కేసీఆర్… రోడ్ల దుస్థితి చూడు…

Spread the love

-ప్రజలంతా టీఆర్ఎస్ ఫ్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు
-మార్పు కోరుకుంటున్నారు
-బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేస్తాం
-జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి ఆదుకుంటాం
– మీడియాతో బండి సంజయ్

‘‘తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని, రోడ్లు బాగున్నయని కేసీఆర్ చెబుతున్నడు.. నేను కేసీఆర్ కు సవాల్ చేస్తున్నా… కాకునూరు నుండి కేశంపేట వరకు నడుచుకుంటూ నడిచిరా… రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయో అర్ధమవుతోంది. నేను పాదయాత్ర చేస్తుంటే… గుంతల రోడ్లే దర్శనమిచ్చాయి. ప్రజలకు తల ఎత్తి అభివాదం చేయలేని పరిస్తితి. ఏ గుంతలో పడతామో తెలియని విధంగా రోడ్లన్నీ గుంతలమయ్యాయి’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 28 వ పాదయాత్ర ప్రారంభించే ముందుకు కేశంపేట పాదయాత్ర శిబిరం వద్ద టీవీ ఛానళ్లతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు….

నిన్న రంగారెడ్డి జిల్లాలో అడుగుపెట్టాం. ఇక్కడి ప్రజల ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పాలమూరు ప్రజలంతా ఒక్కటై… 27 రోజుల పాటు పాదయాత్రను విజయవంతం చేశారు. ప్రజల స్పందన చూస్తుంటే టిఆర్ఎస్ పార్టీపై ఎంత వ్యతిరేకంగా ఉన్నారో స్పష్టంగా అర్థం అవుతోంది. అనేక సమస్యలతో ప్రజలంతా సతమతమవుతున్నారు.

లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ను పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పటివరకు దాన్ని పూర్తి చేయలేదు. కావాలనే ఈ ప్రాంతంలో వ్యవసాయం పట్ల కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారు. నీళ్లిస్తే… వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా నడవదు. పంట పొలాలు ఎండి పోవాలి… అవి బీడులు బారాలి. వాటిని రియల్ ఎస్టేట్ కోసం కొనుక్కుని, డబ్బులు దండుకోవాలి.

రైతుల దగ్గర భూములను వేలకు కొని, కోట్లకు అమ్ముకోవాలి.
ఇక్కడి రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. నన్ను మోకాళ్ల మీద నడవాలన్న వారికి సవాల్ చేస్తున్నా… కేసీఆర్ కు చేతనైతే కాకునూర్ నుంచి కేశంపేట్ వరకు మందు నడిచి రండి… స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ మాత్రం తన ఇంటికి 5 ఉద్యోగాలిచ్చుకున్నడు.

కనీసం ఈ ప్రాంతంలో R.O.B ని ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. విద్య, వైద్యం సహా అనేక సమస్యలతో ఇక్కడి ప్రజలు తల్లడిల్లుతున్నారు.ఇక్కడ గుంట జాగా కొనాలన్నా… అమ్మాలన్నా పర్మిషన్ తీసుకోవడానికి వాళ్లకు పైసలు ఇవ్వాల్సిందే. అన్ని వర్గాలను, అన్ని రంగాలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం.

సీఎంవో కు రంగారెడ్డి జిల్లా నుంచి పొట్టు పొట్టు కమిషన్లు పోతున్నాయి. అన్ని చోట్ల కేసీఆర్ కు కమిషన్ లే. ఇప్పటివరకు విలేఖరులకు కూడా న్యాయం చేయలేదు. విలేఖరులను చూస్తే బాధేస్తోంది. విలేఖరులకు ఇచ్చిన హెల్త్ కార్డులు పనిచేయవు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి అంతే. బీజేపీ ప్రభుత్వం వస్తే విలేఖరులను ఆదుకుంటాం. వారి సమస్యలను పరిష్కరిస్తాం. మా నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాo. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.

Leave a Reply