్‌హెచ్‌-3, ఎన్‌హెచ్‌-75, ఎన్‌హెచ్‌-26, ఎన్‌హెచ్‌-7 విలీనం చేసి ‘ఎన్‌హెచ్‌-44’ను ఏర్పాటు చేశారు. భారత మ్యాప్‌పై ఒక నిలువు గీత గీసిన తరహాలో ఈ జాతీయ రహదారి కన్పిస్తుంది.

LEAVE A RESPONSE