-పోలీసులపై సలీం కుటుంబసభ్యుల అనుమానం
-తాడేపల్లికి వచ్చిన సలీం భార్య
-న్యాయవాదుల ఆందోళన
-హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్?
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జగన్ కోడికత్తి కేసులో ఒక అనూహ్య మలుపు. జగన్‌పై కోడికత్తితో దాడి చేసి జైలులో మగ్గుతున్న శీను కోసం.. న్యాయపోరాటం చేస్తున్న లాయర్ సలీం, హటాత్తుగా మాయమైపోవడం సంచలనం సృష్టిస్తోంది. తాడేపల్లిలోని తన మిత్రుడు, హైకోర్టు న్యాయవాది అయిన శ్రీనివాస్‌ను కలిసేందుకు వచ్చిన సలీం, ఆ తర్వాత కనిపించకపోవడం ఆయన కుటుంబసభ్యులను ఆందోళనకు గురిచేసింది.
ఆయన ఫోన్ కూడా స్విచ్చాఫ్ ఉండటంతో ఆయన భార్య, కొడుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోడికత్తి శీను కేసు వాదిస్తున్నప్పటి నుంచీ, బెదిరింపులు వస్తున్నాయని ఆమె వెల్లడించారు. కాగా తమకు పోలీసులపైనే అనుమానాలు ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. తన భర్తను తనకు చూపించాలని ఆమె డిమాండ్ చేశారు.
కాగా ఈ ఘటనపై న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక లాయర్‌కే రక్షణ కల్పించలేని ప్రభుత్వం సామాన్యులకు ఏం రక్షణ ల్పిస్తుందని ప్రశ్నించారు. తక్షణం లాయర్ సలీంను హాజరుపరచాలని డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా తన భర్త నిపించడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న సలీం.. భార్య దానికి సంబంధించి, హైకోర్టులో హెబియస్‌కార్పస్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.