Suryaa.co.in

Andhra Pradesh

అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం

-జగన్ కు ప్రజలు అంతిమ యాత్ర సినిమా చూపిస్తారు
-పెనుగొండ శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

లక్ష కోట్లు దొబ్బేసి జైల్లో ఉండివచ్చిన వ్యక్తి జగన్. మద్యం ద్వారా ఎలా సంపాదించాలి? క్వారీల్లో ఎలా డబ్బులు సంపాదించాలి…ఇసుకలో ఎలా డబ్బులు లోపేలో ఆలోచన ఉంటుంది. కానీ ఉత్తరాంధ్రకు వెల్లిన తనకు విజన్ ఉంది అంటున్నాడు. విశాఖ వెళ్లి మళ్లీ సిద్ధం అంటన్నాడు..మీకు ప్రజలు అంతిమ యాత్ర సినిమా చూపిస్తారు. మొన్న ఒక గ్రాఫిక్స్ చూపించాడు…ఆ టవర్లు చూస్తే కోడికత్తి టవర్స్ గుర్తొచ్చాయి. వివరాలు వాకబు చేస్తే సాక్షిలో తయారు చేశారని చెప్పారు. రెండు కోడికత్తులు కలిపి చేసిన టవర్స్ చూపించారు. కనీసం దానికి ఎంత ఖర్చు అవుతుంది కూడా తెలీదు.

బాబాయ్ ని లేపేసింది ఎవరు? ఆప్షన్ -1 జగన్, ఆప్షన్-2 అవినాష్ రెడ్డి, ఆప్షన్-3 భాస్కర్ రెడ్డి, ఆప్షన్-4 పైనున్న వారందరూ…ఏది కరెక్టు..నాలుగోది. మొదట గుండెపోటు అని శవానికి కుట్లు వేసి హడావుడిగా అంత్యక్రియలు చేయాలని చూశారు. హత్యజరిగిన తర్వాత రోజు చంద్రబాబు ఫోటో కు చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాశారు. సొంత చెల్లికే భద్రత లేదంటే రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉంటుందా.?

మరో చెల్లెమ్మ…అన్న విడిచిన బాణం. పాపం ఆమెను కూడా మెడ పట్టి గెంటేశారు. జగన్ మాకు వెన్నుపోటు పొడిచారని చెబుతున్నారు. వివేకా హత్య…జగనాసుర రక్త చరిత్రదే. 2 నెలలు ఆగితే ప్రజా ప్రభుత్వం వస్తుంది అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం.

పెనుకొండ నాడు విజయనగర సామ్రాజ్యానికి రెండో రాజధాని. చంద్రబాబు పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చారు. బాబాస్వామి దర్గా ఉన్న పుణ్యభూమి, పరిటాల శ్రీరాములు పట్టిన నేల ఇది. పరిటాల రవీంద్రను శాసనసభకు పంపిన నియోజకవర్గం ఈ పెనుకొండ. పౌరుషానికి మారు పేరు పెనుగొండ. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేసుకున్నాం.

నేను మంత్రిగా ఉన్నసమయంలో బీకే పార్థసారధి కాగితాలు పట్టకుని వచ్చేవారు. సంతకాలు పెట్టనిదే వెళ్లేవాడు కాదు. గత ప్రభుత్వంలో ఏకంగా 500 కి.మీ సీసీ రోడ్లు వేశాం. ఐదేళ్లలో రూ.1500కోట్లు ఈ నియోజకవర్గంలో ఖర్చు చేశాం. ఆర్టీసీ డిపో పనులు ప్రారంభించాం. పెనుగొండ పట్టణానికి గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా పైపులైన్లు వేశాం. ఎవరూ ఊహించని విధంగా కియాను తెచ్చిన ఘనత టీడీపీది.

గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఏం చేశారు? ఆయనో అవినీతి అనకొండ. అన్నదమ్ములు నియోజకవర్గాన్ని కేక్ లా కట్ చేసుకున్నారు. కియా అనుబంధ సంస్థల వాళ్లను బెదిరించి మామూళ్లు అడగడంతో వెనక్కి పోయారు. లేబర్ కాంట్రాక్టులు తీసుకుని సకాలంలో జీతాలు కూడా చెల్లించడం లేదు. లే అవుట్ వేయాలంటే కమిషన్..సెంటు పట్టా కావాలన్నా కమిషన్ కట్టాల్సిందే. అందుకే ఈ సైకోను పక్క నియోజకవర్గానికి తరిమేశారు. చెత్త ఎక్కడ వేసినా చెత్తే కదా.?

పాదయాత్రలో జగన్ అనేక హామీలు ఇచ్చాడు. గోరంట్ల మండలానికి మడకశిర బ్రాంచ్ కెనాల్ నుండి నీళ్లిస్తానని చెప్పాడు. గొర్రెల పెంపకానికి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి పట్టించుకోలేదు. మెడికల్ కాలేజీ కూడా పనులు ఎలా జరుగుతున్నాయో చూశాం. మడకశికర బ్రాంచ్ కెనాల్ 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేదు. టీడీపీ-జనసేన ప్రకటించిన సవితను గెలిపించి శాసనసభకు పంపండి. ప్రతి ఇంటికి నీటి కుళాయి అందిస్తాం. పెనుగొండ కోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం.

LEAVE A RESPONSE