కేసీఆర్.. మీరూ పెట్రోల్ రేట్లు తగ్గించండి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్
కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోలు పైన రూ.5లు, డీజిల్ పైన రూ.10లు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి బీజేపీ తెలంగాణ శాఖ తరపున ధన్యవాదాలు ఈ నిర్ణయం ద్వారా కేంద్రానికి రూ.లక్ష కోట్ల వరకు ఆదాయం తగ్గుతోంది. అయినప్పటికీ ప్రజలపై పడిన భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకోవడం అభినందనీయం.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్పూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం కూడా పెట్రోలుపైన 10 శాతం, డీజిల్ పై 10 శాతం వ్యాట్ తగ్గించాలని బీజేపీ తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తోంది. నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ నాయకులు రాజకీయంగా బీజేపీపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి కరోనా కష్టకాలంలో దేశ ఆర్దిక పరిస్థితిని చక్కపెట్టడంలో మోదీ ప్రభుత్వం విజయం సాధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలు సంక్షేమాన్ని ద్రుష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోలు, డీజిల్ పై పన్నులు తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తోంది.