వైసీపీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

2

– సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పంతగాని నరసింహప్రసాద్

చేతకాని సీఎం, అభివృద్ధి ఏంటో తెలియని సీఎం చేసేదేమీ లేక..బలహీన వర్గాలను, మహిళలను, యువతను పలకరిస్తూ వారి బాధలు తెలుసుకుంటున్న లోకేష్ కు వస్తున్న స్పందన చూసి పోలీసులను ఉసిగొల్పుతున్నారు. రోజూ ఏదో ఒక గలాట సృష్టిస్తున్నారు. భద్రత ఏమైనా ఇస్తున్నారా.? వందలాది మంది పోలీసులకు ఏం పని.? ప్రజల్ని భయపెట్టి..మా కార్యకర్తలపై దాడి చేయడం న్యాయమా.? కుప్పంలో బందోబస్తు కల్పించడం విఫలమయ్యారు. ట్రాఫిక్ ఆంక్షలు పెడుతున్నారు..వాహనాలను అడ్డుకున్నారు. వాలంటీర్లను బెదిరించి, దాడులు చేస్తున్నారు. మా కార్యక్రమాలకు రాకుండా ప్రజల్ని అడ్డుకుంటున్నారు. జగన్ కు అంత ఉచ్ఛ పడుతున్నాయా.?

బంగారుపాళ్యంలో బండిపైకి లోకేష్ ను ఎక్కించలేదు. నిబంధనలు ఉల్లంఘించారని వాహనాలు ఎత్తుకెళ్లారు. కార్యకర్తలు, నాయకులపై హత్యాయత్నం కేసులు పెట్టారు. పోలీసులు రౌడీ మూకల్లాగా ఎన్.ఆర్.పేట వద్ద ప్రవర్తించారు. లోకేష్ గొంతు ఏపీ ప్రజలకు వినబడుతుందని భయపడుతున్నారు. వైసీపీ కార్యకర్తలు జగన్ ప్యాంటు చూస్తే తడిసిపోయి ఉంటుంది. తల్లిని, చెల్లిన పక్క రాష్ట్రానికి తరిమాడు. బాబాయిని చంపడానికి గొడ్డలి, అధికారం కోసం కోడి కత్తిని ఉపయోగించుకున్నారు.

పేటీఎం వెదవలు తప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారు. మా నాయకుడే ప్రజల వద్దకు వెళ్తున్నారు. ప్రజల బతుకులపై లోకేష్ ఆశలు చిగురిస్తున్నారు. మంత్రులు ప్రజలకు చేసే కార్యక్రమాలు మర్చిపోతున్నారు. వైసీపీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.