– కేటీఆర్ ఒక పనికిమాలిన వ్యక్తి
– ప్రతిపక్ష నేత పదవి కోసం కేటీఆర్, హరీశ్ రావు కొట్టుకుంటున్నారు
– కేసీఆర్ మాదిరి తాను ఎలెక్షన్, కలెక్షన్ చేయలేదు
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, హరీశ్ రావు తన కాలిగోటికి కూడా సరిపోరని అన్నారు. కేటీఆర్ ఒక పనికిమాలిన వ్యక్తి అని… పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు.
కేటీఆర్ పై ఉన్న అవినీతి ఆరోపణలు తనపై లేవని అన్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తనపై ఒక్క అవినీతి మరక కూడా లేదని చెప్పారు. కాంగ్రెస్ సభల్లో పల్లీలు, ఐస్ క్రీమ్ లు అమ్ముకునేంత మంది కూడా కేటీఆర్ సభకు రారని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష నేత పదవి కోసం కేటీఆర్, హరీశ్ రావు కొట్టుకుంటున్నారని కోమటి రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేసి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. కేసీఆర్ మాదిరి తాను ఎలెక్షన్, కలెక్షన్ చేయలేదని కోమటిరెడ్డి అన్నారు.