చిన్నజీయర్ స్వామిని కలిసిన కేంద్రమంత్రి

హైదరాబాద్:శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో చిన్నజీయర్ స్వామిని కేంద్ర పర్యాటకశాఖమంత్రి కిషన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం కలిశారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి ఆశీస్సులను ఆయన తీసుకున్నారు. అనంతరం ఫిబ్రవరిలో జరగనున్న రామానుజ శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్ల వివరాలను చిన్నజీయర్ స్వామిని అడిగి కిషన్‌రెడ్డి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా పాల్గొన్నారు. వీరి సమావేశం సుమారు 40 నిమిషాల పాటు జరిగింది.

కాగా ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో రామానుజచార్య 1000వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా 216 అడుగుల రామానుజాచార్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. ఈ ఉత్సవాల సంద‌ర్భంగా ఫిబ్రవరి 5వ తేదీన ప్రధాని న‌రేంద్ర మోదీ హైదరాబాద్ విచ్చేసి రామానుజాచార్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 8, 9వ తేదీల్లో దేశ వ్యాప్తంగా ఉన్న సాధుసంతువుల‌తో ధర్మ సమ్మేళనం నిర్వహిస్తారు. కాగా చిన్నజీయర్ స్వామి ఆశ్రమం హైదరాబాద్ నుంచి 30 కి.మీ. దూరంలో…. కర్నూలు వెళ్లే దారిలో ముచ్చింతల్‌లో ఉంది.

Leave a Reply