– మంత్రి హరీష్ రావు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. అబద్దాలు మాట్లాడటం లో మిగతా బీజేపీ నేతలతో కిషన్ రెడ్డి పోటీ పడుతున్నారు. అబద్దాలని మేము చెబుతున్నా సోషల్ మీడియాలో ఇంకా బీజేపీ నేతలు వాటిని ప్రచారం చేస్తున్నారు. వరి ,సిలిండర్, కేసీఆర్ కిట్ ఇలా అన్ని అంశాల్లో బీజేపీవి అబద్ధాలే.
కిషన్ రెడ్డి మెడికల్ కళాశాలల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.ఎయిమ్స్ కు బీబీ నగర్ లో మేము స్థలమే ఇవ్వలేదని బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారు. మేము నిమ్స్ కోసం స్థలం భవనాన్ని ఏర్పాటు చేసుకుని ఎయిమ్స్ కు ఇచ్చాము.ఇలా ఇచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణే కావచ్చు.బీబీ నగర్ ఎయిమ్స్ కు 24 ఎకరాల స్థలమిచ్చాము.. ఇదిగో దానికి సంబంధించిన జీవో విడుదల చేస్తున్నాం. ఇలా పచ్చి అబద్దాలు మాట్లాడిన కిషన్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి.
గోబెల్స్ ను మించి పోతున్నారు బీజేపీ నాయకులు.మెడికల్ కళాశాల విషయం లో తెలంగాణ కేంద్రం తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపలేదు అని కిషన్ రెడ్డి మరో పచ్చి అబద్ధం చెప్పారు. laxma reddy కేంద్ర మంత్రి గా ఉన్నపుడు ఎన్నో సార్లు ఢిల్లీ వెళ్లి మెడికల్ కళాశాలల గురించి మాట్లాడారు.
ఫేస్ వన్ ఫేస్ టూ లో కాలేజి లు ఇవ్వమని ఫేస్ త్రీ లో ఇస్తామని అప్పటి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ హామీ ఇచ్చినా నెరవేరలేదు.మేము అడగక పోతే హర్షవర్ధన్ లేఖ ఎందుకు రాస్తారు. యూపీ కి 27 మెడికల్ కాలేజి లు ఇచ్చి తెలంగాణ కు ఇవ్వకపోవడం మా పట్ల సవతి తల్లి ప్రేమ, అవమానం ప్రదర్శించడం కాదా?
ఎయిమ్స్ మీరు ఇవ్వడం ఏమిటీ. అది విభజన చట్టం కింద ఇచ్చిన హామీ.కిషన్ రెడ్డి కి దమ్ముంటే విభజన చట్టం కింద ఇచ్చిన హామీలు అమలు చేయించాలి.గతం లో తెలంగాణ ప్రజలకు ఎర్రబస్సు తప్ప ఏమీ తెలియదని కిషన్ రెడ్డి అవమాన కరంగా మాట్లాడి అభాసు పాలయ్యారు.కిషన్ రెడ్డి పూర్తి సమాచారం తో మాట్లాడాలి… మంచి టీం ను పెట్టుకోవాలి. నవోదయ స్కూళ్లు ఎందుకు ఇవ్వరు.
ఈ రోజు బీజేపీ వాళ్ళు ఎందుకు ధర్నా చేసినట్టు… వారి ధర్నాలో రైతులు లేరురైతులకు బీజేపీ నిజ స్వరూపం అర్థమైంది.కిషన్ రెడ్డి యాసంగి గురించి మాట్లాడకుండా వానాకాలం ధాన్యం సేకరణ గురించి మాట్లాడుతున్నారు.పారా బాయిల్డ్ రైస్ వచ్చేదే యాసంగి లో.. కొంటామని కిషన్ రెడ్డి చెప్పాలి. బురద జల్లడమే బీజేపీ కిషన్ రెడ్డి పనా?
కేంద్రం ఇవ్వకున్నా కేసీఆర్ కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారు.ఉమ్మడి రాష్ట్రం లో ఐదు మెడికల్ కళాశాలలు ఉంటే ఇపుడు21 చేసుకున్నాం.ఏడు వందల మెడికల్ సీట్లను నాలుగు వేలకు పెంచుకున్నాం. ఇంకా 12 మెడికల్ కళాశాలల అవసరం ఉంది. కిషన్ రెడ్డి కి చేతనాయితే ఆ మెడికల్ కళాశాలలు తెపించాలి. 40 శాతం నిధులు భరిస్తాం.నేను కిషన్ రెడ్డి కి ఏ సమాచారం కావాలన్నా ఇస్తా. ఎపుడూ రమ్మన్నా వస్తా.. తెలంగాణ ప్రయోజనాలు మాకు ముఖ్యం. రాజ్యాంగ బద్ధ పదవి లో ఉన్న కిషన్ రెడ్డి అబద్దాలు మాట్లాడ కూడదు.
కేంద్ర రాష్ట్ర బీజేపీ నేతల మధ్య సమన్వయం లేదు.రేపటి ధర్నాలు ప్రారంభం మాత్రమే. వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతుంది.బట్ట కాల్చి మీదెయ్యడం బురద జల్లడం మంచిది కాదు.కిషన్ రెడ్డి వడ్లన్నీ కొంటామని ఆర్డర్ తెస్తే ఎయిర్ పోర్టు కు వచ్చి సన్మానం చేస్తాం.బీజేపీ అబద్దాలు ఎల్ల కాలం నిలవవు.ప్రజలు బీజేపీ అబద్ధాలను నమ్మే స్థితిలో లేరు.
పంజాబ్ లో కొంటారు ఇక్కడ ఎందుకు కొనరు.విదేశాంగ విధానం మార్చి బియ్యం ఎగుమతి నిబంధనలు మార్చండి.పారిశ్రామిక వేత్తలకు ఎన్నో సబ్సిడీలు ఇచ్చే కేంద్రం రైతులకు ఎందుకు ఇవ్వరు. నష్టాలు ఎందుకు భరించరు. కేంద్రం ధాన్యం పై యూ టర్న్ తీసుకోవడం వల్లే సమస్య.