మీలో మీరు కొట్టుకుంటూ..కడుపు నింపే రైతున్న కంట కన్నీళ్లు పెట్టిస్తారా?

౼ ఇది రాష్టానికి కాదు, దేశానికి అరిష్టం
కాలం సహకరించడంతో అప్పొసప్పో చేసి రైతులు పంట పండించారు. పుష్కలమైన సాగునీరు ఉండటంతో మంచి దిగుబడులు వచ్చాయి. కానీ అంతా బాగుంటే రైతు బతుకెందుకు అవుతుందని అన్నట్లు… వరుణుడి ఆగ్రహానికి అన్నదాత ఆశలు అడియాశలయ్యాయి. తెలంగాణ లొనే అన్ని జిల్లాలో రైతులు నడిరోడ్డు పైన ఆరబెట్టినా ధాన్యం ,మరియు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం పూర్తిగా తడిసిముద్దయింది. నోటికాడి బుక్కను ఎత్తగొట్టినట్లు…. నాలుగు రోజులైతే తరలివెళ్లాల్సిన ధాన్యం…. కళ్లముందే వరదలో కొట్టుకుపోయింది.
బస్తాల్లో నింపిన ధాన్యం నుంచి నీళ్లు కారుతుండటం కలిచి వేసింది. ఇక ఆరబోసిన ధాన్యమైతే నీళ్లతో నిండిపోయి రైతులకు ఏడుపు తెప్పించింది. తడిసిన ధాన్యం ఎలా ఆరబెట్టాలో, ఇప్పటికే కాంటా పూర్తయి తడిసిపోయిన ధాన్యం బస్తాలను ఏం చేయాలో పాలుపోని దిక్కుతోచని స్థితిలో అన్నదాత కుమిలిపోతున్నాడు.
ఎన్నికల్లో కోట్ల కు కోట్ల డబ్బు వెదజల్లి రాజకీయాలు చేసిన TRS ,బీజేపీ పార్టీలు కనీసం రైతులు పండించిన ధాన్యం అకాల వర్షాలతో తడిసి ముద్ద అవుతుంటే కనీసం కాపాడుకునేందుకు పట్టలు, గిడ్డంగి ఏర్పాటు చేయడానికి కూడా బాధ్యత తీసుకోలేదు అంటే మీకు రైతులు పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్ధం అవుతుంది..
కేంద్రంలో ఉన్న బీజేపీ , రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఒకరిపై ఒకరు ధాన్యం మీరు కొంటారా… మీరు కొనర అంటూ ఒకరిని ఒకరు దూషిచుకొంటు రైతున్నని మోసం చేస్తున్నారు.
అకాల వర్షానికి అన్నదాతలు అల్లకల్లోలమయ్యారు .నడిరోడ్డుపై ఆరబోసిన వడ్లు వరదలో కొట్టుకుపోపోతుంటే అన్నదాతలు కష్టపడి పండించిన పంటలు కళ్ళముందు తడిసి ముద్ద అవుతుంటే కన్నీళ్లు వస్తున్నాయి ..ఇటువంటి దయనీయ పరిస్థితులు తెలంగాణా వ్యాప్తంగా ఉన్నాయి ..ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు, ఒకరి పై ఒకరు బురద జల్లుకుంటు నీచ రాజకియలు చేస్తునారు.ఇంత దారుణమైన పరిస్థితులు తెలంగాణ నెలకొన్నాయి అని చెప్పడానికి ఒక మాజీ శాసనసభ్యురాలు గా నాకే సిగ్గు వేస్తుంది.ఇప్పటికైన దొంగ ధర్నాలు,ర్యాలీలు, కంటి తుడుపు పరామర్శ లు మనుకోమి కడుపు నింపే రైతుల గోషను సహృదయంతో వినాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కి డిమాండ్ చేస్తున్నా .
తడిచిన ధాన్యం కొనము, తగ్గింపు ధరలకి కొంటాము అంటూ రైతుల్ని వేధించకుండా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతుల అందరి తరవున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తు న్నా. ప్రభుత్వం కొనని యెడల రైతుల అందరిని ఏకం చేసి ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నా లు చేయడానికి కూడా వెనుకడబోమని హెచ్చరిస్తున్నా.
అసలు కేంద్ర ప్రభుత్వం వైఖరి ఏమిటో కూడా శ్వేతపత్రం విడుదల చేయాలి.. ధాన్యంని కేంద్ర ప్రభుత్వం కొంటుందా..! కొనదా…! బండి సంజయ్ తెలంగాణ బీజేపీ శాఖ కి అధ్యక్షుడు గా ఉంటూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి పదే పదే అడుగుతున్న కొంటారా.. కొనరా అని కనీసం దానికి స్పందించిన దాఖలలు లేదు ..బీజేపీ బాధ్యత తీసుకుని ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న. అలా కాకుండా జిల్లాల పర్యటన వెళ్లి పరామర్శ చేయడం వల్ల ఇంత తీవ్రమైన సమస్య పరిష్కారం ఎలా అవుతుందో కనీసం చెప్పాలి..?
ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం ధాన్యం కొనడం లేదు అని చెప్పే బదులు, ఎందుకో కొనడం లేదో.. ఢిల్లీ వెళ్లి నిలదీయాల్సిన అవసరం ఉంది.. అంతే గాని ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపించాల్సిన మీరు ధర్నాకి కూర్చుంటున్నం అంటే రైతన్న గోడు ఎవరికి చెప్పుకోవాలి?
మీరూ కేంద్రం ప్రభుత్వం తో సమస్య పరిష్కారం చేయలేకపోతే, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలని కలుపుకొని పోయి, ఢిల్లీలో కేంద్రం మెడలు వంచుదాం.మీకు ప్రభుత్వ పెద్దగా ఎంత బాద్యత ఉందో.. రైతుల పైన, ప్రతిపక్ష పార్టీలుగా మాకు అంతే బాద్యత ఉంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి ఇప్పుడు ధాన్యం కొనలేక పోతే , యుద్ధ ప్రాతిపదికన రైతులు పండించిన పంటలకు కనీసం సరైన ధరలు వచ్చే వరకు కాపాడుకునేందుకు తగిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున. రాష్టంలో గిడ్డంగులు పెంచాలి. ప్రతి గ్రామంలో గిడ్డంగి ఏర్పాటు చేయాలి. అలాగే ధాన్యం పైన కప్పేందుకు సరైన క్వాలిటీ పట్టలను వ్యవసాయ శాఖ ద్వారా ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది అని మీ బాధ్యత గుర్తు చేస్తున్నా.
ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు తన సహచరులతో ఇందిరా పార్కు దగ్గర ధర్నా కి కూర్చుటున్నారు. ప్రతిపక్ష పార్టీలు కి కూడా పిలుపు ఇచ్చి వారి మద్దతు కూడా కోరాల్సిన అవసరం ఉంది. లేదా పిలవకపోయిన పర్వాలేదు. రైతులకు న్యాయం చేయండి అని నేను ఒక రైతుగా వేడుకొంటున్నా..
కొనుగోళ్లలో జాప్యమే నష్టానికి కారణమంటూ, పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగిన ఘటనలు చాలా ఉన్నాయి. పంట కోసి రైతులు నడిరోడ్డుపై ధాన్యం రాసులు పోసి నడిరోడ్డుపై ఎన్ని రోజులు కాపలా కాయలో అర్ధం కావడం లేదు..పోనీ సరైన ధర కోసం చూస్తూ ఉంటే ఈ లోపే అకాల వర్షాలు అన్నదాతల ఆశల పైన ఉక్కుపాదం మోపుతున్నాయి.ధాన్యం రాసులు దగ్గర కాపలా కాస్తూ ప్రాణాలు విడిచిన సంఘటన కూడా మనం చూశాము.. ఇంత జరుగుతున్నా దేశానికి వెన్నుముక అయిన రైతుని కాపాడుకోలేక పోతున్నాము అని బాధగా ఉంది.
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి, పంట దిగుబడి పెరిగిందని సంతోషపడేలోపే.. తమ ఆశలపై వరుణదేవుడు నీళ్లు చల్లాడని రైతులు కన్నీటి పర్యంతమతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం, అధికారులు త్వరగా స్పందించి కొనుగోలు త్వరితగతిన చేస్తే తప్ప రైతు కి న్యాయం జరగదు
ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొనుగోళ్లు వేగంగా జరిగేలా చూడాలని రైతులు తరపున వేడుకుంటున్నా. వర్షసూచనతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్న రైతులకి సరైన పట్టలు, గిడ్డంగలు, ఏర్పాటు చేయాలి.అలాగే ధాన్యం త్వరగా మిల్లులకు తరలేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా.

– కాట్రగడ్డ ప్రసూన
(మాజీ  ఎమ్మెల్యే, టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు )