-మాజీ శాసనసభ్యుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
రాజ్యాంగాన్ని మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడటం ఆయన అవివేకానికి పరాకాష్ట . ఇదే రాజ్యాంగ స్ఫూర్తితో అనేక పదవులు అనుభవించి ,అనుభవిస్తూ రాజ్యాంగం మార్చాలి అనడం కెసిఆర్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. సమానత్వం, సోషలిజం సాధన కోసం ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజల ప్రయోజనాలు రక్షించుటకు ఈరోజు భారత రాజ్యాంగం ఎంతగానో ఉపయోగపడుతుంది. రాజ్యాంగం కల్పించిన హక్కు ఈరోజు ప్రత్యేక రాష్ట్రం అన్న విషయాన్ని కేసీఆర్ గుర్తెరగాలి. ఈ విధంగా మాట్లాడి ముఖ్యమంత్రి లోపల ఉన్న నిరంకుశ ఫ్లూడల్ మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు . తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉండి అహంకారపూరితంగా మాట్లాడటం కెసిఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నాం. రాజ్యాంగం కల్పించిన అవకాశాలతో సకల సౌకర్యాలు పొందుతూ విలాసవంతమైన జీవితం గడుపుతూ రాజ్యాంగం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అన్ని రంగాలలో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వ అనాలోచిత చర్యతో ధరణి వెబ్ సైట్ వల్ల రెవెన్యూ సమస్య లతో ప్రజలు ఉంటే వాటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు కేసీఆర్ ని అని తెలియజేస్తున్నాం .