Suryaa.co.in

Telangana

తెలంగాణకు పట్టిన చీడ, పీడ కేసీఆర్ కుటుంబమే

-ఆ చీడ, పీడను వదిలించే వరకు మా పోరాటం ఆగదు
-రాజశేఖర్ రెడ్డి, కేటీఆర్ పీఏ తిరుపతికి భాగస్వామ్యం ఉంది
-కెటీఆర్, జనార్దన్ రెడ్డి, అనితా రామచంద్రన్ ను విచారణ చేయాల్సిందేనని సిట్ అధికారులకు స్పష్టం చేశా
-కేటీఆర్ కు నోటీసులిచ్చి విచారణ చేస్తే అసలు నేరస్తులు బయటపడతారు
-సిట్ ద్వారా నోటీసులిచ్చి ప్రభుత్వం మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం
-రేపు, ఎల్లుండి ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన
-25న సాయంత్రం కాకతీయ యూనివర్సిటీలో నిరసన కార్యక్రమాలు
-50లక్షల మంది ఉసురు ఉప్పెనై కేసీఆర్ కుటుంబాన్ని కప్పేస్తుంది
-రాష్ట్రం వచ్చినా ఆంధ్రా అధికారుల చేతిలోనే తాళాలు ఎందుకు ఉన్నాయి?
-దొర ఎంగిలి మెతుకులకు ఆశపడి అల్లం నారాయణ కేసీఆర్ పంచన చేరారు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షా పత్రాల లీక్‌పై ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి సిట్‌ విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగా తన వద్ద ఉన్న సమాచారాన్ని అధికారులకు అందించారు. లీకేజీ వ్యవహారంపై తాను, బండి సంజయ్‌, కేటీఆర్‌ మాట్లాడితే.. తమ ఇద్దరికే నోటీసులిచ్చిన సిట్‌.. మరి మంత్రి కేటీఆర్‌కు ఎందుకు నోటీసులివ్వలేదని అధికారులను ప్రశ్నించారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే తాను సిట్‌ ఎదుట హాజరయ్యానన్నారు. కేవలం తమను భయపెట్టడానికే నోటీసులిచ్చారన్నారు. అనంతరం ఆయన మీడియాతో లోపల విచారణలో ఏం జరిగిందీ? తాము ఏం ప్రశ్నించామన్నదీ మీడియాకు వెల్లడించారు. రేవంత్‌రెడ్డి ఏమన్నారంటే…

తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించింది విద్యార్థులు, నిరుద్యోగులు.తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందే నిరుద్యోగులు. టీఎస్పీఎస్సీ హిందువులకు దేవాలయం, ముస్లింలకు మసీదు, సిక్కులకు గురుద్వార లాంటిది. తెలంగాణలో టీఎస్పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది.నియామకాలు లోపభూయిష్ఠంగా జరిగాయి. ప్రశ్నపత్రం లీకేజీని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.బీఆరెస్ పార్టీని విస్తరించుకువడంపైనే దృష్టి పెట్టింది.టీఎస్పీఎస్సీ పై నిరుద్యోగులకు విశ్వాసం కలిగించడంలో ప్రభుత్వం విఫలం చెందింది.లేకేజీకి పూర్తి బాధ్యత మంత్రి కేటీఆర్ దే.కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి.టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహణను అపహాస్యం చేశారు. జరిగిన నేరాన్ని ఇద్దరికే పరిమితం చేసి కేటీఆర్ పెద్ద తలల్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్ రెడ్డి, కేటీఆర్ పీఏ తిరుపతికి భాగస్వామ్యం ఉంది.వంద మందికి పైగా 100 మార్కులు వచ్చాయని గతంలో మేం చెప్పాం.వారిని విచారించాల్సింది పోయి సిట్ ద్వారా నోటీసులిచ్చి ప్రభుత్వం మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేసింది.

రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అధికారులకు పూర్తి వివరాలను వివరించాము.నాకు ఉన్న సమాచారాన్ని, వివరాలను సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ కు అందించాంపేపర్ లీకేజీ పై నేను, బండి సంజయ్, కేటీఆర్ ముగ్గురం స్పందించాం. కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులకు నోటీసులిచ్చి కేటీఆర్ కు నోటీసివ్వలేదు.అంటే మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం అధికారులు చేశారు.కేటీఆర్ వ్యాఖ్యల వివరాలను సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాము.కేటీఆర్ కు నోటీసులిచ్చి విచారణ చేస్తే అసలు నేరస్తులు బయటపడతారు. నోటీసులకు స్పందించకపోతే కేటీఆర్ ను విచారించాలని కోరాం. సిట్ విచారణ చేయకుండానే కేటీఆర్ నేరం ఎలా జరిగిందో తెలంగాణ సమాజానికి వివరించారు.ఇంత చేసిన కేటీఆర్ వ్యాఖ్యలు సిట్ అధికారుల దృష్టికి రాలేదట..కేటీఆర్ పై ఫిర్యాదు తీసుకోమని, కేవలం సమాచారం మాత్రమే తీసుకుంటామని అధికారులు చెప్పారు.30 లక్షల తెలంగాణ నిరుద్యోగుల భవిష్యత్ ఆంధ్రా వాళ్లే నిర్ణయిస్తున్నారు.

చుక్కా రామయ్య, హరగోపాల్, కోదండరాం, నాగేశ్వర్ తో పాటు తెలంగాణ మేధావులను నేను ప్రశ్నిస్తున్నాతెలంగాణ వస్తే బిడ్డల బతుకులు బాగుపడతాయన్నారు.రాష్ట్రం వచ్చినా ఆంధ్రా అధికారుల చేతిలోనే తాళాలు ఎందుకు ఉన్నాయి? దొర ఎంగిలి మెతుకులకు ఆశపడి అల్లం నారాయణ కేసీఆర్ పంచన చేరారు. ఇంత పెద్ద వ్యవస్థకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదా ఉన్న ఒక్క తెలంగాణ బిడ్డ లేడా కేసీఆర్?తెలంగాణ బిడ్డల త్యాగాలను కేసీఆర్ అపహాస్యం చేశారు.విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఎన్ని అవమానాలైనా, ఎన్ని కేసులైనా ఎదుర్కొంటా. తెలంగాణకు పట్టిన చీడ, పీడ కేసీఆర్ కుటుంబమే..ఆ చీడ, పీడను వదిలించే వరకు మా పోరాటం ఆగదు.50లక్షల మంది ఉసురు ఉప్పెనై కేసీఆర్ కుటుంబాన్ని కప్పేస్తుంది.

కెటీఆర్, జనార్దన్ రెడ్డి, అనితా రామచంద్రన్ ను విచారణ చేయాల్సిందేనని సిట్ అధికారులకు స్పష్టం చేశాంరాజకీయ ఒత్తిడులకు అతీతంగా విచారణ చేయాలని కోరాం.రేపు, ఎల్లుండి ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన..25న సాయంత్రం కాకతీయ యూనివర్సిటీలో నిరసన కార్యక్రమాలు ఉంటాయి.మూడు నిర్దిష్టమైన డిమాండ్ల తో భవిష్యత్ కార్యాచరణతో ముందుకెళతాం. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇచ్చిన నోటిఫికేషన్లు, క్వాలిఫై అయిన వారి, ఉద్యోగాలు వచ్చిన వారి వివరాలు వెబ్ సైట్ లో ఉంచేలా చూడాలని అధికారులను కోరాం

LEAVE A RESPONSE