*హత్య చేసిన నాయకులను ఘనంగా ఊరేగిస్తారు… ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు పైసా ఇవ్వరు
*సత్తెనపల్లి సభ సక్సెస్ అయ్యిందనే అంబటి అనే గాడిద ఓండ్రపెడుతోంది
*ఒకరిద్దరు సన్నాసులు తప్ప మిగిలిన కాపులు జనసేన వెంటే ఉన్నారు
*పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పే దమ్ము అంబటికి ఉందా?
*ఎవరో రాసిస్తేపవన్ కళ్యాణ్ చదవరు… ప్రజలు కష్టాల తెలుసుకొని మాట్లాడతారు
*జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్
వైసీపీ అధినాయకుడిలా హత్యా రాజకీయాలు… అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూ దోపిడీలకు పాల్పడటం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి చేతకాదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు పంతం నానాజీ విమర్శించారు. మర్డర్ చేసి జైలుకెళ్లొచ్చిన నాయకులపై పూలవర్షం కురిపించి, ఘనంగా ఊరేగింపులు చేసే సంస్కృతి జనసేన పార్టీలో లేదని అన్నారుపవన్ కళ్యాణ్ వైసీపీలో కొంతమంది గాడిదలు ఉన్నారు అనగానే… నిన్న, ఈరోజు చాలా గాడిదలు మీడియా ముందుకు వచ్చి ఓండ్రపెడుతున్నాయని ఎద్దేవా చేశారు. సోమవారం జనసేన పార్టీ కార్యాలయంలో పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ప్రకాశం జిల్లా పార్టీ ఇంఛార్జి షేక్ రియాజ్ ప్రకటన ఇచ్చారు.
ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ “సత్తెనపల్లి నియోజకవర్గం దూళిపాళ్ల గ్రామంలో నిర్వహించిన జనసేన కౌలు రైతు భరోసా సభకు వచ్చిన జనాధారణ చూసి ఓర్వలేక అంబటి రాంబాబు వంటి కొంతమంది వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రధాన సలహాదారు అనే సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. జనసేన సభకు రాకుండా ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలను అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలే చేసినా… కౌలు రైతు కుటుంబాలు మాత్రం సభకు తరలివచ్చాయి. ప్రభుత్వం గుర్తించిన వారే కౌలు రైతులా? మిగిలిన వారు కాదా? ప్రభుత్వం గుర్తించేటప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య వేల నుంచి లక్షలకు చేరుకుంటుందనే భయంతో పవన్ కళ్యాణ్ వాళ్లను ఆదుకుంటున్నారు. సత్తెనపల్లిలో ఉన్న అంబటి రాంబాబు అనే గాడిదకు మేము ఒకటే చెబుతున్నాం. రాష్ట్ర వ్యాప్త పర్యటన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వాహనానికి వారాహి అని అమ్మవారి పేరు పెట్టుకుంటే.. దానిని హేళన చేసి మాట్లాడావు. దానికి కచ్చితంగా ఫలితం అనుభవిస్తావు.
కాపులు అమ్ముడుపోయే వస్తువులా?
కాపులను అమ్ముడుపోయే వస్తువులా మాట్లాడి అవమానించావు. అంబటి లాంటి ఒకరిద్దరు సన్నాసులు తప్ప మిగిలిన కాపులు జనసేన పార్టీ వెంటే ఉన్నారు. బీజేపీతో పొత్తు అది మా అంతర్గత వ్యవహారం. దాని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. రాష్ట్రానికి పట్టిన వైసీపీ అనే ఏలినాటి శని ఎప్పుడు పోతుందా అని ప్రజలు పూజలు చేస్తున్నార”ని అన్నారు.
పోలవరం అంటే సంజన, సుకన్య ఇంటి పక్కన ఉందా? అని అడిగే గాడిద అంబటి: షేక్ రియాజ్
ప్రకాశం జిల్లా ఇంఛార్జి శ్రీ షేక్ రియాజ్ మాట్లాడుతూ… “వైసీపీలో కొంతమంది గాడిదలు ఉన్నారని సత్తెనపల్లి కౌలు రైతు భరోసా సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడగానే… అందరి కంటే నేనే పెద్ద గాడిదని అని మొదటిగా ఓండ్రపెట్టింది మాత్రం ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబే. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడని ఈ గాడిద మాట్లాడింది… ఈయనే దగ్గరుండి బ్రోకరిజం చేసినట్లు. అసలు పవన్ కళ్యాణ్ కి ప్యాకేజీ ఇచ్చే స్థాయి దేశంలో ఎవరికైనా ఉందా? ఆయన కష్టపడి సంపాదించిన సొమ్మునే కౌలు రైతుల కుటుంబాలకు ఇస్తున్న గొప్ప మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ .
ఏనాడైనా మీ నాయకుడుగానీ, మీరుగానీ ప్రజల కోసం ఒక్క రూపాయి సొంత డబ్బును విరాళంగా ఇచ్చారా? పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారని అడిగితే… ఏమో నాకేం తెలుసు అని సమాధానం ఇస్తాడు. అలాంటి వాడికి ఇరిగేషన్ శాఖ ఇచ్చారు. పోనిలే ఇంకా నయం పోలవరం ప్రాజెక్టు సంజన, సుకన్య ఇంటి పక్కన ఉందా? అని అడుగుతాడేమోనని ప్రజలు అనుమానించారు.నేను చేసిన అవినీతిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట్లాడుతున్నాడు. సత్తెనపల్లిలో వడ్డెర కులానికి చెందిన అనిల్ అనే యువకుడు డ్రైనేజీలో పడి చనిపోతే వాళ్లకు ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల చెక్ ఇస్తే … అందులో రెండున్నర లక్షలు నువ్వు అడిగిన మాట వాస్తవం కాదా? ఇది కాదా శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే. ఇది వాస్తవం కాదు అని నువ్వు చెబితే నువ్వు ఏ రోజు రాజకీయ సన్యాసం తీసుకుంటావో చెప్పు ఆ రోజు ఆధారాలతో సహా బయటపెడతాం. అంబటి పద్దతి మార్చుకోకపోతే రేపల్లె నియోజకవర్గ ప్రజలు ఎలా తరిమికొట్టారో … ఇప్పుడు సత్తెనపల్లి ప్రజలు కూడా తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
సజ్జల గారు మీ స్క్రీప్ట్ ముఖ్యమంత్రి చదువుతారేమో…
వైసీపీని అధికారంలోకి రానివ్వనని అని పవన్ మాట్లాడుతున్నారు… ఎవరికి అధికారం ఇవ్వాలన్నది జనమే నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల మాట్లాడుతున్నారు… సజ్జల గారికి మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం. ప్రజలు ఎవరికి అధికారం ఇవ్వాలో ఆల్ రెడీ డిసైడ్ అయిపోయారు. ఆంధ్రాకు పట్టిన దరిద్రాన్ని తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సంక్షేమ పథకాలు వద్దని ప్రజలు అనుకుంటే జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఆపడం సాధ్యమవుతుందని ఆయన మాట్లాడటం సిగ్గు చేటు.
సంక్షేమ పథకాలు ఇస్తున్నది దేశంలో ఒక్క వైసీపీ పార్టీయే కాదు. గతంలో పాలించిన అన్ని ప్రభుత్వాలు బడుగు, బలహీన, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాయి. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా సజ్జల గారు మాట్లాడుతున్నారు. పవన్ ఎవరి తరఫున మాట్లాడుతున్నారో అర్థం అవుతుందని ఆయన అంటున్నారు… తెలుగుదేశం పార్టీ అవినీతిపై మొట్ట మొదటి సారి 2018 మార్చి 14న మంగళగిరి జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఎండగట్టింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు అవినీతిపై పుస్తకం విడుదల చేసిన వైసీపీ నాయకులు… అధికారంలోకి వచ్చాక ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు మీరు కలిసిపోయి రాష్ట్రాన్ని దోచుకున్నది చాలదు అన్నట్లు… ఇప్పుడు జనసేనపై నిందలు వేస్తున్నారు.
అవినీతి గురించి జగన్ మాట్లాడటం హాస్యస్పదం
దేశంలోనే అత్యంత అవినీతిపరుల జాబితాలో నంబర్ వన్ గా ఉన్న జగన్..అవినీతి చేయడానికి వీల్లేదంటూ తన మంత్రులకు హుకుం జారీ చేయడం హాస్యస్పదం. అవినీతి గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. కౌలు రైతులకు అండగా నిలబడిన ప్రభుత్వం తమదే అని సజ్జల మాట్లాడుతున్నారు… నిజంగా కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకుంటే మూడువేల మంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు. సజ్జల మీరు నిజంగా రాయలసీమ బిడ్డే అయితే కౌలు రైతు భరోసా యాత్ర జరుగుతున్న ప్రాంతంలో పర్యటించి బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాల ఆర్తనాదాలు ఒక్క సారి వినండి మీకే అర్ధమవుతుంది. మీరు రాసిచ్చిన స్క్రిప్ట్… ముఖ్యమంత్రి, మీ పార్టీ నాయకులు చదువుతారేయో కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ అవసరం లేదు. ఆయన ప్రజల కష్టాలు దగ్గరుండి తెలుసుకొని మాట్లాడతారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని నాయకులను చెప్పులు, చీపుర్లతో కొట్టాలని గతంలో ముఖ్యమంత్రే మాట్లాడారు. ఆ పరిస్థితి తర్వలోనే వైసీపీ నాయకులు వస్తుంద”ని హెచ్చరించారు.