Suryaa.co.in

Telangana

కేసీఆర్‌ గారూ.. బీసీ బంధు ప్రకటించండి

– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు బీసీ బంధు ప్రకటించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. ఆ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగలేఖ రాశారు. భట్టి లేఖ సారాంశం ఇదీ..

గౌరవనీయులైన శ్రీ కె.చంద్రశేఖరరావు గారికి, తేదిః 19.04.2023
ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
నమస్కారం …
విషయం: ‘‘బీసీ బంధు’’ పథకం వెంటనే ప్రారంభించాలి …

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర సంవత్సరాలు కావస్తున్నా బడుగుబలహీనవర్గాల జీవితాల్లో ఎటువంటి మార్పురాలేదని పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్రలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో అనేక గ్రామాల్లో పర్యటించినప్పుడు కళ్లకు కట్టినట్లు కనబడుతోంది. ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలు, బహుజనులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతం. గత ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీనవర్గాల వారికి చెందాల్సిన సంక్షేమపథకాలు అందడం లేదని తమపట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వివక్షత చూపుతుందని తమ గోడును బలహీనవర్గాల వారు ‘‘పీపుల్స్‌మార్చ్‌’’ పాదయాత్రలో స్వయంగా మమ్మల్ని కలిసి తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. బడుగు బలహీనవర్గాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ తరుపున మీ దృష్టికి తీసుకుని రాదలచాము.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2014 లో రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుండి బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఏరు దాటక తెప్ప తగలేసినట్లు 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల అభివృద్ధికి మీరు, టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన వాగ్ధానాలన్నీ తుంగలో తొక్కి బీసీలను నిట్టనిలువునా మోసం చేసిన ఘనత మీకే దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. కులాలవారీ జనగణన చేసి వివరాలు సేకరించారు. దీని ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలు పర్క్భుత్వం వద్ద ఉన్నా బయటకు ప్రకటించడం లేదు. ఇదంతా జనాభా నిష్పత్తికి అనుగుణంగా నిధులు, నియామకాలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా టీఆర్ఎస్ ప్రభిత్వం చేస్తున్న కుట్రలో భాగమే.

తెలంగాణ ఏర్పడిన నాటినుంచి బీసీలకు 2.3 శాతం మాత్రమే నిధులు కేటాయిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకున్న 34 శాతం రిజర్వేషన్లను 18 సతనికో కుదించారు. 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు రాష్ట్ర కేబినెట్ లో మూడు పదవులు ఇచ్చి దులుపుకున్నారు. ఈ చర్యలతో మీరు బీసీలను అనగదొక్కుతున్నారని అర్థం అవుతోంది. కరోనా కల్లోలంలో చేనేత కార్మికుల బతుకులు కుదేలయ్యాయి. రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత బీసీ సామాజికవర్గాలు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాల కోసం లక్షలమంది ధరఖాస్తు చేసినా వారికి ఎటువంటి సబ్సిడీ రుణాలు అందడం లేదు. అధికారిక లెక్కల ప్రకారమే 2014 నుండి 2022 వరకు బీసీ సామాజికవర్గాలు సబ్సిడీ రుణాల కోసం రాష్ట్రప్రభుత్వం 55,183.57 కోట్ల రూపాయల నిధుల కేటాయించగా అందులో 17,231.75 కోట్ల నిధులు మాత్రమే విడుదల చేసింది. అందులో ఖర్చు చేసింది కేవలం 6,078.09 కోట్ల రూపాయలు మాత్రమే. అదే విధంగా ఎంబీసీలకు 2014 నుండి 2022 వరకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌ 3.305 కోట్ల రూపాయలు కాగా అందులో మంజూరు చేసిన నిధులు 1,928 కోట్లు. విడుదల చేసిన నిధులు 601.51 కోట్లు మాత్రమే.

ఎంబీసీలకు కేటాయించిన నిధులు దాదాపు 511.39 కోట్ల నిధులు మునిగిపోయాయి. ఇది మీ హయాంలో బీసీలకు, ఎంబీసీలకు జరిగిన సహాయం. ఇప్పటికైనా మీరు కళ్లు తెరిచి బీసీలకు, ఎంబీసీలకు ధరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికి సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ తరుపున డిమాండ్‌ చేస్తున్నాం. రాష్ట్ర జనాభాలో 54 శాతం ఉన్న బీసీలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిధుల కేటాయింపుల్లో, ఖర్చుల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. 2023-24 లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ 2 లక్షల 90 వేలకోట్లు కాగా అందులో కేవలం 5 శాతం మాత్రమే బీసీల సంక్షేమానికి నిధులు కేటాయించారు. బీసీల సంక్షేమం పట్ల వారికున్న చిన్నచూపుకు ఇంతకన్నా చక్కటి నిదర్శనం మరొకటి ఉండదు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి బీసీల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయడం లేదు. 2018-2019 లో బీసీల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం 5,960 కోట్లు కేటాయించినా అందులో 63 శాతం నిధులు ఖర్చు చేయలేదు. 2022-23 లో కూడా పరిస్థితి అదే.

దళిత బంధు తరహాలో ‘‘బీసీ బంధు’’ పథకం ప్రారంభిస్తామని గతంలో మీరు శాసనసభ వేదికగా హామీ ఇచ్చారు. ఈ హామీ నీటిమీద రాతగానే మిగిలింది తప్ప కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో 54 శాతానికి పైగా వున్న బీసీల అభివృద్దికి పథకాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని, బీసీలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. సబ్సిడీ రుణాల కోసం బడుగు బలహీనవర్గాలవారు లక్షలాది మంది ధరఖాస్తు చేసుకొని గత ఐదు సంవత్సరాలుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగితాలపై బడ్జెట్‌ కేటాయింపులు ఘణంగా కనిపిస్తున్నా ఆచరణలో బీసీలకు ఖర్చు చేస్తున్నది నామమాత్రమే. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత తెస్తామని 2017 వ సంవత్సరంలో అసెంబ్లీలో మీరు చెప్పిన మాటలు శుష్క వాగ్ధానంగానే మిగిలింది. బీసీ సబ్‌ప్లాన్‌కు ప్రభుత్వ హామీ అమలై వుంటే బీసీల సంక్షేమం కోసం కేటాయిస్తున్న నిధులకు మరో రూ.10 వేల కోట్ల నిధులు అదనంగా సమకూరేవి.

2017లో ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పోరేషన్‌ అలంకారప్రాయంగా మారింది. ప్రతి బడ్జెట్‌లో రూ. 1000 కోట్లు కేటాయించి ఖర్చు చేయనున్నట్లు మీ ప్రభుత్వం గప్పాలు కొట్టింది. కానీ 2017`18 నుండి 2021-2022 వరకు ఎంబీసీ కార్పోరేషన్‌కు కేటాయించిన బడ్జెట్‌కు జరిగిన ఖర్చుకు అసలు పొంతనేలేదు. 2018-19 లో 75 శాతం, 2020-22 సంవత్సరాల్లో 100 శాతం నిధులు ఖర్చు చేయకుండా ఎంబీసీలను నిట్టనిలువునా మోసగించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుంది. ఎంబీసీల కోసం గత నాలుగు బడ్జెట్లలో రూ. 3000 కోట్లు కేటాయించినట్లు కాగితాల్లో కనిపిస్తున్నా ఫైనాన్స్‌ విభాగం ఆమోదం పొందింది నామమాత్రమే. దానిలో ఖర్చు చేసింది చాలా తక్కువ. దీన్నిబట్టే ఎంబీసీలపై మీకు, టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎంత ప్రేమ ఉందో స్పష్టం అవుతోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. కులాలవారిగా జనగణన చేసి వివరాలు సేకరించారు. దీని ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలు ప్రభుత్వం వద్ద ఉన్నా బయటకు వెల్లడిరచడం లేదు. ఇదంతా జనాభా నిష్పత్తికనుగుణంగా నిధులు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమే. తెలంగాణ ఏర్పడిననాటి నుండి రాష్ట్రబడ్జెట్‌లో బీసీలకు 2.3 శాతం మాత్రమే నిధులు కేటాయిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. స్థానిక సంస్థల్లో బిసిలకున్న 34 శాతం రిజర్వేషన్లను 18 శాతానికి కుదించారు. 50 శాతానికి పైగా జనాభా వున్న బీసీలకు రాష్ట్ర క్యాబినెట్‌లో కేవలం ముగ్గురికి మాత్రమే మంత్రి పదవులిచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ చర్యలతో మీరు బీసీలలో అణగదొక్కుతున్నారో స్పష్టం అవుతోంది.

కరోనా కల్లోలంలో చేనేత కార్మికుల బతుకులు కుదేలయ్యాయి. రాష్ట్రం ఏర్పడినప్పుడు 470 సహకార సంఘాల ఉండగా ప్రస్తుతం అవి 220కి పడిపోయాయి. చేనేత పొదుపు పథకం నిలిచిపోయింది. హ్యాండ్లూమ్, పవర్ లూమ్ వంటి రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండిపోయింది. 46 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని ఇచ్చిన జీ.వో.ను ఇప్పటికీ అమలు చేయలేదు. తమను ఎంబీసీ జాబితాలో చేర్చాలని 15 కులాలవారు అనేక ఏండ్లగా చేస్తున్న విజ్ఞప్తులు ప్రభుత్వం చెవికి ఎక్కడం లేదు. దోబీలకు దోబీఘాట్‌లు, డ్రైయింగ్‌ మిషన్లు, నాయి బ్రాహ్మణులకు మోడ్రన్‌ సెలూన్లు ఏర్పాటు చేస్తామన్న ఎన్నికల హామీలు అమలుకు నోచుకోలేదు.

2018-19లో చేనేత రంగానికి కేటాయించిన రూ.722 కోట్లలో 40 శాతం ఖర్చు చేయలేదు. తెలంగాణ నాయీ బ్రాహ్మణ కో ఆపరేటివ్‌ సొసైటీ ల ఫెడరేషన్‌ కు 2017-18లో కేటాయించిన నిధుల్లో 91 శాతం ఖర్చు చేయలేదు. 2018-19 లో కేటాయించిన నిధుల్లో 86 శాతం ఖర్చు చేయలేదు. తెలంగాణ రజక కో`ఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ కు 2018-19 లో కేటాయించిన నిధుల్లో 73 శాతం ఖర్చు చేయలేదు. ఆ తరువాత సంవత్సరాలలో ఎప్పుడూ ఈ కార్పోరేషన్‌కు నిధులు కేటాయించలేదు. బీసీలకు ఫీజురీయంబర్స్‌మెంట్‌ పెండింగ్ బకాయిలు దాదాపు కోట్ల రూపాయలు ఇప్పటికీ విడుదల చేయలేదు. 2019-20 లో ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌కు 299 కోట్లు కేటాయించినా ఒక్కరూపాయికూడా ఖర్చు చేయలేదు. 2021-22 లో కూడా ఈ స్కాలర్‌షిప్‌ల కోసం 254.19 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం పేద బీసీ విద్యార్థుల పట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపే కారణం. ప్రభుత్వ హాస్టల్స్‌ కు 2018-19లో కేటాయించిన నిధులలో 36 శాతం, 2020-21లో 61 శాతం, 2021-22లో 81 శాతం నిధులు ఖర్చు చేయలేదు.

వెనుకబడిన వర్గాల రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, జూనియర్‌ కాలేజీల సొసైటీకి 2018- 19లో చేసిన కేటాయింపులలో 46 శాతం ఖర్చు చేయలేదు. 2020-21 లో 74 శాతం, 2021-22 లో 54 శాతం ఖర్చు చేయలేదు. సంక్షేమ హాస్టలల్లో ఉండే విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు, కాస్మోటిక్‌ చార్జీలను పెంచాలని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. వారి న్యాయమైన సమస్యలను మీరు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ సామాజిక వర్గాల స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాల కోసం లక్షల మంది దరఖాస్తు చేసిన ఎటువంటి సబ్సిడీ రుణాలు రాలేదు. అధికార లెక్కల ప్రకారమే 2014 నుంచి 2022వరకు బీసీ సామాజిక వర్గాలు సబ్సిడీ రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 55,183.57 కోట్ల రూపాయలు నిధుల కేటాయించగా అందులో రూ.17,231.75 కోట్ల నిధులు మాత్రమే విడుదల చేసింది. అందులో ఖర్చు చేసింది రూ.6078.09 కోట్లు మాత్రమే. అదే విధంగా ఎంబీసీలకు 2014 నుంసీబీ 2022 వరకూ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ రూ.3.305 కోట్లు కాగా అందులో మంజూరు చేసిన నిధులు రూ.1928 కోట్లు మాత్రమే.

విడుదల చేసిన నిధులు రూ.601.51 కోట్లు మాత్రమే. ఎంబీసీలకు కేటాయించిన నిచుకు దాదాపు రూ.511.39 కోట్ల నిఫులి మునిగిపోయాయి. ఇది మీ హయాంలో బీసీలకు, ఎంబీసీలకు జరిగిన సహాయం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరచి బీసీలకు, ఎంబీసీలకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో 54 శాతానికి పైగా ఉన్న బీసీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిధుల కేటాయింపుల్లో, ఖర్చులో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. 2023- 24లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ రూ 2 లక్షల 90 వేల కోట్లు. . అందులో బీసీల సంక్షేమం కోసం కేవలం 5 శాతం మాత్రమే నిధులు కేటాయించారు. బీసీల సంక్షేమం పట్ల వారికున్న చిన్నచూపుకు ఇంతకన్నా చక్కని నిదర్శనం మరొకటి ఉండదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీల సంక్షేమం కోసం కేటాయించిన నిఫులను పూర్తిగా ఖర్చు చేయడం లేదు. 2018-2019లో బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ5,960 కోట్లు కోటాయించినా..అందులో 63 శాతం నిధులు ఖర్చు చేయలేదు. 2022-23లో కూడా ఇదే పరిస్థితి.

దళిత బంధు తరహాలో బీసీ బందు పథకం ప్రారంభిస్తామని శాసనసభ వేదికగా హామీ ఇచ్చారు. ఈ హామీ ఇప్పటికీ నీటి మీద రాతగా మిగిలిన తప్ప కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో 54% పైగా ఉన్న బీసీలు అభివృద్ధికి పథకాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని బీసీలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. సబ్సిడీ రుణాల కోసం బడుగు బలహీన వర్గాల వారు లక్షలాది మంది దరఖాస్తు చేసుకుని, గత ఐదు సంవత్సరాలుగా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కాగితాలపై బడ్జెట్ కేటాయింపులు ఘనంగా కనిపిస్తున్న ఆచరణలో బీసీలకు ఖర్చు చేస్తున్నది మాత్రం నామమాత్రమే. బీసీ సబ్ ప్లాన్ చట్టం తెస్తామని 2017లో అసెంబ్లీలో మీరు చెప్పిన మాటలు సుష్క వాగ్దానంగానే మిగిలింది. బీసీ సబ్ ప్లాన్ కు ప్రభుత్వ హామీ అమలై ఉంటే బీసీల సంక్షేమం కోసం కేటాయిస్తున్న నిధులకు మరో రూ.100 వేల కోట్లు అదనంగా సమకూరేవి.

2017 లో ఏర్పాటుచేసిన ఎంబీసీ కార్పొరేషన్ అలంకారప్రాయంగా మారింది. ప్రతి బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించి ఖర్చు చేయనున్నట్లు మీ ప్రభుత్వం గఫ్ఫాలు కొడుతోంది.. కానీ 2017-18 నుంచి 2021-22 వరకు ఎంబీసీ కార్పొరేషన్ కు కేటాయించిన బడ్జెట్.. జరిగిన ఖర్చులకు అసలు పొంతనే లేదు. 2018-19లో 75% 2020-22 సంవత్సరాల్లో 100% నిధులు ఖర్చు చేయకుండా ఎంబీసీల నిలువెల్లా మోసగించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఎంబీసీల కోసం గతంలో నాలుగు బడ్జెట్లలో రూ.3000 కోట్లు కేటాయించినట్లు కాగితాల్లో కనిపిస్తున్న ఫైనాన్స్ విభాగం ఆమోదం పొందింది నామ మాత్రమే. దానిలో ఖర్చు చేసింది ఇంకా తక్కువ. దీన్ని బట్టి ఎంబీసీలపై మీకు టిఆర్ఎస్ పార్టీకి ఎంత ప్రేమ ఉందో స్పష్టం అవుతుంది.

రాష్ట్రంలో 54 శాతానికి పైగా ఉన్న బీసీల జీవితాలతో చెలగాటం ఆడటం మానుకోవాలని, వారికి జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌ కేటాయింపులు చేస్తూ వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని, ఉద్యోగ రాజకీయపరమైన నియామకాల్లో వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ తరుపున డిమాండ్‌ చేస్తున్నాం. మీరు హామీ ఇచ్చిన ప్రకారం ఇప్పటికైనా బీసీ బంధు పథకాన్ని ప్రకటించి తగిన నిధులు ఇచ్చి అమలు చేయాలని, అర్హులైన ధరఖాస్తుదారులందరికీ సత్వరమే సబ్బిడీ రుణాలు మంజూరు చేయాలని, 2014, 2018 ఎన్నికలతో పాటు ఇతర సందర్భాల్లో మీరు, టీఆర్‌ఎస్‌ పార్టీ బీసీలకు ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని అమలు చేయాలని, ఆత్మగౌరవ భవనాల నిర్మాణం వెంటనే చేపట్టాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ తరుపున డిమాండ్‌ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలపట్ల ఉన్న చిన్నచూపును విడనాడలని పక్షంలో బీసీల తరుపున కాంగ్రెస్‌పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము.

మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే
కాంగ్రెస్‌ సభా పక్ష నాయకులు

LEAVE A RESPONSE