Home » కోట్లాది మందిని కాపాడిన కేకే

కోట్లాది మందిని కాపాడిన కేకే

– వైకాపా కుటుంబాలను రోడ్లమీద పడకుండా కాపాడిన దేవుడు
(ఏ.బాబు)

అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు, వైకాపా గెలుస్తోంది అని ఎగ్జిట్ ఫలితాలు చెప్పిన ఆరా మస్తాన్.. సొంత ఊర్లో టిడిపికి 637 ఓట్లు, వైసీపీకి 313 ఓట్లు పడ్డాయి. చిలకలూరిపేట మద్దిరాల ఆయన ఇంటి ఎదురుగా తెలుగు యువత వారు కేకే సర్వే ఎగ్జిట్ ఫలితాలను వెల్లడించిన కిరణ్ కొండేటికి కంగ్రాట్స్ చెబుతూ ఫ్లెక్సీ పెట్టారు.

ఆరా మస్తాన్ సర్వేలో ఏమొచ్చిందో ఏమో గానీ, ఆయన వైకాపా పార్టీలో గతంలో పనిచేశాడు కాబట్టి, అమ్ముడుపోయాడో ఏమో గానీ, ఈనెల ఒకటో తేదీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పాడు. దానిని చూసి వేలాదిమంది బెట్టింగ్ వ్యసనం వున్న వైకాపా అభిమానులు పందేలు కాశారు. తాహతుకు మించి పెడుతుంటారు. ఇది వేల కోట్ల యవ్వారం.

అంతకు ముందే, చాలా మంది వైకాపా అభిమానులు, స్వయంగా జగన్ గత ఎన్నికల్లో గెలిచిన 151 కంటే ఎక్కువగా.. వైనాట్ 175 లెక్కన కూడా గెలుస్తున్నామని.. ఐప్యాక్‌తో జరిగిన మీటింగులో నమ్మకంగా కోసిన కోతలు నమ్మి బెట్టింగుల్లో లక్షలు & కోట్లు కాశారు.

జగన్‌తో పాటు ఆరామస్తాన్ కలిసి మోసం చేశాడో ఏమో.. కౌంటింగ్ ఏజెంట్ల కోసం, సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా మరింత నమ్మకంగా, దుర్మార్గంగా మోసగిస్తూ.. వైకాపా శ్రేణులు సిద్ధం కండి అని పిలుపునిచ్చారు.

ఇక జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి 9వ తేదీ పొద్దున విశాఖపట్నంలో ప్రమాణస్వీకారం ఏర్పాట్లు చేస్తున్నాం అంటూ వర్జ్యం వున్న ముహూర్తం ప్రకటించాడు.

తప్పుడు సజ్జల కొడుకు పిల్ల సజ్జల సోషల్ మీడియాలో, వైకాపా శ్రేణులు రూములు బుక్ చేయడంతో, విశాఖపట్నంలో రూములు దొరకడంలేదు, బస్సు టికెట్లు, విమానాల టికెట్లు దొరకడం లేదు, ప్రమాణస్వీకారంలో వంటల మెనూ అంటూ చికెన్ పొంగల్ కూడా వుంటుంది అంటూ.. వైకాపా సోషల్ మీడియాలో హోరెత్తించారు.

అది నమ్మి ఎన్ని వేల కుటుంబాలు బెట్టింగులు కట్టి నాశనం అయినా.. తమ ఇగో కోసం, కౌంటింగ్ ఏజెంట్లను రప్పించడం కోసం తప్పుడు ప్రచారం చేసి వైకాపా అభిమానులను నమ్మించారు.

సరిగ్గా ఆరా మస్తాన్ సర్వే ఫలితాల సమయంలో, కేకే సర్వే టిడిపి కూటమి సునామీలా గెలుస్తోంది అనే సర్వే ఫలితాలు ప్రకటించాడు. అలాగే జాతీయ మీడియా కూడా ప్రకటించింది. కానీ పదుల సంఖ్యలో ఊరూపేరు లేని సర్వేలు సాక్షిలో, వైకాపా సోషల్మీడియాలో ఎగ్జిట్ ఫలితాల పేరుతో పదే పదే ఫేక్ ఫలితాలు ప్రచురించి, ప్రచారం చేశారు.

కేకే సర్వేలో మాత్రం కాన్‌ఫిడెంట్‌గా.. తమ సర్వే విధానాన్ని, దాని శాస్త్రీయతను, తీసుకొన్న శాంపిల్ డాటా, డాటా సెట్స్ తో చక్కగా వివరిస్తూ.. బల్లగుద్ది చెప్పాడు. అది కూడా పరిగణలోకి తీసుకొని నమ్మిన వైకాపా అభిమానులు, బెట్టింగులు పెట్టకుండా.. రోడ్డున పడలేదు. మిగిలిన వందలాది కుటుంబాలు రోడ్లమీద పడ్డాయి. ఒక గ్రామంలో 5 కోట్ల రూపాయల బెట్టింగులు జరిగింది అంట. చాలామంది వెనకబడిన అట్టడుగు కుటుంబాలు, జీవితం అంతా సంపాయించినా తీర్చలేనంత పెట్టి నాశనం అయ్యారట. ఎన్నికల ఫలితాల తరువాత చాలామంది ఆత్మహత్యలకు కారణం ఈ బెట్టింగులే అని చెబుతున్నారు.

ఒక రకంగా ఈ కేకే ఎంతోమందిని కాపాడాడు. లేదంటే వేలాది కుటుంబాలు వైకాపా & ఆరాను నమ్మి ఆరిపోయేవి. వైకాపా అభిమానులు పెట్టాల్సిన ఫ్లెక్సీని, తెలుగు యువత పెట్టడం అభినందనీయం.

Leave a Reply