కేసీఆర్ అభివృద్ధి నిరోధకుడు

Spread the love

• తెలంగాణ అభివృద్ధి బీజేపీ లక్ష్యం…
• తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలతో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం
– ప్రధాని రాష్ట్రానికొచ్చి వేల కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తే కేసీఆర్ హాజరు కాకపోవడం సిగ్గు చేటు
– అంత పీకుడు పని ఏముంది?
– తెలంగాణ ప్రజలు తగిన బుద్ది చెప్పడం ఖాయం
– మోదీ సభను గ్రాండ్ సక్సెస్ చేసిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
– స్వచ్చందంగా సభకు తరలివచ్చి మోదీ నాయకత్వంపట్ల ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలు మరువలేనివి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్

వేల కోట్లతో అభివ్రుద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి తెలంగాణకు వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ మొఖం చాటేయడం సిగ్గు చేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ అభివృద్ధి నిరోధకుడంటూ ధ్వజమెత్తారు. పరేడ్ గ్రౌండ్ వద్ద మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తీరును తప్పుపట్టారు. ఆయన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు…..

ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా బిజీ … తెలంగాణ అభివృద్ధి కోసం 11 వేల 360 కోట్ల పనుల ప్రారంభానికి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తే కూడా సీఎం హాజరు కాకపోవడం సిగ్గు చేటు. తెలంగాణలో వేల కోట్లతో జరిగే అభివృద్ధి పనులకు హాజరు కావాలని సీఎం రావాలని నేను స్వయంగా కోరిన. ఆయన కోసం ప్రత్యేకంగా సీటు కేటాయించాం. సన్మానించేందుకు నేను శాలువా కూడా తెచ్చిన. కానీ ఎందుకు రాలేదు? ప్రధాని వచ్చినా రాలేదంటే అంత పీకుడు పనేముంది?

తక్షణమే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఈ కార్యక్రమానికి ప్రధాని, గవర్నర్, కేంద్ర మంత్రులు వచ్చినా కేసీఆర్ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలి. ఎన్నికలప్పుడే రాజకీయాలు… ఎన్నికలయ్యాక అభివృద్ధి ముఖ్యమని ప్రధాని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమానికి రాకుండా కేసీఆర్ అభివృద్ధి నిరోధకుడని మరోసారి నిరూపించారు. తెలంగాణ అభివ్రుద్ధి పనులను వీక్షించేందుకు పరేడ్ గ్రౌండ్ పెద్ద ఎత్తున పజలొచ్చారు. టీవీల ద్వారా రాష్ట్ర ప్రజలంతా వీక్షించారు. సీఎం రాని విషయాన్ననని ప్రజలంతా గమనిస్తున్నారు. తగిన సమయంలో కేసీఆర్ కు బుద్ది చెప్పడం ఖాయం. తెలంగాణ అభివృద్ధి బీజేపీ లక్ష్యం.. తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలతో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం

Leave a Reply