– షర్మిల రాజకీయ అడుగులు ఎవరికి లబ్ది చేకూర్చడానికి?
– మా పార్టీలో ఉండి కేసీఆర్ తో తన్నించుకున్నది.. కేశవరావు, డీ శ్రీనివాస్
– పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
2014 కంటే ముందు నుంచే చాలా మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించా.9 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తే.. ఇప్పటికి తగిన పత్రాలు ఇవ్వలేదు.దీనిపై సీఎం కేసీఆర్ కు జగ్గారెడ్డి లేఖ.హైదరాబాద్ లో చుట్టుపక్కల గాని పేద వాళ్లు 100 గజాలు కొనలన్నా కూడా వేలల్లో ఉంది.పేదలు సొంత ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు.రాష్ట్రం వచ్చాక ఇళ్ల స్థలాల జీవోని ఎత్తేశారు.
పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు జీవో విడుదల చేసి కలెక్టర్లకు అధికారం ఇవ్వండి ఈ విషయం మీద రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తాను.
పేదలకు ఇళ్ల జాగాలు ఇచ్చి వారిని ప్రభుత్వం ఆదుకోవాలి.రాష్ట్రంలో ప్రజా సమస్యలు గాలికి వదిలి రాజకీయ పోరాటాలు జరుగుతున్నాయి.ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యలపై పోరాటం చేసే హక్కు ఎవరికైనా ఉంది.షర్మిల పాదయాత్రను అడ్డుకోవడం సరికాదు.. నిన్నటి ఘటనను, ప్రభుత్వ తీరును ఖండిస్తున్నా.
అసలు ఇదొక రాజకీయ డ్రామా.షర్మిల రాజకీయ అడుగులు ఎవరికి లబ్ది చేకూర్చడానికి అసలు.. బీజేపీ కా, టీఆర్ఎస్ కా స్పష్టత లేదు.రాష్ట్రంలో తికమక రాజకీయాలు, ఓటు బ్యాంకు, అవగాహన రాజకీయాలు చేస్తున్నారు.పాదయాత్రలు ఇప్పుడొక సరికొత్త ఫ్యాషన్ అయిపోయింది.ప్రజా సమస్యలు వదిలేసి, వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి మాత్రమే ఈ పాదయాత్రలు పనికొస్తున్నాయి.
బండి సంజయ్ యాత్ర ఏమైనా రైతుల కోసమా, ప్రజల ఇబ్బందుల కోసమా?కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఎలా చీల్చాలన్నదే ఆ పార్టీల లక్ష్యంగా కనిపిస్తోంది.టీఆర్ఎస్, బీజేపీ, షర్మిళ పార్టీ ద్వారా ప్రజా వ్యతిరేక ఓటును పొందాలని చూస్తున్నాయి.ఇలా చేయడం ద్వారా చివరికి గులాబీ పార్టీకే లబ్ది.అవగాహన రాజకీయాలకు ఇదే నిదర్శనం.ఓట్లు చీల్చడం వల్ల మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటది.అధికారంలోకి వస్తే ఒకే దఫాలో 2 లక్షల రైతు రుణమాఫీ ఇస్తామన్న హామీ నెరవేరుస్తాం.
సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు ఆర్ధిక సాయం ఎస్సిలకు 6 లక్షలు, మిగతా వర్గాలకు 5 లక్షలు.మహిళా సంఘాలకు వడ్డీ లేకుండా రుణాలు.యువతకు నిరుద్యోగ భృతి.ఇంట్లో ఎంత మంది ఉన్నా 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తాం.ఇవన్నీ 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఇలాంటి వాగ్దానాలను ఈసారి అధికారంలోకి వచ్చాక అమలు చేస్తాం.స్పష్టమైన హామీలు ఇచ్చి నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ది.
బీజేపీ అసలు మ్యానిఫెస్టోనే లేదు.. ప్రజలు రెచ్చగొట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం.వడ్లు కొనకుండా, కనీస మద్దతు ధర ఇవ్వకుండా టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు రైతులతో అడ్డుకుంటున్నాయి. పేదల ఖాతాల్లో 15 లక్షలు వేస్తామన్న మోడీ మాటలు ఏమయ్యాయి? మీడియాను పక్కతోవ పట్టించడానికి షర్మిళ అంశం బాగా ఉపయోగపడింది.
తమ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తోంది. త్వరలో వాటిని ఇంకా ఉధృతం చేస్తాం.టీఆర్ఎస్, బీజేపీ లు నిద్రలో ఉన్నాయి.కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాల మీద ఇక స్పందించను. ఒక లైన్ తీసుకున్న.నా నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజా సమస్యల మీదనే ఇక నా పోరాటం.కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంశాల్లోకి తనను లాగొద్దు.కవిత, షర్మిళ మంచి యాక్టర్లు.నిన్న మొన్న ఘటనలను ఉద్దేశించే యాక్టర్లు అంటున్నా.
తెలంగాణ ఇచ్చాక ప్రజలకు ఏం లాభం జరిగిందో తెలియదు కానీ.. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి రెండు రాష్ట్రాల్లో తీరని నష్టం జరిగింది.తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్సే, పండుకున్న కేసీఆర్ ను లేపింది మా పార్టీనే.ప్రజల ఆకాంక్షల మేరకే సోనియా, రాహుల్ గాంధీ తెలంగాణ ఇచ్చారు.రాజకీయంగా నష్టపోతామని తెలిసి కూడా ఎంతో సాహసంతో రాష్ట్రం ఇచ్చారు.రాష్ట్రం ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఎందుకు గురించలేదో అర్ధం కాలేదు.
మా పార్టీలో ఉండి కేసీఆర్ తో తన్నించుకున్నది.. కేశవరావు, డీ శ్రీనివాస్.వారిద్దరూ ఇప్పుడు గులాబీ పార్టీలోనే ఉన్నారు.ప్రజలను కేసీఆర్ మాయలో, భ్రమలో పెట్టారు.ప్రజలు, రైతులు ఆలోచన చేయాలి.రైతుల ఓటుబ్యాంకు తో నే కేసీఆర్ రుణమాఫీ చేస్తా అని అబద్ధపు మాటలతో మభ్యపెడుతున్నారు. మీడియాతో మాట్లాడటమే కాదు. కార్యాచరణ కూడా రూపొందిస్తాం.రేపో ఎల్లుండో ఠాకూర్ తో సమావేశంలో దీనిపై కార్యాచరణ ప్రకటించాలని కోరుత.రాష్ట్రంలో రాజకీయ డ్రామాలకు స్వస్తి పలికెలా పదునైన వ్యూహాలతో కార్యాచరణ.