Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి, విడదల రజని చెలగాటం

-బోర్డులు తిప్పేసిన ప్రైమరీ హెల్త్ సెంటర్లు
-అంబులెన్స్ కొనుగోళ్లంటూ రూ.307 కోట్లకు టోకరా
-వైసీపీ పాలనలో గిరిజన గ్రామాల్లో పరిస్థితి దారుణం
-ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీని చేసిన జగన్ రెడ్డి
-టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య

పేదల బతుకులతో జగన్ రెడ్డి, విడదల రజని చెలగాటం ఆడుతున్నారంటూ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం నుండి ఆయన మాట్లాడుతూ.. కోట్లకు టోకరాపెట్టి… ప్రజల ప్రాణాలతో జగన్ సర్కార్ చెలగాటం ఆడుతుందంటూ విమర్శించారు.

ఏపీలో ఏ1 జగన్.. ఏ2 విడదల రజని చర్యలతో ఆరోగ్య శాఖ నిర్వీర్యమైందని.. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. వైసీపీ పాలనలో గిరిజనులకు వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం అందక రాష్ట్ర ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా.. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వైద్య సేవలకు అంబులెన్స్ ల కొనుగోళ్లంటూ రూ.307 కోట్లు విజయసాయి రెడ్డి అల్లుడికి కట్టబెట్టి..సరైన సమయంలో వైద్య సదుపాయాలు అందించకుండా ప్రజల ప్రాణాలు తీస్తున్నారంటూ విమర్శించారు.

నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలన్న జగన్ రెడ్డి వారి ప్రాణాలనే తీస్తున్నారంటూ ఆగ్రహించారు. తన వర్గానికి మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి మిగిలిన వారికి అన్యాయం చేశారన్నారు. జగన్ చర్యలతో ప్రైమరీ హెల్త్ సెంటర్లు బోర్డులు తిప్పేసే పరిస్థితి వచ్చిందన్నారు. అంకెల గారెడితో జగన్ రెడ్డి పేద ప్రజలను వంచించారన్నారు.. ఆసుపత్రుల్లోమందులు లేకుండా, వైద్యులను నియమించకుండా, ప్రజలకు వైద్య సదుపాయాలు అందకుండా చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. వైద్య రంగం మూల సూత్రంతో టీడీపీ పనిచేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించిందని గుర్తు చేశారు.

33 పథకాలతో పేదల ఆరోగ్యానికి చంద్రబాబు చేసిన కృషి మరువలేనిదన్నారు. కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవా విధానంతో ప్రజలకు అందించిన వైద్యం అనిర్వచనీయమన్నారు. తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ వంటి గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పేద ప్రజలకు ఎనలేని వైద్య సేవలను అందించినట్లు తెలియజేశారు. నేడు వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తూ ప్రజా ఆరోగ్యానికి కేటయించిన డబ్బులను పక్కదారి మళ్లించిందన్నారు.
.
గిరిజన గ్రామాలకు రోడ్లు వేయకుండా, వైద్య సదుపాయాలు అందకుండా చేసి ప్రజల ప్రాణాలను జగన్ రెడ్డి తీస్తున్నారంటూ వేమూరి ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతూ… ప్రజల ప్రాణాలు తీస్తున్న సైకో ప్రభుత్వానికి ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని అన్నారు.

LEAVE A RESPONSE