Suryaa.co.in

Andhra Pradesh

భయంతోనే కొల్లి రఘురామిరెడ్డి ఫైల్స్ ను తగలబెట్టించాడు

-అసోంకు వెళ్తాడని ముందే తెలిసి తన అవకతవకలు బయట పడతాయన్న భయం కొల్లి రఘురామిరెడ్డికి ఏర్పడింది
-తప్పుచేసిన ఏ ఒక్క అధికారిని ఉపేక్షించేది లేదు
-అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులు ఇకనైనా వారి తీరును మార్చుకోవాలి
-సిట్ కార్యాలయంలో హెరిటేజ్ సంస్థకు సంబంధించిన ఫైల్స్ దగ్ధంపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం
– తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య

కీలకమైన కేసుకు సంబంధిన పలు కీలక ఫైల్స్ ను సిట్ కార్యాలయంలోనే దగ్ధం చేసారంటే పోలీసులు ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నారో అర్ధమవుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరిలోని తెదెపా జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ….

ముందు జాగ్రత్త చర్యగా కొల్లి రఘురామి రెడ్డి ఫైల్స్ ను దగ్ధం చేశారు…
“పోలీసుల పనితీరు పారదర్శకతను కోల్పోయింది. పోలీసు అధికారుల వ్యవహార శైలి చాలా బాధాకరంగా ఉంది. పోలీసుల అధికారులు చేస్తున్న ప్రమాణాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. పోలీసుల తీరును రాష్ట్ర ప్రజలు అనుమానిస్తున్నారు. సిట్ అధికారిగా ఉన్న రఘురామిరెడ్డి ఫైల్స్ తగలబెట్టించడం సిగ్గుచేటు. కావాలనే కొల్లి రఘురామిరెడ్డి ఫైల్స్ ను తగలబెట్టించాడు. కొల్లి మీద వ్యతిరేకత ఉన్న ఎవిడెన్స్ ఫైల్స్ అవి. ముందు రోజే ఢిల్లీ నుండి రఘురామిరెడ్డికి ఫోన్ వచ్చింది. అసోం పోలీస్ అబ్జర్వర్ గా కేంద్ర ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసింది.

ఈలోపు కూటమి అధికారం వస్తే రఘురామిరెడ్డికి తన అవకతవకలు బయట పడతాయని భయం ఏర్పడింది. జిరాక్స్ తీస్తుంటే ఇంకు అయిపోయిందని, జిరాక్స్ మిషన్ లో ఇరుక్కు పోయాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇది కావాలని చేసిన కుట్రే. సీఐడీ ఆఫీస్ లో ప్రింటర్ మిషన్ కు ఇంకు ఐయిపోతుందా.. ? ఎప్పుడో ముద్దాయిలకు ఇచ్చిన ఫైల్స్ అవి. ఆ పేపర్స్ బయటపడితే ఆయన మీద వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు బయటకు వస్తాయని తగలబెట్టించారు. తలబెట్టిన పేపర్స్ కూడా ఎవరికి తెలియదటా..? తగలబెట్టి ఆయనకు ఆయన అటెండర్ కు మాత్రమే తెలుసట..? ఇది విడ్డూరంగా ఉంది.

మిగిలిన అధికారులు ఏమైనట్లు… ? ఆ కేసును విచారణ చేస్తున్న అధికారులకు తెలుసా..? మీ ఎస్పీకి తెలుసా.. ?తప్పుడు కేసుల్లో చంద్రబాబును అరెస్ట్ చేసిన వ్యక్తి ఇతనే. వీళ్లు క్రియేట్ చేసిన కేసులో వీళ్లు సేకరించిన దొంగ సాక్ష్యాలతో మా అధినేత చంద్రబాబును 52 రోజులు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైళ్లో ఉన్నారు. ఈ కేసులో ఫైళ్లను తగలబెట్టినట్లుగా మాకు అనుమానంగా ఉంది. అందుకే ఛీఫ్ ఎలక్ట్రోల్ అధికారిని కలిసి ఫిర్యాదు చేశాం. దీని గురించి డీజీపీ ఎందుకని ఏమి మాట్లాడలేదు? దీనిపై వెంటనే డిటైల్డ్ ఎంక్వై,రీ చేయాలి. దాంతో పాటు చీఫ్ సెక్రటరేట్ కి ఎన్నికల సంఘం డైరెక్షన్ ఇవ్వాలి.

ఎలక్షన్ అయిపోయే వరకు ఏ ఆఫీసులో కూడా ఏ ఫైలు ధ్వంసం చేయడానికి వీళ్లేదు. ఎలక్షన్ అయిన తరువాత కొత్త ప్రభుత్వంలో చర్యలు తీసుకోవాలని కోరాం. ఫైళ్లు తగలబెట్టిన విజువల్ ను చీఫ్ ఎలక్ట్రల్ ఆఫిసర్ కు చూపిచాం. ఆయన సానుకూలంగా స్పందించి సీఎస్ కు లెటర్ రాస్తామని చెప్పారు. దీనిపై గవర్న్ ను కలుస్తాం. తెలంగాణ అధికార మార్పిడి జరిగినప్పుడు ముఖ్యమైన ఫైల్స్ వెళ్లిపోయినట్లు ఇక్కడ కూడా అదే జరుగుతున్నట్లు అనుమానంగా ఉంది” అని వ్యక్తం చేశారు.

ఫైల్స్ దగ్ధంపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం…
“తెలంగాణాలో హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేసి మూసీనదిలో విసిరి వేసినట్లు ఇక్కడ కూడా అలానే చేస్తారేమో…! అక్కడ ఫోన్ ట్యాపింగ్ చేసి అధికారులు ఎలా జైళ్లకు వెళ్లారో, కొంతమంది ఎలా విదేశాలకు పారిపోయారో ఇక్కడ కూడా అలానే జరిగేట్లు ఉంది…! అనుమానించ తగిన అధికారులు విదేశాలకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. దీనిపై గన్నవర్ ను కలిసి వెంటనే అన్ని వవరాలు తెలియజేస్తాం.

ఫైళ్లను తగబెట్టడంపై వెంటనే డీజీపీ ఎంక్వైరీ జరిపించాలి. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం రఘురామిరెడ్డి చేసింది నేరం. పోలీసు అధికారులు చట్ట పరిధిలో వ్యవహరించాలి. బరిదాటి వ్యవహరిస్తే తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు పట్టిన గతే పడుతుంది. ఇకనైనాఫోన్లు ట్యాప్ చేస్తున్న అధికారులు వెంటనే మానుకోవాలి” అని వర్ల రామయ్య హెచ్చరించారు.

LEAVE A RESPONSE