Suryaa.co.in

Andhra Pradesh

ఏబీ కేసులో సుప్రీం ఆదేశాల ఉల్లంఘన

-క్యాట్ లో ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పైన జరుగుతున్న వాదనలు
-డీజీపీ ఏబీ తరపున వాదనలు పూర్తి చేసిన ఆదినారాయణ

ఒక సారి డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై సుప్రీం కోర్టు ఆర్డరు ఇచ్చినా కూడా, ప్రభుత్వం కక్ష కట్టినట్టు వ్యవహరించి, క్రొత్తగా మరొక సారి క్రిమినల్ కేసు పేరుతో అవే ఆరోపణలు తో సస్పెండ్ చేయడం అన్యాయం అని ఏబీ తరపు న్యాయవాది ఆదినారాయణ అన్నారు.

దీనిపై అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ.. ఆల్ ఇండియా సర్వీసు డిసిప్లిన్ రూలు 3(3) ప్రకారం క్రిమినల్ కేసు పైన కోర్టులు నిర్దిష్టమైన అభిప్రాయం తెలియ చేసే వరకు, సస్పెన్షన్ కొనసాగించటం ప్రభుత్వం హక్కు అని అన్నారు. సాక్షుల ను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న విషయం గమనించాలి అన్నారు.

ట్రిబ్యునల్ స్పందిస్తూ అన్ని జరుగుతుంటే ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దుకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటో చెప్పాలని, ఈ విషయాల గురించి సస్పెన్షన్ ఆర్డర్ లో ఎందుకు రాయలేదో తెలియట్లేదు అని అన్నారు. ఆయనను రెండో సారి సస్పెన్షన్ చేసిన విధానానికి సంబంధించిన ఫైలు తమకు అంద చేయాలని ఆదేశించారు.

LEAVE A RESPONSE