Suryaa.co.in

Telangana

తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారు

-దేశంలో అత్యధిక కంపెనీ లు హైదరాబాద్ తరలివస్తున్నాయి
-గతంలో ఉద్యోగాలు, ఉపాధి కోసం బొంబాయి , దుబాయ్ కి పోయేవాళ్ళం
-ఇతర రాష్ట్రాలలో రైతుబంధు, దళిత బంధు ఉందా?
-కేసీఆర్ వెంట తెలంగాణ ప్రజలున్నారు
-మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్

భారత్ రాష్ట్ర సమితి పార్టీ తూర్పు వరంగల్ నియోజకవర్గంలోని హసన్ పర్తి మండల కేంద్రంలో KLN కన్వెన్షన్ హాల్ లో 53, 54 డివిజన్ల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం లో రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ స్థానిక శాసనసభ సభ్యులు , ప్రభుత్వ చీఫ్ విప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్ పాల్గొన్నారు. కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..

తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంతో కీలకపాత్ర పోషించిందన్నారు.సీఎం కేసీఆర్ కు వరంగల్ జిల్లా అంటే ప్రత్యేక అభిమాన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వం లో ఎన్నో అద్భుత విజయాలు సాధించాం.అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాము.అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అవార్డులు అగ్రభాగం తెలంగాణవే.

రామప్ప దేవాలయం కు యునెస్కో గుర్తింపు లభించింది.గత 20 ఎండ్ల కింద యునెస్కో గుర్తింపు పొందివుంటే ఉమ్మడి వరంగల్ కు ఎంతోమంది విదేశీ పర్యటకులు వచ్చేవారు. అభివృద్ధి జరిగేది. దేశంలో అత్యధిక కంపెనీ లు హైదరాబాద్ తరలివస్తున్నాయి. లక్షల మందికి తెలంగాణ ఉద్యోగాలు వస్తున్నాయి. గతంలో ఉద్యోగాలు, ఉపాధి కోసం బొంబాయి , దుబాయ్ కి పోయేవాళ్ళం .వరంగల్ ను IT hub గా సీఎం కేసీఆర్, KTR లు కృషి చేస్తున్నారు. యువతకు కేసిఆర్, కేటీఆర్ ను భరోసా కల్పిస్తున్నారు.

బిజెపి పార్టీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.కొత్త ఉద్యోగాల ఇవ్వకుండా… ఉన్న ఉద్యోగాలు ఉడగోర్తున్నారు. బి.ఎస్ ఎన్ ఎల్, రైల్వే, ఎల్ఐసి లాంటి పెద్ద సంస్ధలను ప్రైవేట్ పరం చేస్తున్నారు.Rule of రిజర్వేషన్లు పోతున్నాయి. ఇతర రాష్ట్రాలలో రైతుబంధు, దళిత బంధు ఉందా అని ప్రశ్నించారు.
గతంలో తెలంగాణ ప్రాంతంలో కరెంటు ఇచ్చారా.. ఉద్యోగాలు ఇచ్చారా.., ప్రశ్నించే వారిపై తీవ్రవాదులు గా ముద్ర వేశారు. కరెంటు ఇవ్వమంటే హైదరాబాద్ లో పిట్టలను కాల్చినట్టు కాల్చారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక్క జాతీయ హోదా ప్రాజెక్టు ఇవ్వలేదు.బిజెపి మత రాజకీయాలను ప్రోత్సహిస్తుంది.తెలంగాణ మాధిరి పథకాలు కావాలని ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంను ఇబ్బందులకు గురి చేయడానికి కుట్రలు పన్నుతున్నారు.

కేసీఆర్ వెంట తెలంగాణ ప్రజలు ఉన్నారు
తెలంగాణ ప్రజల మధ్య, నాయకులు మధ్య చిచ్చు పెడుతున్నారు.దేశమే అభివృద్ధి లో తెలంగాణ వైపు చూస్తుంది.కార్యకర్తలు సంయమనం పాటించాలి.అందరికీ అవకాశాలు వస్తాయి.భవిష్యత్తు ఉన్న పార్టీ BRS.ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
వచ్చే ఆరు నెలలు ఎంతో కీలకం అన్నారు. కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలి.ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ BRS. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారు.

LEAVE A RESPONSE