• లోకేశ్ పై జరిగిన కోడిగుడ్ల దాడి పై పోలీసుల వ్యాఖ్యలు పచ్చిబూటకాలు
• చంద్రబాబు, లోకేశ్, టీడీపీనేతలపై దాడిచేస్తే భావప్రకటనా స్వేచ్ఛా, వైసీపీ వారిపై దాడి జరిగితే హత్యాయత్నమా?
• లోకేశ్ తమతో సెల్ఫీ దిగలేదన్న అక్కసుతో కోడిగుడ్లు విసిరారని చెప్పడం పిచ్చికథే
• ఘటన జరిగిననాడే నిందితుల్ని మీడియా ప్రజలకుచూపిస్తే, వారిని పట్టుకోవడానికి పోలీసులకు వారంపట్టింది
– టీడీపీ అధికారప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి
“పొద్దుటూరులో నారాలోకేశ్ పై కోడిగుడ్లతో దాడిచేసినవారిని పట్టుకోవడానికి రాష్ట్రపోలీసులకు వారంరోజులు పట్టింది. తమతో సెల్ఫీ దిగలేదన్నఅక్కసుతోనే ఇద్దరుయువకులు లోకేశ్ పై కోడిగుడ్లు విసిరారు అంటున్న పోలీసులవ్యాఖ్యలు పచ్చిబూటకంగా ఉన్నాయి.
లోకేశ్ పై టీడీపీనేతలపై వైసీపీమూకలు, కిరాయిగాళ్లు ఎవరుదాడిచేసినా ఇలాంటి పిచ్చికథలే చెబుతారా? చంద్రబాబు పై అమరావతిలో దాడిజరిగిప్పుడు అప్పటి డీజీపీ దాన్ని భావప్రకటన స్వేఛ్చగా అభివర్ణించారు.
అదే టీడీపీ వాళ్లు ఏదైనా దాడి చేస్తే వారిపై మాత్రం 307 కింద హత్యాయత్నం కేసులు పెడుతున్నారు.
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. మరీ ఇంత ఏకపక్షంగా పోలీసులు వ్యవహరించడం నిజంగా సిగ్గుచేటు. పోలీసులకు మీడియా అన్నా, ప్రజలన్నా ఏమాత్రం బెరుకు లేదు.
లోకేశ్ పై దాడి చేసిన వారిని అప్పుడే మీడియా వారు ప్రజలకు చూపించారు. కానీ పోలీసులకు మాత్రం వారం పట్టింది. రాష్ట్రంలో సామాన్యులకు, ప్రతిపక్షాలకు లా అండ్ ఆర్డర్ అమలుకాదు. వైసీపీనేతలు, కార్యకర్తలకోసం మాత్రమే అదిసక్రమంగా పనిచేస్తుంది.
మరీముఖ్యంగా టీడీపీనేతలకు ఏంజరిగినా అది భావప్రకటనస్వేచ్ఛ కిందకే వస్తుంది. లేకపోతే ఏవోకట్టుకథలు అల్లుతారు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు అందరిదీ ఇదేతంతు. తమ విధినిర్వహణ ఏంటనేది పోలీసులు గుర్తించాలి. ప్రజలకోసం పనిచేయాలిగానీ, వ్యవస్థలపరువు తీసేవారికోసం చట్టాల్ని తుంగలో తొక్క వద్దని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం.”