Suryaa.co.in

Telangana

ఢిల్లీలో లిక్కర్ మాఫియా డాన్ కవిత

– డ్రగ్స్, లిక్కర్, స్యాండ్ మాఫియా…. అంతా కేసీఆర్ కుటుంబానిదే
– తెలంగాణకు కేసీఆర్ శాపంగా మారాడు
– బీజేపీ నేత దాసోజు శ్రవణ్

కేసీఆర్ దుర్మార్గపు, అరాచక పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు.ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ని ఎలా అరెస్ట్ చేస్తారు? గత 8 ఏళ్లుగా… తెలంగాణకు కేసీఆర్ శాపంగా మారాడు. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ గొంతును అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు.21 రోజులుగా కాళ్లకు బలపం కట్టుకుని, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. బండి సంజయ్ ని కరీంనగర్ లో హౌజ్ అరెస్ట్ చేశారు.ప్రజల కోసం పోరాటం చేస్తున్న బండి సంజయ్ ని ఎలా నిర్బంధిస్తారు? కేసీఆర్ కూతురు ఢిల్లీలో లిక్కర్ మాఫియా డాన్ గా వ్యవహరిస్తోంది. లిక్కర్ మాఫియా నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే…. బండి సంజయ్ పై అణచివేత ధోరణికి, అక్రమ అరెస్టులు పాల్పడుతున్నారు.

డ్రగ్స్, లిక్కర్, స్యాండ్ మాఫియా…. అంతా కేసీఆర్ కుటుంబానిదే.దేశ రాజధాని ఢిల్లీలో కూడా లిక్కర్ మాఫియా కి పాల్పడి… అక్కడ కూడా తాగుబోతులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ప్రగతి భవన్ గద్దె దిగక మానడు. బీజేపీ కచ్చితంగా కేసీఆర్ ను గద్దె దించుతుంది. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతోంది. లిక్కర్ మాఫియా తో లింకులున్న కవితను, పదవి నుంచి తొలగించకుండా… తలసాని, దానం నాగేందర్ తో పాటు మరికొందరు ఆమెకు వంత పాడుతున్నారు.

నిజంగా ఇది సిగ్గుచేటు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న బండి సంజయ్ ని అక్రమ అరెస్టు చేశారు. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు కూడా బెదరవని కల్వకుంట్ల కుటుంబం గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదు. లిక్కర్ మాఫియాకు, అణచివేత ధోరణి కి వ్యతిరేకంగా… పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తాం. కేసీఆర్ పాలనలో…. కిరాయి ఇళ్లలో ఉన్న వాళ్లకి ఇప్పుడు వందల ఎకరాల భూములు వచ్చాయి. తెల్ల రేషన్ కార్డు బియ్యం తిన్న వాళ్ళు… ఇవాళ వందల ఎకరాల ఫామ్ హౌస్ లను ను సంపాదించారు. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకు తింటున్నారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలి.

బీజేపీ నేత కపిలవాయి దిలీప్:
కేసీఆర్ పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు.మా ఫ్లెక్సీలను స్వయంగా మేయరే వచ్చి చింపుతున్నాడు.పర్మిషన్ తీసుకుని చేస్తున్న పాదయాత్రను ఎలా అడ్డుకుంటారు? వర్ధన్నపేట లో ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకు కలిసి, బీజేపీ కార్యకర్తలను కట్టెలు పట్టుకుని కొడుతూ… మా బ్యానర్లను చింపుతున్న పరిస్థితిని చూశాం. కేసీఆర్ కు ఈ సమయానికి గంట కొడుతూ ఉంటుంది.. (మందు తాగుతాడాని)తెలంగాణ వ్యతిరేకులను, ద్రోహులను కేబినెట్ లో పెట్టుకున్నారు.ఎక్కడ చూసినా… కేటీఆర్, కవిత ల వెంచర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి.ప్రజా సమస్యలను తెలుసుకునే హక్కు కూడా మాకు లేదా?పాదయాత్ర చేస్తున్న మా రాష్ట్ర అధ్యక్షుడిని ఎలా హౌస్ అరెస్ట్ చేసారు? కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి. లక్షలు మూటగట్టుకుని… ఈడి రావద్దు.. ఏమీ రావద్దు అంటే… ఆగుతారా?బండి సంజయ్ హౌస్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం.తెలంగాణలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది.కచ్చితంగా పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది.

మాజీ మంత్రి విజయ రామారావు :
తెలంగాణ వస్తే… తెలంగాణలో నిర్బంధం ఉండదని, రాష్ట్ర ఏర్పాటుకు ముందు కెసిఆర్ అన్నాడు.మరి ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నదేమిటి? కెసిఆర్ కు చివరి ఘడియలు దగ్గరపడ్డాయి. కేసీఆర్ కు కాళేశ్వరం, కేటీఆర్ కు స్యాండ్ మాఫియా… కవితకేమో… లిక్కర్ మాఫియా…ఇలా మొత్తం సొమ్మును దోచుకు తింటున్నారు.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ :
మొదటి, 2వ విడత పాదయాత్రలో మీడియా వాళ్ళు కూడా మాతో మొత్తం పాదయాత్ర చేశారు. Trs వాళ్ళు మా లైవ్ టెలికాస్ట్ ను కూడా ట్యాప్ చేసి స్పామ్ లోకి పాడేస్తున్నారు.తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం ఉందో? కల్వకుంట్ల రాజ్యాంగం ఉందో? .. మీకే అర్థం అవుతోంది.ప్రజలు ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, trs లకు అధికారం ఇచ్చారు.ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తుందనే సంకేతాలు రావడంతో… trs వాళ్ళు మా పై దాడులు చేస్తున్నారు.బండి సంజయ్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జే. సంగప్ప:
లిక్కర్ మాఫియా లో కవితకు ప్రమేయం ఉందనగానే… కేసీఆర్ చిన్నమెడదు చిట్లిపోయి, పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు.పాదయాత్ర ను అడ్డుకుంటున్న trs కార్యకర్తలను అరెస్ట్ చేయకుండా… మా బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం ఏంటి?బిజెపి ఎదుగుదలను, ప్రకాశాన్ని, బండి సంజయ్ పాదయాత్రను… కెసిఆర్ ఆపలేరు.

కెసిఆర్ పతనం ఖాయం: దరువు ఎల్లన్న
ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న బండి సంజయ్ ని ఎలా అరెస్ట్ చేస్తారు? ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు… మీకు బండి సంజయ్ లా తిరుగుడు చేత కాదు. బండి సంజయ్ పాదయాత్రకు భయపడే అరెస్టులు చేస్తున్నారు. డీజీపీ అనుమతి తీసుకునే పాదయాత్ర చేస్తున్నాం. అప్రజాస్వామికంగా అరెస్టులు చేస్తున్నారు. బండి సంజయ్ ని చూస్తే…. కేసీఆర్ కుటుంబం, trs నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎన్ని దాడులు చేసినా… మరెన్ని అరెస్టులు చేసినా… బండి సంజయ్ నేతృత్వంలో మరిన్ని పాదయాత్రలు కొనసాగుతాయి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను బొందపెట్టి, బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.

LEAVE A RESPONSE