-సొంతబాబాయిని గొడ్డలితో చంపిన వాళ్ల నాయకుల్ని వైసీపీ కార్యకర్తలు ఆదర్శంగా తీసుకున్నారు
-ఎన్నికల సంఘం వైసీపీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలి
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
వైసీపీ రాక్షస జాతికి చెందినపార్టీ. అధికారం కోల్పోతున్నారన్న అక్కసుతో వైసీపీ రాక్షస మూకలు నరమేధం సాగిస్తున్నాయి. గిద్దలూరు నియోజకవర్గం గడికోటలో టీడీపీ నాయకుడు మూలయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కార్యకర్తలపై దాడులు చేసినవారిని, హత్యలు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు.
చిలకలూరిపేట ప్రజాగళం సభకు గ్రామం నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తరలించాడన్న అక్కసుతో వైసీపీ రాక్షస మూకలు గొడ్డలితో నరికి చంపారు. సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపిన వాళ్ల నాయకుల్ని వైసీపీ కార్యకర్తలు ఆదర్శంగా తీసుకున్నారు. ఎన్నికల సంఘం వైసీపీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలి. మూలయ్య హత్య నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మూలయ్య కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుంది.