Suryaa.co.in

Devotional

కుజదోషం బాధ పెడుతోందా?తేలికైన నివారణ మార్గం!

కుజ దోషం ఉంటే పెళ్లి కాదా?
ఏం చేయాలి?
కుజ దోషం వలన వివాహం మాత్రమే సమస్య ?
ఇంకా ఇతర ఇబ్బందులు ఉంటాయా ?
పరిష్కార మార్గము ఏమిటి ?
ఒక వ్యక్తి యొక్క ఆత్మగౌరవం, అహం, స్వభావం వంటి వాటిని కుజుడు సూచిస్తాడు.
బర్త్ చార్ట్ లో కుజుడు ఉండే స్థానాన్ని బట్టి దూకుడు స్వభావం కలిగి ఉండటం, స్వభావంలో సమస్యలు ఎదురవుతాయి.
ఒక వ్యక్తి జాతకంలో 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే కుజ దోషం ఉన్నట్లు అర్థం. ఈ స్థానాల్లో కుజుని ఆధిపత్యమే కాకుండా.. సూర్య, గురు, రాహు, కేతువులు ఆధిపత్యం వహించడం లేదా ఆ గ్రహాల దృష్టి కుజునిపై పడే విధంగా ఉంటే కుజ దోషం ఉందని జ్యోతిష్యులు చెబుతారు.
కుజ దోషం లగ్నంలో ఉంటే ఉద్వేగాన్ని, ద్వితీయంలో ఉంటే కుటుంబంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తాడు. చతుర్థంలో ఉంటే అది సౌఖ్యస్థానం కావడం వలన సుఖాన్ని అధికంగా కోరుకుంటూ పొందలేక ఇబ్బందులు పడతారు. సప్తమంలో ఉంటే కళత్రంపై దాని ప్రభావం ఉండటం వల్ల కష్టాలకు శ్రీకారం చ్టుటినవారౌతారు. అష్టమంలో ఉంటే ఆకస్మిక నష్టాలకు గురౌతారు. 12లో ఉంటే శయ్యాసౌఖ్యాన్ని, నిద్రను కోల్పోతారు.
కుజ దోషం కారణంగా విడాకులు, భార్యాభర్తలు విడిపోవడం వంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. సంక్షోభం, కలత ఎదుర్కోవాల్సి వస్తుంది.
కుజ దోషం వల్ల భాగస్వామి చనిపోయే అవకాశముందని చెప్తుంటారు .
కుజ దోషం నుంచి బయటపడటానికి చాలా మంది రకరకాలుగా పూజలు కూడా చేస్తారు. పరిష్కారాలున్నాయని చెబుతారు.వాటిలో కొన్ని…..
1) కుజ దోషం ఉన్న వాళ్లకు ప్రధానంగా కుంభ వివాహం చేస్తారు. అంటే అరటిచెట్టుకు లేదా రావి చెట్టుకు లేదా వెండి లేదా బంగారు విష్ణువు ప్రతిమకు కుజ దోషం ఉన్న వ్యక్తితో పెళ్లి జరపడం వల్ల కుజ దోషం తొలగిపోతుందని సూచిస్తారు. కుజ దోషం వల్ల కలిగే అనర్థాలను ఈ పెళ్లి ద్వారా పోగొట్టుకోవచ్చని నమ్మకం.
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కి కూడా కుజ దోషం ఉండటంతో.. ఆమెకు ముందుగా రావి చెట్టుతో పెళ్లి చేశారు. తర్వాతే అభిషేక్ బచ్చన్ తో వివాహం జరిపించారు.
2) కుజ దోషం ప్రభావం నివారించుకోవడానికి నవగ్రహ దేవతలను పూజించడం మరో పరిష్కార మార్గం. ప్రతి మంగళవారం నవగ్రహాలకు పూజ చేయడం వల్ల కుజ దోషం నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే మంగళవారం హనుమాన్ ని దర్శించుకుని నెయ్యి దీపం వెలిగించినా.. ఈ దోషం తొలగిపోతుంది.
3) కుజ దోషం ఉన్న ఇద్దరూ అంటే స్త్రీ, పురుషులకు పెళ్లి చేస్తే.. ఎలాంటి చెడు ప్రభావం ఉండదు.
ఇంకా అనేక మార్గాలు పండితులు చెప్తుంటారు ఐతే పరిష్కార మార్గము ఏమిటి ?
దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామి కుజునికి అధిపతి కావున సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన దోష నివారణ జరుగుతుంది.
సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం , కుజ శ్లోకం పారాయణ చేస్తూ , కుజ జపం చేయించుకోవడం , హోమం చేయించడం వలన దోషం నుండి విముక్తి పొందవచ్చు .
కుజ దోషం ఉన్నవారు లేక అంతర్లీన జాతక దోషం ఉన్నవారు దోష నివారణకు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం లో గోత్ర , నామ , నక్షత్రములు తెలియచేస్తూ సంపూర్ణ సుబ్రహ్మణ్య ఆరాధన చేయించడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి.
సేకరణ : హైందవ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్

LEAVE A RESPONSE