– బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొననని చెప్పింది అని కేసీఆర్ బూటకపు ప్రచారం చేస్తూ రైతులను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు .
వ్యవసాయం రాష్ట్ర జాబితా లో ఉన్న విషయం కేసీఆర్ కు తెల్వద అని నియోజకవర్గ వర్గ కేంద్రల్లో వడ్లు కొనాలని మేమే ధర్నాలు చేస్తామని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు,బీజేపీ కిసాన్ మోర్చా నాయకుల తో కలసి నాంపల్లి ఏక్సిబిషన్ గ్రౌండ్ వద్ద వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ చేసిన ఆందోళన కార్యక్రమం లో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి స్థానం లో ఉన్న వ్యక్తి వరి కొనుగోలు విషయం లో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయం అని అన్నారు.
ముఖ్యమంత్రి పత్రికా విలేకరుల కు చూపించిన సర్క్యూలర్ ల లొ వడ్లు కొనమని ఎక్కడ ఉన్నదో చెప్పాలని ఆయన అన్నారు,కేవలం బాయిల్డ్ రైస్ సేకరణ కుదరదని, రా, రైస్ ,ఫోర్టీ ఫైడ్ రైస్ కు అనుగుణంగా మిల్లర్ల కు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ఆప్ డేట్ కావాలని సూచించింది అని, కేంద్రం నుండి సహకారాన్ని అందిస్తామని చెబితే,కేసీఆర్ ఈ విషయాన్ని వక్రీకరించి వరి సాగు చేయొద్దని ఆంక్షలు విధిస్తున్నారని శ్రీధర్ రెడ్డి అన్నారు.
ఖరీఫ్ లో వస్తున్న వరి ధాన్యం విషయంలో 48 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకుంటామని ,ఇంకా అదనంగా వచ్చినా తయారు గా ఉన్నామని fci హామీ ఇచ్చినా ఎందుకు ఇంకా ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయి లో ప్రారంభం చేయలేదో కేసీఆర్ చెప్పాలని,ఆయన అన్నారు,పౌర సరఫరాల శాఖ మిల్లర్ల తో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నదని ఆయన ఆరోపించారు, వరి సాగు పై ఆంక్షలు విధిస్తూ ,వరి ధాన్యం కొనుగోలు రైతుల్ని ఇబ్బందుల కు గురి చేస్తున్న ఈ ప్రభుత్వానికి హుజురాబాద్ ఎన్నికల్లో బుద్ధి చెప్పారని,అందుకే కేసీఆర్ నిరాశ నిస్పృహలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పై కేంద్రం పై అక్కసు తో విషం కక్కారని, తెలంగాణ రైతులు చైతన్యం కలిగిన వారని అన్నారు.
బాధ్యత గల స్థానం లో ఉన్న కేసీఆర్ బీజేపీ నాయకులపై దాడులు చేయండి అనే పద్దతిలో మాట్లాడటం నాలుక చీరేస్తామని మాట్లాడటం దూరదృష్టమని అన్నారు, భావజాల సంఘర్షణ లో నక్సలైట్ల కు వ్యతిరేకంగా ఉద్యమించిన చరిత్ర బీజేపీ కార్య కర్తలదని ,ఇటువంటి బెదిరింపు ల కు బయ పడమని అన్నారు, కేసీఆర్ వైఖరికి నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధు సుధన్ రెడ్డి,పాపయ్య గౌడ్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పడమటి జగన్మోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్,బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు, బూనేటి కిరణ్ గౌడ్ ,బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శులు నరసింహ రెడ్డి,నిరంజన్ రెడ్డి, గోల్కొండ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు మనిక్ ప్రభు,రంగా రెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు