గుడివాడను మరో గోవా కానివ్వం

Spread the love

– రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోంది
– పోలీసులు ఎంతకాలమని అన్యాయంగా వైసీపీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తారు
– రాష్ట్ర యువత నాశనం వైసీపీ ధ్యేయం అనే విధంగా వైసీపీ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు
– గుడివాడ ని క్యాసినో అడ్డా గా మార్చిన ఘనత మంత్రి కొడాలి నాని ది
– తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, కొనకళ్ల నారాయణరావు

మచిలీపట్నం : తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలనే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మంత్రి కొడాలి నాని లాంటి వ్యక్తులతో చంద్రబాబును తిట్టిస్తున్నారు అన్నారు. మంత్రి కొడాలి నాని గుడివాడలో క్యాసినో ఆడించింది వాస్తవం కాదా? క్యాసినో సంస్కృతితో గుడివాడ ను మంత్రి కొడాలి నాని మరో గోవాలా మార్చేశారు.

గుడివాడలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆటకాయింపులో పోలీసుల పాత్ర కూడా ఉంది. మేము గుడివాడ వెళుతున్నామని తెలిసే ముందుగానే వేలాది వైసీపీ కార్యకర్తలు, గుండాలు వచ్చారు అన్నారు.
బోండా ఉమా కారు ధ్వంసం చేసింది నిజమా కాదా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
గుడివాడలో మా కార్యకర్తలపై దాడులు జరిపి మమ్ములను వెళ్లనీయకుండా చేశారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందన్నారు. మా తెలుగుదేశం పార్టీ నాయకుడు ముళ్ళపూడి రమేష్ తీవ్రంగా గాయపడ్డారు అన్నారు.

గుడివాడ నిజ నిర్ధారణ కమిటీ తో టీడిపి నాయకులు వెళ్తే మమ్ములను అరెస్ట్ చేసినంత మాత్రాన నిప్పులాంటి నిజం బయట పడక మానదు అన్నారు. గుడివాడ కే కన్వెన్షన్ హాల్ లో జరిగిన నిజాలు అన్నీ నిగ్గు తేలుస్తాం. పామర్రులో పోలీసులకు వైసీపీ దాడులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వైసీపీ కార్యకర్తలకు పోలీసులు సహకరించారు. పోలీసుల వైఖరి పై డి ఐ జి కి ఫిర్యాదు చేస్తాం. వాస్తవాలను నిగ్గు తేలుస్తాం.

మా తెలుగుదేశం పార్టీ నాయకులను నిర్బంధించి పోలీస్ స్టేషన్ లో పెట్టి, మా టీడిపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డగించారు, వైసీపీ నాయకులు కార్యకర్తలు మా పై దౌర్జన్యం చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు.

మంత్రి కొడాలి నాని రౌడీయిజం లో రాయలసీమను మించిపోయారు అన్నారు. జూదం లో మంత్రి కొడాలి నాని నాయకత్వంలో గుడివాడ మించి పోయింది అన్నారు. గుడివాడలో జరిగిన భాగవతం అంత జిల్లా ఎస్ పి కి వీడియోల తో సహా ఫిర్యాదు చేసిన చర్యలు లేవు అన్నారు. పోలీసులు ఎంత కాలమని అన్యాయంగా వైసీపీ నాయకులకు తొత్తులుగా మారతారు. శాంతిభద్రతలను కాపాడవలసిన పోలీసులే ఇలా వైసీపీ నాయకుల చెప్పుచేతల్లో ఉండటమేమిటి అన్నారు.

ప్రజా తీర్పు నిజమైన తీర్పు, ప్రజలే నిజనిర్ధారణ కు మాకు సహకరిస్తారు అన్నారు. వాస్తవాలు బహిర్గతమవుతాయి అనే భయంతో గుడివాడలో వైసీపీ నాయకులు దాడులకు దిగారు అన్నారు.
గుడివాడ ను మరో గోవా కానివ్వము. గుడివాడ నియోజకవర్గం ముందు నుంచి తెలుగుదేశం పార్టీ దే పట్టు అన్నారు. మంత్రి కొడాలి నాని ఆడే అబద్ధాలు ప్రజలందరికీ తెలిసినవే అన్నారు. కొడాలి నాని కీ రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య), మాజీ మున్సిపల్ చైర్మన్, మోటమర్రి వెంకట బాబా ప్రసాద్, తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ ప్రచార కార్యదర్శి, పి.వి. ఫణి కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, మారకాని పరబ్రహ్మం, లంకేశష గిరి రావు, తలారి సోమశేఖర్, మాదివాడ వెంకట నరసింహారావు, ఎండి ఇలియాస్ పాషా, కాసాని భాగ్య రావు, ఎల్.హరి కృష్ణ, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, మర కాని సమత కీర్తి, దింట కుర్తి సుధాకర్, చిట్టూరి యువరాజ్, తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలు, పాలపర్తి పద్మజ, లంకి శెట్టి నీరజ, ఎన్ వసంత కుమారి, లతీఫ్ ఊనీ సా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply