– సమస్యలు పరిష్కరించమంటే అక్రమ అరెస్ట్ లు, నిర్బంధాలా?
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు
డిమాండ్ల పరిష్కారం కోసం చలో విజయవాడ చేపట్టిన ఆశా వర్కర్లపై పోలీసుల లాఠీచార్జ్ జగన్ రెడ్డి నియంతృత్వ పాలనకు పరాకాష్ట. ఆశాలపై లాఠీచార్జ్ ను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఐదేళ్లుగా ఆశాలతో వెట్టిచాకిరీ చేయిస్తున్న జగన్ రెడ్డి వారి సమస్యలను పరిష్కరించకపోవడం దుర్మార్గం కాదా? బాధితుల పక్షాన నిలడాల్సిన పోలీసులు అధికార వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఆశాలకు రూ.10 వేల జీతం ఇస్తానని ముఖ్యమంత్రిగా మొదటి సంతకం చేసిన జగన్ రెడ్డి హామీ ఎందుకు నిలబెట్టుకోలేదు?
టీడీపీ హయాంలో అంగన్వాడీలకు జీతాలు పెంచి చంద్రబాబు గారు ఉద్యోగ భద్రత కల్పిస్తే…. జగన్ రెడ్డి ఆదాయ పరిమితి నిబంధనతో వారిని సంక్షేమానికి దూరం చేయడం నమ్మించి వంచించడం కాదా? ఉద్యోగ భద్రత కల్పించకుండా,శెలవులు ఇవ్వకుండా, పనిభారంతో ఒత్తిడి పెంచితే నిరనస తెలిపే హక్కు ఆశాలకు లేదా? రాష్ట్రమేమైనా జగన్ రెడ్డి జాగీరా? క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలు, శిశువులను వైద్యమందేలా చూసే ఆశా వర్కర్లపై జగన్ రెడ్డి కక్ష కట్టడం అమానుషం. తక్షణమే ఆశావర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి. లేనిపక్షంలో ఆశాలు తాడేపల్లి ప్యాలెస్ ముట్టడించడం ఖాయం.