Suryaa.co.in

Devotional

కర్ణుడి కోసం కృష్ణుడి కన్నీరు

కృష్ణుడు ఓ వ్యక్తి కోసం కన్నీళ్లు పెట్టాడంటే ఆ వ్యక్తి ఎంతటి ఉన్నతమైన వ్యక్తి అయ్యుండాలి?
అవునండి కృష్ణయ్య కర్ణుడి కోసం కన్నీళ్లు పెట్టాడు.యుద్ధంలో మరణంతో పోరాడుతున్న కర్ణుడిని చూసి కన్నీళ్లు పెట్టాడు కిట్టయ్య.కర్ణుడు చేసిన దానధర్మాలు అతడిని మృత్యువు దరి చేరకుండా ఉండడంతో, కృష్ణుడు కర్ణుడిని వెళ్ళి ఒక కోరిక అడిగాడు.కర్ణా .. నువ్వు దానం చేయగా పొందిన పుణ్యఫలాలన్నీ నాకు దానం చేయవా అని అడిగాడు.కర్ణుడు కృష్ణుడు అడగగానే దానం చేసేసాడు.అప్పుడు కృష్ణుడు కర్ణుడి తలను తన చేతులతో పట్టుకుని, నీకో వరమిస్తాను ఏమి కావాలో అడుగు అన్నాడు.

అందుకు కర్ణుడు నాకు ఇంకో జన్మ వద్దు. ఒకవేళ అలా ఉంది అంటే, అప్పుడు కూడా ఎవరు ఏమి అడిగినా లేదు అని చెప్పకుండా ఇచ్చేటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు అని అడిగాడు.ఆ మాట వినగానే కృష్ణయ్య కళ్ళు కన్నీటి ధారలై పొంగాయి. ఇంతమంచి వాడి వేంటయ్యా కర్ణా.. నువ్వు అని గట్టిగ కర్ణుడి దేహాన్ని తన హృదయానికి హత్తుకున్నాడు కృష్ణుడు.

మనం మంచి మనసున్న వారిమైతే చాలండి. దేవుడి మోక్షం కోసం తపస్సు చేయాల్సిన అవసరం లేదండీ. జీవితం ముక్తి పొందడం కోసం దైవదర్శనాలు అంటూ తిరగక్కరలేదండి.మంచి మనసుంటే చాలండి. ఆ భగవంతుడే దిగి వచ్చి తన గుండెలకు మనల్ని హత్తుకుంటాడు.కర్ణుడంత కరుణామయులం కాకపోయినా, ఏదో ఆయన చిటికిన వేలంత మంచిగా బతికేద్దాం అండి.కృష్ణుడు మనకోసం రాకపోయినా, నెమలి పింఛాన్నైనా రప్పించేసుకుందాం అండి మనం.సర్వే జనాః సుఖినో భవంతు!

– నాగమంజరి

LEAVE A RESPONSE