వైసీపీ నేత‌లు.. తాలిబ‌న్ల కంటే ఘోరం

1

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

వైసీపీ నేత‌లు తాలిబ‌న్ల కంటే ఘోరంగా త‌యార‌య్యారు. త‌మ ఇంటి ముందు స్తంభం మార్పించార‌ని మ‌హిళ‌లు అని కూడా చూడ‌కుండా వైసీపీ నేత‌లు అత్యంత దారుణంగా దాడి చేశారు. మ‌హిళ‌ల‌పై హ‌త్యాయ‌త్నం చేసిన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తి గ్రామ సర్పంచ్ నల్లమిల్లి కాంతమ్మ, వైసిపి నాయకుడు పడాల వెంక‌ట‌రెడ్డిలు ఉల్టా బాధిత మ‌హిళ‌ల‌పైనే కేసులు పెట్ట‌డం రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ట‌. మ‌హిళ‌ల‌పై దాడిచేసిన వైసీపీ నేత‌ల‌ని త‌క్ష‌ణ‌మే అరెస్ట్ చేయాలి.