Suryaa.co.in

Telangana

ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతక హక్కు కేసీఆర్‌ కు లేదు

-కేసీఆర్‌ కు దమ్ముంటే నోటీసులు ఇవ్వాలి?
-ఆయన ఒక రాజకీయ అవకాశవాది
-రైతులను ఓదార్చకపోవటం దురదృష్టకరం
-వారిపై ప్రేమ ఉంటే ఎందుకు బేడీలు వేయించావు
-ఆయన హయాంలో పదేళ్లు కుంభకోణాల పాలనే
-కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి ధ్వజం

కరువు, వడగళ్లు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు ప్రజల మీద ప్రభావం చూపుతా యని, ముఖ్యంగా రైతుల మీద ప్రభావం చూపుతాయని, మాజీ సీఎం కేసీఆర్‌ ఎండిన పంటల పర్యటన ఒక రాజకీయ విన్యాసం మాత్రమేనని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ప్రజలను ఆడుకోవడానికి సలహాలు ఇవ్వలాని, రైతులకు ధైర్యం చెప్పకుండా.. ఓదార్చకుండా పార్లమెంట్‌ ఎన్నికల కోసం రాజకీయం చేయడం దురదృష్టకరమని విమర్శించారు.

కరువు వచ్చినప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు విధివిధానాలు ఉంటాయని, ఎక్కడ, ఎంత పంట నష్టం జరిగింది అనేది ప్రభుత్వం అంచనాలు ప్రభుత్వం వేస్తుందన్నారు. గ్రామాలలో ఉండే కూలీలకు, పశువులకు మేత సమస్యలు ఉంటాయి.. వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై దృష్టి సారించాల్సి ఉంటుంది.. కేసీఆర్‌ మంత్రిగా ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. ఆయన నియోజకవర్గం సిద్దిపేటలో కూడా నాడు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోకూడదు అని రామచెన్నారెడ్డితో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేశాము…రైతులకు ఉన్న బ్యాంకు రుణాలు మాఫీ చేశాం..ప్రైవేటు రుణాలు ప్రభుత్వం తీసుకున్నది… కేసీఆర్‌ పదేళ్లు సీఎంగా చేసినా కళ్లు తెరవడం లేదని విమర్శించారు.

కేసీఆర్‌కు రైతుల మీద ప్రేమ ఉంటే.. ఖమ్మం రైతులకు బేడీలు ఎందుకు వేయించారో చెప్పాలని ప్రశ్నించారు. ఆ రైతుల న్యాయ పోరాటం కోసం కాంగ్రెస్‌ తరపున ఉచితంగా లాయర్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్‌ హయాంలో కులాల సంచారంతో రాజకీయాలు చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో గొర్లు, పశువులు, చేపలు పంపిణీలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి. కేసీఆర్‌కి రాజకీయ అవకాశం కల్పించింది కాంగ్రెస్‌ పార్టీనే.

కేసీఆర్‌ ఒక రాజకీయ అవకాశ వాది.. దేశ రాజకీయాలలోకి వెళ్లాలని బీఆర్‌ఎస్‌ పెట్టాడు.. ఇప్పుడు టీఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ రెండు పోయాయి. ఆయన ఆశకు అంతు లేదు. రాష్ట్రాన్ని నాశనం చేసిన మీకు తమ ప్రభుత్వం మీద విమర్శలు చేసే నైతిక హక్కు లేదని హితవుపలికారు. కేటీఆర్‌ కు దమ్ముంటే నాకు నోటీసులు ఇవ్వండి. మంత్రిగా పని చేసిన వారు ఎవరికైనా నోటీసు లు పంపవచ్చా..? నోటీసులు, కోర్టులు అని భయపెట్టించే ప్రయత్నం చేయడం అంటే తప్పు చేశారు కాబట్టే. కేసీఆర్‌ రైతు బంధు ఆయన జేబులో నుంచి ఇచ్చాడా అని ప్రశ్నించారు. రైతులను, పేదలను భయపెట్టి నిషేధిత జాబితాలో పెట్టి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని విమర్శించారు.

LEAVE A RESPONSE