– నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు
– ఎవరు అవినీతిపరులో ప్రజలకు తెలుసు
– మంత్రి కొప్పుల ఈశ్వర్
బండి సంజయ్, రేవంత్ రెడ్డి షర్మిల కళ్ళు లేని కబోదుల వ్యవహరిస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండపడ్డారు. శుక్రవారం జగిత్యాలలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈశ్వర్ మాట్లాడారు. నీతిమాలిన ప్రగల్బాలు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో కోట్లాది రూపాయలు అప్పుల ఇప్పుడే చేసిందని ఆరోపించారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో ఇరిగేషన్ వైద్యవిద్యారంగాలతో పాటు పల్లెలు పట్టణాలు అభివృద్ధి చెందిన విషయం వాస్తవం కాదా అన్నారు. 82,000 కోట్ల ఖర్చు చేసి కాలే శ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే45 లక్షల ఎకరాలు పంట సాగు అవుతుందని.. ఇది అభివృద్ధి కాదా ప్రశ్నించారు.
దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని వర్గాల, కులాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని.. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకపోతున్నారని అన్నారు. రైతుల కోసం రైతుబంధు, దళితుల కోసం దళిత బంధు వంటి పథకాలు ఏ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు చెప్పాలని మంత్రి కొప్పల ఈశ్వర్. సవాల్ చేశారు. పదేపదే ప్రభుత్వం అవినీతి పాల్పడుతుందంటూ చేస్తున్న ఆరోపణ నిరూపించాలని అన్నారు. ఇప్పటికైనా బ్యాలెన్స్ వస్తున్న వ్యతిరేకతను గుర్తించి తమ పార్టీ గురించి వివరించుకోవాలి తప్ప.. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు మానుకోవాలని సూచించారు. లేనట్లయితే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందనిహెచ్చరించారు.