Suryaa.co.in

Telangana

పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 38 ఎకరాల అప్పగింతకు చొరవ చూపించాలి

– మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి కి జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌజింగ్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విజ్ఞప్తి

హైదరాబాద్ : సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌజింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్ లో కేటాయించిన 38 ఎకరాలు అప్పగింతకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చొరవ చూపించాలని మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి కి సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు హైదరాబాద్ బషీర్ బాగ్ దేశోద్దారక భవన్ లో శ్రీనివాస్ రెడ్డి ని ఇటీవల కొత్తగా ఎన్నికైన సొసైటీ ప్రెసిడెంట్ బొమ్మగాని కిరణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఆర్.రవికాంత్ రెడ్డి, సీఈఓ ఎన్.వంశీ శ్రీనివాస్, డైరెక్టర్స్ పి.వి.రమణరావు, కె.అశోక్ రెడ్డి బుధవారం కలిశారు. ఆయనను శాలువా, బొకేతో సత్కరించారు.

పేట్ బషీరాబాద్ భూమి అప్పగింతకు సంబంధించి వినతిపత్రాన్ని సమర్పించారు. 2008 నుంచి జరిగిన పరిణామాలు, ప్రభుత్వానికి మార్కెట్ ధర రూ. 12 .33 కోట్లు చెల్లింపు, కేటాయించిన 70 ఎకరాలు మొత్తం సొసైటీ కి స్వాధీన పరచమని వివిధ దశల్లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు శ్రీనివాస్ రెడ్డి కి వివరించారు. భూమి కేటాయింపునకు సంబంధించిన జీఓ కాపీలు, సుప్రీం కోర్టు తీర్పు పత్రులను అందజేశారు. సుప్రీం కోర్టు తీర్పు అనంతర పరిణామాలపై కూడా కూలంకుషంగా చర్చించారు. భూమి అప్పగింతకు సంబంధించి చొరవ చూపించాలని చేసిన విజ్ఞప్తిపై కె.శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

LEAVE A RESPONSE