తన వాళ్ల సంస్థల నుంచి విద్యుత్ కొనడం వంటి జగన్ స్వార్థ నిర్ణయాలు విద్యుత్ రంగాన్ని, ప్రజల్ని నిండా ముంచాయి

• 2014 నుంచి 2019మధ్య రాష్ట్రంలో ఒక్కోకుటుంబం ఎంత విద్యుత్ ఛార్జీలు చెల్లించింది.. ఈ 4 ఏళ్లనుంచి ఎంత చెల్లిస్తోందో ప్రభుత్వం చెప్పాలి
• ఈ వివరాలు బయటపెడితే ప్రజలనెత్తిన ఈప్రభుత్వం ఎంతభారంవేసిందో అర్థమవుతుంది
• ప్రజలపై రూ.57వేలకోట్ల విద్యుత్ ఛార్జీలభారం పడటానికి ప్రధానకారణం జగన్మోహన్ రెడ్డి, ఆయనసర్కార్ అవినీతి నిర్ణయాలే
• ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమంకంటే విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలనుంచి ఆయన దోచుకుంటున్నదే ఎక్కువ
– పీ.ఏ.సీ ఛైర్మన్, టీడీపీ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్

తన అసమర్థత, కమీషన్లకక్కుర్తి, నాసిరకం బొగ్గుకొనుగోళ్లతో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి 7సార్లు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపాడని, రూ.57వేలకోట్ల అద నపు భారాన్నిసామాన్యుడి నెత్తిమీద వేశాడని, ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమంకంటే, ఆయన ప్రజలనుంచి విద్యుత్ ఛార్జీలరూపంలో దోచుకుంటు న్నదే ఎక్కువని టీడీపీ శాసనసభ్యులు, పీ.ఏ.సీ ఛైర్మన్ పయ్యావులకేశవ్ తెలిపారు. తన నివాసం నుంచి గురువారం జూమ్ ద్వారా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …!

“ట్రూఅప్ ఛార్జీలు, ఇంధనసర్ ఛార్జీలంటూ రకరకాలపేర్లతో నేరుగా యూనిట్ ధరలుపెంచకుండా సామాన్యుల్ని దోచుకుంటున్నారు. జగన్ పాలనలో సామాన్య , పేద, మధ్యతరగతివర్గాల విద్యుత్ వాడకం పెరగలేదు. కానీ విద్యుత్ ఛార్జీలభా రం మాత్రం ఎక్కువైంది. తక్కువధరకు విద్యుత్ లభిస్తున్నా దాన్నికాదని ప్రభు త్వం అధికధరకు తమకు అనుకూలంగా ఉండేవారినుంచి కొంటోంది. దానివల్ల సామాన్యప్రజలతో పాటు విద్యుత్ డిస్కంలు కూడా భారీభారాన్ని మోయాల్సిన పరిస్థితి. నాసిరకం బొగ్గుకొని దాంతో విద్యుత్ తయారుచేయడం వల్ల పదేపదే థర్మల్ కేంద్రాల్లో సాంకేతికసమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి.

హిందుజాసంస్థ నుంచి ఈప్రభుత్వం ఒక్కయూనిట్ విద్యుత్ కొనకపోయినా, ఒప్పందంప్రకారం ఆసంస్థకు అప్పనంగా రూ.2,200కోట్లు చెల్లిం చాల్సిన పరిస్థితి. ఈ చెల్లింపులకు సంబంధించి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసే అవకాశమున్నాకూడా ప్రభుత్వం డబ్బుచెల్లించడానికే సిద్ధపడింది. కేవలం తమకు వస్తున్నకమీషన్లకోసమే ప్రభుత్వం హిందుజాసంస్థకు ఊరికే దోచిపెడు తోంది. హిందుజాసంస్థనుంచి విద్యుత్ కొనకుండా, కమీషన్లకోసం బయట అధిక ధరకు విద్యుత్ కొని, ఇటుహిందుజాసంస్థకు, అటుబయటసంస్థకు డబ్బులు క డుతున్నారు. అలానే ఇండోస్ సోలార్ సంస్థ విషయంలోకూడా ప్రవర్తిస్తున్నారు. ఒక యూనిట్ విద్యుత్ కొంటూ, రెండుయూనిట్లకు డబ్బుచెల్లిస్తున్నారు.

2020 ఫిబ్రవరి నుంచి 2022 నాటికే ప్రభుత్వం రూ.18వేలకోట్ల భారాన్ని ప్రజలపై మోపింది
స్మార్ట్ మీటర్ల పేరుతో జగన్ ప్రభుత్వం భారీదోపిడీకి తెరలేపింది. రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో మీటర్లపేరుతో విద్యుత్ వినియోగదారులు అదనంగా దోపి డికీ గురికాబోతున్నారు. భారతదేశంలో ఏరాష్ట్రం పెంచనివిధంగా ఏపీ మాత్రమే భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఇప్పటికే మే, జూన్, జూలై నెలల్లో ప్రజలపై భారీగా విద్యు త్ ఛార్జీల వడ్డన జరిగింది. 2020 ఫిబ్రవరి నెలలో జగన్ ప్రభుత్వం ప్రజలపై రూ.1300కోట్లు, 2020 మే నెలలో రూ.1500కోట్లు, 2021లో కిలో వాట్ కు రూ.10చొప్పునపెంచి, విద్యుత్ వినియోగదారులపై రూ.3,542కోట్లభారం వేశారు.

2014-19సంవత్సరాల ట్రూఅప్ ఛార్జీలపేరుతో రూ.3,669కోట్లు, 2022 ఏప్రియల్ శ్లాబ్ ల్లో మార్పుల పేరుతో రూ.4,300కోట్లు, ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ పేరుతో రూ.700కోట్లు, 2021-22కి సంబంధించి విద్యుత్ కొనుగోళ్ల సర్దుబాటుపేరుతో రూ.3,000కోట్ల భారం వేశారు. ఈరకంగా ప్రభుత్వం రూ.18వే లకోట్ల భారం ప్రజలపైమోపితే, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పులతో రూ.36వే లకోట్లు, హిందుజాసంస్థకు చెల్లించే రూ.2,200కోట్లుకలిపి మొత్తం రూ.57వేల కోట్లభారాన్ని విద్యుత్ వినియోగదారులపై వేశారు.

4 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తిపెంచిందా?
2014లో చంద్రబాబుగారు ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రం 22వేల మిలియ న్ యూనిట్ల విద్యుత్ లోటులోఉంది. చంద్రబాబుగారి ఆలోచనలు, ఆయన చేపట్టి న విద్యుత్ సంస్కరణలతో 2019నాటికి రాష్ట్రం మిగుల్ విద్యుత్ లో నిలిచింది. 9వేల మెగావాట్ల ఇన్ స్టాల్డ్ కెపాసిటీని 19వేలమెగావాట్లకు పెంచడం జరిగింది. 4 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఒక్కమెగావాట్ విద్యుత్ ని అదనంగా తయారుచేసింది లేదు. డబ్బుసంపాదనతప్ప ప్రభుత్వానికి విద్యుత్ రంగం, వినియోగదారుల ఆలోచన పట్టడంలేదు. రాష్ట్రంలో తక్కువధరకు విద్యుత్ లభిస్తున్నా, దాన్నికాద ని కమీషన్లకోసమే బయటనుంచి అధికధరకు కొంటున్నారు. కేంద్రప్రభుత్వ సంస్థ లనుంచి కూడా విద్యుత్ కొనడంలేదు. ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే సవాల్ చేస్తున్నా.

2014 నుంచి 2019వరకు ఒక్కోకుటుంబం సరాసరిన చెల్లించిన విద్యుత్ ఛార్జీ ఎంత..ఈ 4ఏళ్లలో చెల్లించిన విద్యుత్ ఛార్జీఎంతో ప్రభుత్వం బయటపెట్టగలదా?
2014 నుంచి 2019వరకు రాష్ట్రంలోనిఒక్కో కుటుంబం సరాసరిన ఎంత విద్యుత్ ఛార్జీలు చెల్లించింది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ ఇప్పటి వరకు ఎంతచెల్లించిందో బయటపెట్టగలరా అని ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నాం. ఇద్దరున్నకుటుంబమైనా, పదిమందిసభ్యులున్న కుటుంబమైనా, ఏకుటుంబమై నా టీడీపీహాయాంలో ఎంతవిద్యుత్ బిల్లుకట్టింది, ఇప్పుడు ఎంత బిల్లుకడుతోందో చూస్తే విద్యుత్ రంగంలో జగన్మోహన్ రెడ్డిసాగిస్తున్న దోపిడీ బట్టబయలవుతుంది . 8వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ అదానీసంస్థకు కట్టబెట్టినదానిలో అవినీతికి తెరలేపారు. హైకోర్టుజోక్యంతో ప్రజలపై రూ.లక్షకోట్లవరకు భారం పడ కుండా నిలిచిపోయింది.

విలేకరులు అడిగినప్రశ్నలకు కేశవ్ సమాధానాలు…
5 ఏళ్లపాలనలో తెలుగుదేశం ప్రభుత్వం పైసా విద్యుత్ ఛార్జీ పెంచలేదు. గత ఐదేళ్లలో ఒక్కోకుటుంబం ఎంతవిద్యుత్ ఛార్జీచెల్లించింది..జగన్ వచ్చినప్పటినుంచీ 4ఏళ్లలో ఎంత చెల్లిస్తోందో చెబితే వాస్తవాలు తెలుస్తాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలపై బాదుడేబాదుడు అన్నాడు. ఇప్పుడు రాష్ట్రం లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎంతున్నాయి? బయటిమార్కెట్లో జగన్ ప్రభుత్వం అధి కధరలకు విద్యుత్ కొంటోంది అని మేం చెప్పడంలేదు.

ఎన్.డీ.పీ.సీ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ వాటా 244 మెగావాట్లు, ఎన్.డీ.ఈ.సీ.ఎల్ (వల్లూరు) 86మె గావాట్లు, ఎన్.డీ.పీ.ఎల్ (తమిళనాడు) నుంచి 121మెగావాట్లు, ఎన్.ఎన్.టీ.ఎస్ నుంచి 52మెగావాట్లు ఇలావివిధసంస్థలనుంచి రాష్ట్రానికి దగ్గరదగ్గరగా 500మెగా వాట్ల విద్యుత్ రావాల్సి ఉంది. దీన్ని వాడుకునే ప్రయత్నాలు చేయకుండా ప్రభుత్వం బయటిమార్కెట్లో అధికధరకు ఎందుకు కొంటోంది. గతంలో పవన విద్యుత్ ఉత్పత్తి ఆపేసి, ఓపెన్ మార్కెట్ ఎక్సేంజ్ లో కొన్నారు…ఎందుకు కొన్నారంటే సమాధానంలేదు.

హిందుజా సంస్థనుంచి విద్యుత్ కొనకుండా, బయటమార్కెట్లో కొనడంతో ఆ సంస్థసుప్రీంకోర్టుకు వెళ్లడంతో సంస్థతోలాలూచీపడి అప్పనంగా ఊరికే డబ్బుచెల్లిస్తున్నారు. ఇలాంటినిర్ణయాలతో ప్రజలపై భారంపడుతోంది. ప్ర జలు రోడ్లపైకి వస్తేనే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్టుకాదు. స్వేచ్ఛా, స్వాతంత్ర్యా లకు టీడీపీప్రభుత్వం విలువఇచ్చిందికాబట్టే ప్రజలు తమగళం వినిపించారు. ఇప్పుడు ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని అధికారంతో అణచివేసే ప్రయత్నాలు చేస్తు న్నారు. ఓట్లువేసే సమయానికి ప్రజలు ప్రభుత్వానికి ఎలా బుద్ధిచెప్పాలో అలా చెబుతారు.

జీవో-1ద్వారా రోడ్లపై రాకూడదని ప్రతిపక్షాలను నిలువరిస్తున్న ప్రభు త్వం, ప్రజాస్వామ్యఉద్యమాలపై ఎలాంటి ఆంక్షలు, అడ్డంకులు ఉండవని ఒక వారం వెసులుబాటువస్తే ప్రజలు రోజులతరబడి రోడ్లపైనే ఉంటారు. అన్నివర్గాల ప్రజలు రోడ్లపైనే వండుకొని తిని, అక్కడేపడుకొని ప్రభుత్వానికి చెప్పాల్సిన విధంగా బుద్ధిచెబుతారు.” అని పయ్యావుల స్పష్టంచేశారు.