Suryaa.co.in

Andhra Pradesh

కుహనా రాజకీయ సెక్యులర్ పార్టీలను ప్రజలే అడ్డుకుంటారు

(లంకా దినకర్ , బీజేపీ నేత )

సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నీడలో మొలకెత్తిన మమతా, పవర్ మరియు కనబడని ముసుగు పార్టీల అసహనం బహిర్గత పరుస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ పైన చేసిన వ్యాఖ్యలు.. ఓటు బ్యాంక్ కోసం కొంతమందిని సంతృప్తి పరిచి, మిగతా ప్రజలను మోసం చేయడం కోసం మాత్రమే.
దేశంలో ప్రజలు శాంతి సామరస్యంలతో జీవిస్తున్నారు కాబట్టే, మైనారిటీ సంతుష్టికరణ రాజకీయ గ్రూప్ బయటకు వచ్చి , కుహాన సెక్యులర్ భావాలు వార్చి వడ్డించే ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ట్రిపుల్ తలాక్ తో ముస్లిం మహిళలకు స్వేచ్ఛ రావడాన్ని “మతోన్మాదం” అంటారా ?
సీఏఏ చట్టం ద్వారా పొరుగు దేశాల్లో నివసిస్తు, నరకం చూస్తున్న అక్కడి మైనారిటీ వర్గాలకు పౌరసత్వం ఇవ్వడం “అసహనం” అంటారా?
ఆర్టికల్ 35A రద్దు ద్వారా ఆర్టికల్ 370 ని నిర్వీర్యం చేసి, జమ్మూ కాశ్మీర్లో స్వేచ్ఛ వాతావరణం కల్పించడం ” అసత్యం ” అంటారా?
” భయం ” ఏవరికి ? ట్రిపుల్ తలాక్, సీఏఏ చట్టం వచ్చాకా, ఆర్టికల్ 35A రద్దు ద్వారా ఆర్టికల్ 370 నిరుపయోగం అయ్యాక, వీటి ద్వారా మన దేశంలో మైనారిటీలకు ఇబ్బంది అని అబద్ధాలు రెచ్చగొట్టే ప్రచారం చేసినవారు నేడు భయపడుతున్నారు.

మోసం ఎవరు చేశారు? ఇన్ని రోజులు కుహాన సెక్యులరిజం ముసుగులో హిందూవులను బూచి గా చూపి, మైనారిటీ సంతుష్టికరణ రాజకీయాలను చేస్తూ ప్రజలను మోసం చేశారు, మోడీ వచ్చాక ఈ సంతుష్టికరణ రాజకీయాలకు చరమ గీతం పడింది.

“బెదిరింపు” లకు పాల్పడుతున్నాది ఎవరు? సాధువుల పైన మూక దాడి జరిగితే ప్రశ్నించరు?, జే ఏన్ యూ లో భారతదేశ పతకాన్ని అవమానం చేస్తూ, శత్రు దేశాలకు అనుకూలంగా నినాదాలు ఇచ్చే వారికి , మద్దతు తెలిపేవారు దేశ ప్రజలందరిని ” బెదిరిస్తున్నారు”.

మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో చర్చకు, ఈ కుహనా సెక్యులర్ రాజకీయాలు చేసే పార్టీలు సిద్ధమా ?
చరిత్రను ఎవరు వక్రీకరణ చేస్తున్నారు? గాంధీ, నెహ్రూలతో పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, శివాజీ, ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజు లాంటి యోధుల త్యాగాలను స్మరిస్తే, చరిత్ర వక్రీకరణ అంటారా ?, స్వతంత్ర పోరాటంలో అత్యధిక సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన వీర సావర్కర్ స్ఫూర్తితో పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్, చైనా యుద్ధంలో భారత సైన్యానికి చేసిన సేవలు మరియు రిపబ్లిక్ డే పెరేడ్ లో ఆర్ఎస్ఎస్ ఎవరు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు పాల్గొన్నారు? నాటి దివిసీమ ఉప్పెన నుండి, మొన్న కోవిడ్19 అనిశ్చిత పరిస్థితులలో దేశంలో కోట్లాది మంది ప్రజలకు ఆహారం, నిత్యావసర వస్తువులను అందజేసిన సంగతి, అన్నమయ్య డ్యాం వరద బాధితులకు అండగా నిలబడిన ఆర్ఎస్ఎస్ పైన, అవాకులు చవాకులు పేలుతూ చరిత్ర ని వక్రీకరణ చేస్తున్నది ఏవరు ?

కోవిడ్ 19 అనిశ్చిత పరిస్థితులలో దేశ ఆర్థిక వ్యవస్థ పైన, దేశీయ వ్యాక్సినేషన్ పైన అసత్యాలు ప్రచారం చేసిన ఈ కుహన సెక్యులర్ గ్యాంగ్, ప్రధాన మంత్రి మోడీ మౌనం గా తన పని తాను చేసుకుంటూ పోయి, నేడు ఆత్మనిర్భర్ స్వదేశీ వాక్సినేషన్ తో సత్తా చాటి ఆర్థిక వ్యవస్థని సక్రమమైన దారిలో పెట్టారు కాబట్టే.. ఇప్పుడు ” అసహనం ” తో కేవలం అధికారం కోసం ప్రశాంత భారత్ ని, అశాంతి భారత్ గా మార్చాలని చూస్తున్నారు. కానీ ఏ ధర్మం ఈ దేశానికి మూలమో.. ఆ ధర్మాన్ని కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుని, మిగతా ధర్మా లను గౌరవించుకునే సంస్కృతి పెంపొందించేందుకు మోడీ కృషి చేస్తున్నారు.

 

LEAVE A RESPONSE