ప్రముఖ జర్నలిస్టు విద్యారణ్య ఆకస్మిక మృతిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ,హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వారేమన్నారంటే… సీనియర్ జర్నలిస్ట్ sakal దినపత్రికలో పనిచేస్తున్న విద్యారణ్య ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. క్రమశిక్షణ జాతీయ భావజాలం తో జీవితకాలం పని చేసిన వ్యక్తి ఆకస్మికంగా మరణం రావడం చాలా బాధాకరం వారితో అనేక సంవత్సరాలుగా ఆత్మీయంగా పలకరించుకునే వ్యక్తుల్లో వారు ఒకరు. వారి మరణం పత్రిక రంగానికి తీరని లోటు.
విద్యారణ్య మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారితో ఎన్నో సంవత్సరాల అనుబంధముంది. జాతీయ భావాలు కలిగిన వ్యక్తి. అనేక విషయాలలో వారితో చర్చించే వాళ్ళం. తెలుగు హిందీ పత్రికలలో పని చేసిన వ్యక్తి. అనేక సామాజిక కార్యక్రమాల్లో బాధ్యతగా పని చేసేవారు. అనేక సేవా కార్యక్రమాలు చేసేవారికి తన వంతు ఆర్థిక సహాయం తో పాటు సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా ఉండే వ్యక్తి. వారి మరణం పత్రికా రంగానికి జాతీయ భావాలు కలిగిన వ్యక్తులకు తీరని లోటు. శ్రీ విద్యారణ్య మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
జాతీయ వాద భావాలు కలిగిన వ్యక్తి. ఆత్మీయులు. అనేక విషయాలలో వారి సూచనలు సలహాలు ఎంతో అమూల్యమైనవి. అనేక దినపత్రికలలో పని చేశారు. జాతీయ భావజాలంతో పనిచేసే వ్యక్తి తెలుగు హిందీ భాష దినపత్రికల్లో రాణించిన వ్యక్తి . ఏ పత్రిక లో పనిచేసినా అందరి ఆదరాభిమానాలు చూరగొన్నారు. క్రమశిక్షణతో తోటివారిని సమాజం పట్ల బాధ్యత గౌరవాన్ని నేర్పే వ్యక్తి. వారి మరణం పత్రికా రంగానికి, జాతీయ భావజాల వ్యక్తులకు తీరని లోటు.