కేసీఆర్ గెలుపు జగన్ గెలుపు..

కేసీఆర్ మేనల్లుడు కంపెనీకి ఏపీ కి చెందిన 18 జిల్లాల ఇసుక తవ్వకాలు కాంట్రాక్ట్..

ఇదీ ఇప్పుడు ముసుగుతొలగించి.. పైకి వచ్చిన అసలు సిసలు పచ్చి నిజం. అవును.. ఇసుక కేసీఆర్-జగన్‌ను మరోసారి కలిపింది.

జగన్ ప్రభుత్వం మీద కేసీఆర్ పార్టీ విమర్శలు అన్నీ ఎన్నికల స్టంట్
మాత్రమే..లోపల వుండే ఫెవికాల్ బంధం అంతే గాఢంగా వుంది. అనాడు జగన్ గెలుపుకు దోహదం చేసింది కేసీఆర్. రాజధాని కూడా లేని నేటి ఆంధ్ర పరిస్థితికి ప్రత్యక్ష కారకుడు జగన్ అయితే పరోక్ష కారకుడు కేసీఆర్.

ఇక్కడ వీళ్ళ పాలన అద్భుతం బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పుకోవడానికి, అప్పుడప్పుడు ఆంధ్రాలో కరెంట్ కోతలు వున్నాయి..రోడ్లు బాలేదు అని తమలపాకుతో చిన్న పాటి విమర్శలు చేస్తూ వుంటారు తప్ప, అసలు సిసలు ఇచ్చి పుచ్చుకోవడం మాత్రం యధాతధంగా జరిగిపోతూనే వుంది.

జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కి కేసీఆర్ రాజ్యసభ ఇచ్చినప్పుడే అర్థం కాలేదా? 2009 లో మరియు 2019 లో ఆంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం నాయకులు వివిధ నియోజకవర్గాలలో గ్రూప్ రాజకీయాలు చేసి.. ఇక్కడ మా ఎమ్మెల్యే మటుకు గెలవకూడదు.. కానీ పైన చంద్రబాబు మటుకు గెలవాలి అని, అతి తెలివి తేటలు చూపించి చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించి, మొదటి సారి కాంగ్రెస్ రెండో సారి వైసీపీ అధికారంలోకి రావడానికి కారణం అయ్యారు.

అలాగే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కూడా ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో కొందరు ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో ఇదే కిరి కిరి మళ్లీ మొదలు పెట్టారు. అబ్బో మా గుండె కోస్తే NTR కనిపిస్తారు..మా చెయ్యి కోస్తే పసుపు రంగు బ్లడ్ వస్తుంది కానీ జగన్ గెలుపుకు దోహదం చేసే కెసిఆర్ అభ్యర్థిని మటుకు గెలిపిస్తాము. కానీ కేసీఆర్ మటుకు ఓడాల్సిందే లాంటి అవకాశ వాద వాదనలు ముందుకు తీసుకు వస్తున్నారు. పైగా దీనికి కులం పేరిట ఒక ముసుగు కూడా తగిలిస్తున్నారు.

ఆంధ్రా ఎంత దుంప నాశనం అయిపోయినా పర్వాలేదు. మా చుట్టాలు- సన్నిహితులు- మా స్నేహితులు ఎంత ఆవేదన అవమానాలు క్షోభ అనుభవిస్తున్నా పర్వాలేదు. కానీ మేము మాత్రం మా వ్యాపారాలు మా ఆస్తులు కాపాడుకోవడం కోసం ఎటువంటి మభ్యపెట్టే మాటలు అయినా చెప్తాము. పైగా దానికి అందంగా కులం తొడుగు తొడుగుతాము అనే వ్యూహాలు సామాన్య ఓటర్ అర్థం చేసుకోవాలి.

మీ ఎమ్మెల్యే గెలుపు కేసీఆర్ గెలుపు.. కేసీఆర్ గెలుపు జగన్ గెలుపు.
ఇది రియలైజ్ అయ్యారా లేదా మీరే ఆలోచించుకోండి..

– రాజేష్ అప్పసాని

Leave a Reply