తెలంగాణ ఇన్చార్జి గవర్నర్ గా సి.పి రాధాకృష్ణన్

హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో ఈ క్రమంలో ఝార్ఖండ్ గవర్నర్ సి .పి రాధాకృష్ణన్ ను ఆ పదవిలో తాత్కాలికంగా నియమించారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త గవర్నర్ ను నియమించేందుకు వీల్లేదు. దీంతో రాధాకృష్ణన్ కే తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఇక పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తాత్కాలిక బాధ్యతల్ని కూడా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి రాధాకృష్ణన్ కే ఇచ్చారు

Leave a Reply