Suryaa.co.in

Features

క్షత్రియ జాతి పుట్టుక – చరిత్ర / పురాణములు

అద్వితీయమైన అవ్యక్త పరమాత్మ తన మాయ శక్తి చే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గను నా నా తత్వము తో కూడిన జగత్తు గను వ్యక్మమవుతాడు. ఆ పరమాత్మ ను దర్శించడం మానవుని పరమలక్షం ఆ పరమాత్మ యే సకల చరా చర సృష్టి ని దాని యెక్క స్థితి, లయలని నిర్వహిస్తూ అనేక రూపాల్లో అవతరిస్తు, పరిపాలిస్తూ ఉంటాడు.

ఆ సృష్టి లో దేవతలు, మానవులు,పశుపక్ష్యాదులు , స్తిరాలు (కదలనివి) అనబడే నాలుగు జీవ రాశులు ఉన్నవి. వాటిలో స్త్రీ పురుష బేధ ములు, సత్వ రజో తమో గుణ స్వభావ భేదములు ఏర్పడినవి.
మొదట ప్రపంచం లో ఇన్ని వర్ణములు లేవు అంతయు బ్రహ్మ మయమే కనుక. అందరూ బ్రాహ్మణులు గానే ఉండిరి.

కృతయగ అంతమున అంటే త్రేతా యుగం ప్రారంభం కంటే ముందు, మానవ జాతి ప్రవర్తనను క్రమబద్దం చేయడానికి బ్రహ్మచర్య గృహస్థ వాన ప్రస్త, సన్యాసఆశ్రమ ధర్మాలు, సత్వగుణ ప్రధానులను బ్రాహ్మణులు గను, రజోగుణ ప్రధానులను క్షత్రియులు గను తమోగుణ ప్రధానులను వైశ్య , శూద్రులు గను వర్ణ విభజన చేయ భ డి నది వారి మనుగడకు ధర్మార్థకామ మోక్షము లన బడే నాలుగు పురుషార్థాలు నిర్ధే శించ బడినది.

ఆ పురుషార్థాలు సాధించడానికి కావలసిన జ్ఞనాన్ని భగవానుడే మానవాళికి అందించడానికి చతుర్ముఖ బ్రహ్మ ద్వారా వేదాలను వెలువరింప జేశాడు. ఈ పరిణామ క్రమంలో 4 వేదాలు, 4యుగాలు 4వర్ణాలు (కులాలు) గా ఏర్పడడం గమనార్హం .

ఆ దేవదేవుడు క్రమం గా కాలను గుణము గా వరాహ, నరసింహ, నారాయణ, కపిల, దత్తాత్రేయ, ఋషభ, మత్స్య కూర్మ వరాహ శ్రీరామ, కృష్ణా దు లిరువులు క్షత్రియులుగా అవతారమెత్తి , రాజ్య పాలన సాగించి సత్యాన్ని ధర్మాన్ని కాపాడి ఆదర్శ పురుషులు గా దేవుళ్ళుగా పూజింపబడిరి సంభవించి. కానీ ఇతర అవతారములు ఏదో ఒక కార్య అర్థము కొరకు ముగించబడింది .

– గూడూరు ఆంజనేయరాజు

LEAVE A RESPONSE