Suryaa.co.in

Andhra Pradesh

‘విద్య వద్దు-మద్యం ముద్దు’ అన్నట్టు జగన్ పాలన

– బీజేపీ నేత లంకా దినకర్
రాష్ట్రంలో ‘విద్య వద్దు – మద్యం ముద్దు’ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయంతో ఎయిడెడ్ పాఠశాలల్లో పిల్లల చదువులు రోడ్డున పడ్డాయన్నారు. సీఎంకు మద్యం దుకాణాల నిర్వాహణపై ఉన్న మక్కువ విద్యాలయాల నిర్వాహణపై లేదన్నారు. అదనపు అప్పు కోసం మద్యం రేట్లు పెంచి మద్యం వినియోగదారులతో ఆ అప్పు కట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.మద్యం ఆదాయం కన్సలిడేట్ ఫండ్‌కి కాకుండా ఏస్క్రో ఖాతకు మళ్లించే జీవో రాజ్యాంగ వ్యతిరేకమని లంకా దినకర్ అన్నారు. వ్యాట్ తగ్గితే ఆ వస్తువు ధర తగ్గుతుంది కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కాదని, ఇదే మోడరన్ “జగనామిక్స్ అని, మరి వ్యాట్ పెంచినప్పుడు కూడా ఇదే సూత్రం పాటించగలరా? అని ప్రశ్నించారు. మద్యం ఆదాయంపై ఆధారపడి పాలన చేసే రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలో ఏక్కడ ఉండదేమో అని అన్నారు. క్రమంగా మద్యం రద్దు అన్న జగన్.. మద్యం నిర్మూలన కోసం ఒక సలహాదారుని నియమించి లక్షల్లో జీతం ఇస్తున్నారని, కానీ రాష్ట్రంలో మద్యం అమ్మకాలను పెంచుతున్నారని విమర్శించారు. మద్యం నిర్మూలన కోసం ఉన్న సలహాదారు మద్యం ఆదాయం పెంచడానికా? అంటూ ప్రశ్నించారు.

LEAVE A RESPONSE