Suryaa.co.in

Telangana

దళిత బందు పేరుతో దళితులను దగా చేసిన కేసీఆర్

బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాష

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికలు వచ్చినప్పుడల్లా సంక్షేమ పథకాల పేరిట అనేక జిమ్మిక్కులు చేసి దళితుల ఓట్లు కొల్లగొట్టి దగా చేస్తున్నాడని బీజేపీ యస్సి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు బాష నాంపల్లి బీజేపీ రాష్ట్రాకార్యాలయం నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

హుజురాబాద్ ఉపఎన్నికల సందర్భంలో 16 బస్సులు పెట్టి ఊరికి 4 చొప్పున దళితులను ప్రగతి భవన్ కి పిలిపించుకుని దళితబందు పై చర్చ చేసిన కేసీఆర్‌ ఎన్నికలు ముగిసి 2 యేండ్లు ముగిసిన నేటికి అక్కడి దళితులకు పూర్తి స్థాయిలో ఈ పథకం అమలు చేయలేదన్నారు
అసెంబ్లీ సాక్షిగా సంవత్సరానికి 2లక్షల కుటుంబాలకు దళితబందు ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఈ నాటికి దాంట్లో సగం కుటుంబాలకు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు బడ్జెట్ లో దళితబందుకు భారీగా నిధులు కేటాయించిన కేసీఆర్ ఆ నిధులు ఖర్చు చేయటంలో మాత్రం సుముకత చూపటం లేదన్నారు.

ఎక్కడన్నా అడపా దడపా దళిత బందు పథకం వర్తింపచేసినా లబ్ధిదారులను మాత్రం బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు,నాయకులను ఎంపిక చేస్తూ నిండు పేదరికంలో మగ్గుతున్న దళితులకు అన్యాయం చేస్తు దళితుల్లో వర్గాలు ఏర్పడేలా చేసి ఒకరిపై ఒకరిని దాడులకు ఉసిగొల్పి కేసీఆర్‌ దళితుల ఐక్యతను దెబ్బ తీస్తున్నారన్నారు.

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మపురి అసెంబ్లీలోని రామయ్య పల్లె,రాజారామ్,దొనూర్, తీగల ధర్మారం జగదేవ్ పేట మొదలైన అనేక గ్రామాల్లో ఇందుకు అనేక ఉదాహరణలు సాక్షాత్కరించగా రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయవచ్చన్నారు.

మరోపక్క పేదరికంలో మగ్గుతున్న దళితులకు అరకొరగా ఎవరికైనా దళితబందు మంజూరు చేస్తే వారివద్ద నుండి బీఆర్‌ఎస్‌ లీడర్లు భారీ కమిషన్లు నొక్కుతున్నారన్నారు.

దళిత జాతి అభ్యున్నతికోసం దళిత బందు అంటూ పథకం ప్రారంభంలో వ్యాఖ్యానించిన కేసీఆర్ ఎన్నికల కోడ్ వచ్చే వరకు ఎందుకు తాత్సారం చేస్తున్నారో దళితులకు చెప్పాలన్నారు.,ఇది దళితులను దగా చేయటం కాకపోతే మరెంటని కేసీఆర్‌ ని ప్రశ్నించారు.

దళితులకు ఇచ్చి మరిచిన అనేక హామీలలో కేసీఆర్ వైఖరిని పరిశీలీస్తే దళితుల ఎమోషన్స్ తో ఆడుకోవటం ద్వారా కేసీఆర్ రాక్షస ఆనందం పొందుతున్నట్లు అర్ధమవుతుందని అన్నారు.కేసీఆర్ దళితులకు చేసిన మోసల్లో దళిత బందు మొదటి మోసం కాదని కాకపోతే ఇది దళితుల ఆత్మగౌరవాన్ని,ఔన్నత్యాన్ని,ఐక్యతను దెబ్బతీసే కుట్ర అని కొప్పు భాష అన్నారు.

దళిత సమాజంలోని విద్యావంతులు, మేధావులు,విజ్ఞానులు మేల్కొని దళితులను కేసీఆర్‌ వంచిస్తున్న తీరుకు అడ్డుకట్ట వేయటానికి బీజేపీ తో కల్సి నడవాలని కోరారు.

LEAVE A RESPONSE