మీ జగన్ ఏ రంగు చీర కట్టుకోవాలి చెప్పమ్మా..రోజమ్మ!

ఆడబిడ్డలపై లెక్కకుమిక్కిలి దారుణాలు జరుగుతున్నా…తాడేపల్లి కొంపదాటిబయటకురాని అసమర్థసీఎం మహిళాసాధికారకుడా.!
మహిళాసాధికారతంటే నీలాంటి ఆడవాళ్లతో చంద్రబాబు, లోకేశ్ లను బూతులుతిట్టించడం.. జబర్దస్త్ స్కిట్లలో నవ్వురాకపోయినా పడిపడినవ్వి రెమ్యునరేషన్ తీసుకోవడం కాదమ్మా..రోజమ్మా!
• ఎన్నికల్లో గెలుపోటముల గురించి తెలియని నువ్వు లోకేశ్ ఓటమిగురించి మాట్లాడటం సిగ్గుచేటు రోజా..
• విశాఖలో విజయమ్మను మీ నాయకుడు ఓడించాడా.. లేక ఆమే ఓడిపోయిందా?
• మూడేళ్లలో ముక్కుపచ్చలారని పసివాళ్లు మొదలు, ముసలివాళ్లవరకు అందరినీ ఉన్మాదులకు బలిచేసిన మీ నాయకుడు ఏరంగుచీరకట్టుకోవాలో చెప్పండి
• రోజమ్మా.. మాట్లాడితే సెక్స్ రాకెట్ కాల్ మనీ జపాలు చేయడంకాదు. చేతనైతే అధికారంలోఉన్న మీరు, ఆ వ్యవహారాల్లోని అసలైన నేరస్తులను శిక్షించండి
టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

వైసీపీనేతలు, ఆపార్టీనిసమర్థించే పేటీఎమ్ కుక్కలనిరాశానిస్పృహలు చూస్తుంటే, చేయాల్సి న నీచాలన్నీ చేస్తూకూడా వారు చెప్పేసూక్తులు వింటుంటే జుగుప్స కలుగుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత తెలిపారు.గురువారం ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనేక్లుప్తంగా మీకోసం…!

విజయవాడప్రభుత్వాసుపత్రిలో మానసికదివ్యాంగురాలిపై జరిగిన అత్యాచారఘటనను తన రాజకీయానికి వాడుకోవాలనిచూసిన మహిళాకమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ మెడకే చుట్టుకుంది. ఆమె ఒకఘటనను పట్టుకొని, దానిలో చంద్రబాబుగారిని, టీడీపీనేతల ను ఇరికించి, రాజకీయంగా లబ్ధిపొందాలని ప్రయత్నించి బొక్కబోర్లాపడింది. ఆమెమెడకు ఇప్పుడు 800కేసులు చుట్టుకున్నాయి. ఆమెస్థానంలోనిన్న ఒక ఆర్టిస్ట్ మాట్లాడింది..

ఆమె మాటలువింటే గురివిందగింజ సామెత గుర్తొస్తోంది. గెలుపుఓటములతో పనిలేకుండా తననునమ్ముకున్న ప్రజలకోసం కాలికిబలపంకట్టుకొని ఇంటింటికీ తిరుగుతూ, ప్రజలకష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ, వారికి నేనున్నాననే ధైర్యం, భరోసాకల్పిస్తున్న ఏకైక నాయకు డు లోకేశ్ ఒక్కరే. నిజంచెప్పాలంటే ప్రజలకోసంఅంతలా తపనపడుతున్న లోకేశ్ నాయకత్వాన్నిచూసి మీ తాడేపల్లి పిల్లి సిగ్గుతెచ్చుకోవాలని గుర్తుంచుకోండి. లోకేశ్ ఓడిపోయాడంటున్న సదరు ఆర్టిస్ట్ కూడా ఒకప్పుడు ఓడిపోయిన ఆమే.. ఆ విషయం మర్చిపోతేఎలా? ఆమెతననాయకుడు అదీ… ఇదీ..ఆహా…ఓహో అంటూ తెగడబ్బాలు కొడుతూంటుంది. మరి అదేనాయకుడు తనతల్లిని ఎందుకు విశాఖపట్నంలో గెలిపించుకోలే కపోయాడో ఆమే సమాధానంచెప్పాలి. మీ నాయకుడు బయటకు రావాలంటే వేలమంది పోలీసులు, ఇనుపకంచెలు, భారీభద్రతావలయాలుఉండాలి..కానీ లోకేశ్ గారికి అవేవీ అవసరంలేదు..

ఆయనగుండెలనిండా ధైర్యం ఉందని గుర్తుంచుకోండి. కనీసం షాపులు మూసేస్తే తప్ప మీనాయకుడు బయటకురాలేని దుస్థితి. పోలీస్ పహారాలేకుండా, ప్రజలముఖం చూడటానికి భయపపడుతూ రోడ్లమీదకు వస్తున్న మీ సీఎం ఏరంగు చీరకట్టుకోవాలో నువ్వేచెప్పమ్మా.. ఆర్టిస్టమ్మా. మీపార్టీ రంగుతో కూడిన బ్లూచీర పంపించమంటే పంపిస్తాం. మేం చీరలగురించి మాట్లాడటానికి కారణం మీ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మే. వెంట కానిస్టేబుల్ లేకుండా కనీసం సెక్రటేరియట్ కు వెళ్లి ధైర్యంగా కూర్చోలేని దుస్థితిలో మీ నాయకుడు ఉన్నాడు. చిన్నప్పుడు ప్రజల్ని దోచుకునే బందిపోట్లు వచ్చినప్పుడు ప్రజలు భయంతో ఇళ్లల్లో దాక్కొని కిటికీల్లోంచి చూసేవారు. ఇప్పుడుకూడా అదే పరిస్థితిని చూస్తున్నాం. బందిపోటుకన్నా దారుణంగా సీఎం వ్యవహ రిస్తున్నాడు. మీరు, మీ నాయకుడి సంగతిచూసుకోకుండా.. చంద్రబాబుగారి గురించి.. ఆయన నివాసం గురించి మాట్లాడుతూ శునకానందం పొందుతున్నారు.

వైసీపీమహిళానేతలు, మహిళామంత్రులు మహిళాసాధికారత జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమ నిచెబుతుంటే నవ్వాలో ఏడవాలో తెలియడంలేదు. మహిళాసాధికారత అంటే కచ్చాబాదం డాన్స్ లువేయడం…. జబర్ద స్త్ షోలో డబుల్ మీనింగ్ డైలాగులకు నవ్వురాకపోయినా వికవికా..పకపకా నవ్వుతూ రెమ్యునరేషన్ తీసుకోవడం కాదని.. పిచ్చిపిచ్చి స్కిట్ లు చేయడం కాదని తెలుసుకోండమ్మా. మహిళాసాధికారత అంటే ఏమహిళైనా సరే.. తను ఒకరిపై ఆధారపడకుండా, స్వయంగా తనకాళ్లపై తానునిలబడి, ఆత్మస్థైర్యంతో జీవించడం. తను ధైర్యంగా ఉంటూ… తనకుటుంబాన్ని పిల్లలను కాపాడుకోవడం. వారికి అండగా ఉండి సగర్వంగా బతకడం. ఏమహిళైనా సరే ఇలాంటి జీవనాన్నే కోరుకుంటుందికానీ బిక్కుబిక్కు మంటూ నిత్యం చస్తూబతుకుతూ బతకడంకాదమ్మా.

ముఖ్యమంత్రి ఇంటిసమీపంలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన వెంకటరెడ్డిని పట్టుకొని శిక్షించలేని దుస్థితిలో మీప్రభుత్వం ఉందమ్మా? మీ నాయకుడి పనితీరు అంతగొప్పగా ఉంది. ఇవన్నీ ఆలోచించాక చీరఎవరు కట్టుకోవాలో… ఇప్పుడు చెప్పండి.

భర్తకళ్లెదుటే ఆడబిడ్డపై మానభంగం జరిగితే నిందితులను శిక్షించలేని సీఎం చీరకట్టుకోవా లా..లేక తామా? అభంశుభం తెలియని మానసికదివ్యాంగురాలిపై 30గంటలపాటు అందరూ తిరుగుతున్న సమయంలోనే పట్టపగటే అత్యాచారం జరిగితే మీ ముఖ్యమంత్రి, మీ అధికార యంత్రాంగం ఏంచేసిందమ్మా? ఆ అభాగ్యురాలిని కనీసం వెళ్లిపలకరించలేని మీ ముఖ్యమం త్రి చీరకట్టుకోవాలా…లేక తామా? చూడమ్మా పెయిడ్ ఆర్టిస్టూ …. ఎప్పుడో జరిగిన సెక్స్ రాకెట్ గురించి, కాల్ మనీ వ్యవహారం గురించి మాట్లాడటంకాదు.నువ్వు చెప్పే వ్యవహారాల్లో నిజంగా టీడీపీనేతలప్రమేయం ఉండిఉంటే, మీ ప్రభుత్వం, మీ నాయకుడు ఏంచేస్తున్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఎందుకు అసలైనవారిని పట్టుకొని శిక్షించలేకపోయారు? చిన్నదారందొరికితేనే దాన్నిపట్టుకొని సంబంధంలేనివాళ్లపై నిందలు వేయడంలో మీరు బాగా సమర్థులుకదా.. అలాంటివారు అధికారంలో ఉండి ఇన్నేళ్లనుంచి ఏం చేస్తున్నారు? అధికారంలో ఉన్నా… అడుక్కుతింటున్నా మీకు చంద్రబాబుగారిపై పడి ఏడవడం తప్ప ఇంకోటి చేతగా దు? ఒక అనూష, ఒక రమ్య…ఒక వరలక్ష్మి, ఒక తేజస్విని, ఒక నాగమ్మ ఇలా అనేకమంది అభాగ్యురాళ్లను దారుణంగాపొడిచిపొడిచి చంపేస్తే మీ సీఎం ఏం చేశాడో చెప్పమ్మా రోజమ్మా? కనీసం ఘటనలు జరిగిప్పుడు బయటకువచ్చి మాట్లాడటానికి కూడా మీనాయకుడికి ముఖంచెల్లలేదు. అలాంటి అసమర్థస్థితిలో ఉన్న మీ నాయకుడు ఏరంగు చీర కట్టుకోవాలో చెప్పమ్మా రోజమ్మా? తన సొంత నియోజకవర్గంలో నాగమ్మ అనే దళితమహిళను దారుణంగా చంపబడితే మీ నాయకుడు నోరుతెరవలేదు. అదీ మీ దమ్ము, ధైర్యం. రాష్ట్రంలో ఆడబిడ్డలపై నిత్యం దారుణాలు..

అఘాయిత్యాలుజరుగుతుంటే మీ ముఖ్యమంత్రి ఏంచేస్తున్నాడో చెప్పండమ్మా? విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన అత్యాచారం ఘటనపై మీ ముఖ్యమంత్రి ఏంచర్యలు తీసుకున్నారో చెప్పమ్మా? అభాగ్యురాలిని పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబుగారు, టీడీపీనేతలను అడ్డుకొని రాజకీయంచేయడం తప్ప మీరేంచేశారు? అన్యాయంజరిగినా నోరెత్తలేని స్థితిలోఉన్న మీ సీఎం ఏరంగు చీరకట్టు కోవాలో మీరే తేల్చండి. ఆడబిడ్డలు బలైపోతున్నా…కనీసం మానవత్వంతో ఇదేంటని మీ ముఖ్యమంత్రిని అడగలేని అసమర్థస్థితిలో ఉన్నమీరంతా మంత్రులు… మీలా బతకడం మాకుచేతగాదు. మేం నిలదీస్తాం.. కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తూనేఉంటాం. ఇప్పుడే కాదు… రేపు అధికారంలోఉన్నాకూడా తప్పుజరిగితే మమ్మల్నిమేంప్రశ్నించుకుంటాం. అది రాజ్యాం గ పరంగా మాకువచ్చిన హక్కు.

గెలుపోటములగురించి మాట్లాడేరోజమ్మా.. నీనాయకుడు ఆయన తల్లిని ఎందుకు గెలిపించు కోలేకపోయాడో చెప్పమ్మా. తల్లిచెల్లీ హైదరాబాద్ లోపడి రోడ్లవెంట తిరుగుతుంటే, మరోచెల్లి ఢిల్లీలో బిక్కుబిక్కు మంటూ తిరగడానికి కారణం ఎవరమ్మా.. మీనాయకుడి అసమర్థత కాదా? ఊరికో ఉన్మాది అంటే ఉలుకొచ్చిందా? ఎందుకంతలా ఉలిక్కిపడుతున్నారమ్మా.. రోజమ్మా. మీపార్టీలోఉన్మాదులు లేరా? మీప్రభుత్వంలోఊరికోఉన్మాది లేడా? ఉన్నాడని నిరూపించడానికితాము సిద్ధం. మేం పుస్తకం విడుదల చేశాకే మీలో ఉలుకొచ్చింది. గుంటూరుజిల్లాలోని పేరేచర్లలో మైనర్ బాలికపై నెలన్నరపాటు దాదాపు 80మంది దుర్మార్గు లు అఘాయిత్యానికి పాల్పడితే మీరేం చేశారమ్మా? ఆ ఘటనలో మీ పార్టీనేతలు ఉన్నారని ఉలిక్కిపడుతున్నారా? భూశంకర్ నాయుడు వైసీపీ ఉన్మాది కాదా? అనిల్ యాదవ్ మీ పార్టీ ఉన్మాదికాదా? వాలంటీర్లు మీ జగన్ రెడ్డి తయారు చేసిన ఉన్మాదులుకారా? తిరువూరులో మొన్నటికిమొన్న మహిళస్నానంచేస్తుంటే వీడియోలు తీసింది వైసీపీఉన్మాదికాడా? మీ నాయకుడు 16నెలలు జైల్లో ఉండొచ్చాడని, మీపార్టీవారుకూడా ఆయన్నే ఆదర్శంగా తీసుకొని ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నారా? ఉన్మాదుల అడ్డా.. మీపార్టీ. అది తెలుసుకోమ్మా..రోజమ్మా. మేం బూతులు మాట్లాడుతున్నామని నువ్వు అనడం విచిత్రంగా ఉందమ్మా.

చంద్రబాబుగారు, లోకేశ్ లను ఇష్టానుసారం తిట్టడమేకాకుండా, మాపార్టీ వారంద రినీ అనరాని మాటలంటున్నారు. మీరు బూతుల్లో పీహెచ్ డీ చేసి, మేం మాట్లాడుతు న్నామని అంటున్నారు చూడమ్మా.. అందుకు మీరు నిజంగా సిగ్గుపడాలమ్మా. మీ మాజీమంత్రి అమ్మాయిలతో డ్యాన్సులువేయించి, కేసినోలునిర్వహించినప్పుడు, దానిపై ప్రశ్నించామన్న అక్కసుతో మమ్మల్ని, మాపార్టీవారిని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టినప్పుడు అవినీకు బూతుల్లా కనిపించలేదమ్మా..రోజమ్మా? ఆరోజు నువ్వు, మీ నాయకుడు ఎందుకు నోరు మెదపలేదమ్మా? అన్నీతెలిసి నోరెత్తలేని స్థితిలోఉన్న మీ నాయకుడు ఏరంగుచీరకట్టు కుంటాడో ఇప్పుడు చెప్పండమ్మా!
మాట్లాడితే డ్వాక్రా అక్కచెల్లెమ్మలగురించి చెబుతున్నారు. డ్వాక్రామహిళల్నిగానీ, సంఘాల్ని గానీ బలోపేతంచేసింది… వారికి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది చంద్రబాబుగారమ్మా.

టీడీపీహాయాంలోప్రతి డ్వాక్రామహిళకు రూ.20వేలచొప్పున ఆర్థిక సాయంచేస్తే… మీరుచచ్చీచెడి రూ.14వేలు ఇవ్వడానికే కిందామీదాపడ్డారు. ఆ సొమ్మైనా అందరికీ ఇచ్చారా అంటే అదీలేదు. ఆఖరికి మీ నాయకుడు డ్వాక్రామహిళలపొదుపు సొమ్మునికూడా దిగమింగాడుకదమ్మా. వారుసంఘాలతరుపున రోజుకో రూపాయిచొప్పున దాచుకున్న రూ.2వేలకోట్లను కాజేసినసంగతి నీకుతెలియదా రోజమ్మా.. దానిగురించి ఎప్పుడూ నువ్వు మాట్లాడలేదేం? ఆడవాళ్లసొమ్ము దిగమింగినమీరు.. మీ నాయకుడు, మీ ప్రభుత్వం మహిళాసాధికారత, మహిళాఔన్నత్యం లాంటిపెద్దపెద్ద మాటలు మాట్లాడటం సిగ్గు చేటమ్మా. ఆఖరికి ఆడబిడ్డలను కాపాడటానికి మీనాయకుడు, మీప్రభుత్వం సొంతంగా రక్షణచర్యలుతీసుకోలేక, ఎప్పుడోచంద్రబాబుగారిహాయాంలో రూపొందించిన ఫోర్త లయన్ యాప్ ని మీరు తయారు చేసినట్టుగా చెప్పుకొని దిశాయాప్ పేరుతో తీసుకొచ్చారు. అదీ మీ పనితనం! జగన్ రెడ్డిని.. ఆయనభార్య భారతిని ఏమైనా అంటే ఊరుకోరా? ఏమ్మా… అంతలా పొడుచుకొస్తుందా? మేం మాట్లాడుతూనే ఉంటాము.

ఆడబిడ్డలను, అభంశుభం తెలియని చిన్నారులనుకాపాడలేని అసమర్థ సీఎం గురించి ఇలానే మాట్లాడతాం. తన భర్త ముఖ్యమంత్రి కావాలని ప్రజల్లోకివచ్చి వారిని అబద్ధపుమాటలతో నమ్మించి, చివరకు ఇప్పుడు రాష్ట్రంసర్వనాశనమవుతున్నా, మహిళలుబలైపోతున్నా.. తనకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న ఆయన సహధర్మచారిణి గురించి కూడా మాట్లాడతాం. మీకు, మీ హెచ్చరికలకు, మీఅధికారానికి భయపడే రోజులు పోయాయని గుర్తుంచుకోండి.

Leave a Reply